Anand Shankar
-
నన్ను వదిలేయండి ప్లీజ్
‘‘మొన్ననే ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్.. ఇప్పుడు ‘నోటా’ ప్రమోషన్స్. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రమోషన్స్‌తో చాలా అలసిపోయాను. శుక్రవారంతో ఈ ప్రమోషన్స్‌కి స్వస్తి చెబుతా. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదు. అయినా ఇది చాలా మంచి అనుభూతినిస్తోంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా, మెహరీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► రాజకీయాలంటే ఇష్టం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని దింపుతారు. అప్పుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ‘నోటా’ కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే నటనంటే నాకూ ఇష్టమే. ఇందులో కొన్ని సొసైటీలో జరిగిన సంఘటనలున్నాయి. ‘నోటా’ని ఎంకరేజ్ చేయాలన్నది మా సినిమా ఉద్దేశం కాదు. టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం. ► ‘నోటా’ కథ విన్నప్పుడు తమిళ రాజకీయాల గురించి తెలియదు. కథ వినగానే కనెక్ట్ అయ్యా. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మా సినిమా చూశాక ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ సినిమా తెలంగాణలోని ఓ పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. వివాదం చేసేకొద్దీ మా చిత్రానికి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి (నవ్వుతూ). అయినా వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ► నటుడిగా బిజీ కాకపోతే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళదామని గతంలోనే బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నా. జనరల్‌గా సినిమా రిలీజయ్యాక పైరసీ చేయడం కామన్. అయితే ‘గీత గోవిందం’ 2.30 గంటలు లీక్ అయింది. ప్రేక్షక్షులు థియేటర్‌కి రారేమో? అనుకున్నా. ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్ అయింది. ఈ రెండు సినిమాల కోసం ఏడాదిన్నర్ర పనిచేశా. ఇలా లీక్ చేస్తే సినిమా చేసి ఏం లాభం? అనిపించింది. ► తమిళ్లో మంచి సినిమాలు చేస్తున్నారని మనవాళ్లు అంటున్నారు. కానీ, తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి..’ వంటి ఎన్నో మంచి సినిమాలొస్తున్నాయి. మంచి నటీనటులు, రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు గ్రాండ్‌గా ఉంటున్నాయి. చక్కటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ► ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్ అవుతుందని నేను, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్ చేస్తా. ► ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. ‘నోటా’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోల్లో మీతో కలిసి ఉన్న ఫారిన్ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు.. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. వేరే ఎవరో అని చెప్పను. తను ఓ మంచి అమ్మాయి’ అని నవ్వేశారు. -
నా సినిమా ఆపాలని చూస్తున్నారు: విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో పబ్లిక్ మీట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్.సి.సుందర్ సంగీతం అందించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడులో రిలీజ్ చేసాం. మాములు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఏ హీరోకి ఇలాంటి రికార్డులను సాధించడం సాధ్యం కాలేదు. ఒక్క విజయ్‌కే అది దక్కింది.’ అన్నారు దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి చాలా థాంక్స్. ఇక విజయ్ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్‌తో విజయ్ దగరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వస్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది. రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు. -
పబ్లిక్ మీట్
‘‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. మెహరీన్ కథానాయిక. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా విజయవాడ, హైదరాబాద్‌లలో భారీ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఈ మీటింగులకు ‘ది నోటా పబ్లిక్ మీట్’ అని పేరు పెట్టారు. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఇది. మెహరీన్ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటించారు. ‘‘ఇటీవల రిలీజైన ‘నోటా’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘నోటా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న సినిమా నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్ రచయిత, నిర్మాతల మధ్య వివాదంతో ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. అయితే తాజా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 5న నోటా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ సినిమాలో టాప్ డైరెక్టర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సీవాలా చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసిన విజయ్.. బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న నోటాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్ శంకర్.. మురుగదాస్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్ చేస్తుండటంపై ఆనంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ నోటా ట్రైలర్ రిలీజ్
-
‘ముఖ్యమంత్రి పదవా.. మ్యూజికల్ చైర్స్ ఆటా?’
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్ తరువాత తెరకెక్కుతున్న నోటాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. బుధవారం స్నీక్‌పీక్ పేరుతో 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (గురువారం) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విజయ్ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి ఆహ్వానిస్తూ నోటా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నోటా : రాజకీయ నేతగా రౌడీ
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్హిట్ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా స్నీక్‌పీక్ పేరుతో ఓ 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో విజయ్ పబ్‌లో ఎంజాయ్ చేసే కుర్రాడిగా తరువాత ఓ రాజకీయనేతగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఈ నెల 6 సాయంత్రం 4 గంటలకు అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నోటా : డిఫరెంట్ లుక్‌లో విజయ్ దేవరకొండ
-
హాట్ టాపిక్‌గా విజయ్ దేవరకొండ నెక్స్ట్
సాక్షి, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో సెన్సేషన్‌కు తెర లేపాడు. అతను నటిస్తున్న ద్విబాషా చిత్రం టైటిల్‌ను నిర్మాతలు ప్రకటించారు. నోటా అన్న టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసేశారు. ఇంక్ మార్క్ వేసి ఉన్న మధ్య వేలును చూపిస్తున్న విజయ్ దేవరకొండ పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ లుక్‌తో నోటా పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సాగే సినిమా అన్నది స్పష్టమౌతోంది. సమకాలీనన రాజకీయాలు.. పొలిటికల్ లీడర్ అయిన హీరో తండ్రి, తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు అన్నదే చిత్ర ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయంట. ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయిక కాగా, కీలక పాత్రల్లో సత్యరాజ్, నాజర్‌లు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ నోటాను రూపొందిస్తున్నాడు. My Official Statement.#NOTA pic.twitter.com/KcuUUTpPpy — Vijay Deverakonda (@TheDeverakonda) 8 March 2018 -
కోలీవుడ్‌కు విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ హైప్ తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పరభాషా దర్శకులు కూడా విజయ్ దేవరకొండ హీరోగా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘గీతాగోవిందం’ సినిమాతో పాటు షికారు, మహానటి సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఇవేకాకుండా మరో మూడు నాలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తాజాగా ఓ తమిళ దర్శకుడు విజయ్ హీరోగా సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నాడట. విక్రమ్ హీరోగా ఇరుముగన్ (ఇంకొకడు) సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్, విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ కు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయితే గాని విజయ్ తమిళ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. -
ఇరుముగన్ తెరకెక్కుతుందా?
మొత్తానికి ఇరుముగన్ చిత్రాన్ని సంచలన విజయంగా ప్రేక్షకులు డిసైడ్ చేశారు.దీంతో ఆ చిత్ర యూనిట్ విజయోత్సాహంలో మునిగిపోయారు. సియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ఇరుముగన్. తన పాత్రల కోసం తీవ్ర కసరత్తులు చేసే ఈయన ఇరుముగన్ చిత్రానికి అలాంటి శ్రమనే కోరుకున్నారు. అంతగానూ సక్సెస్ అయ్యారు. విక్రమ్ అఖిలన్, లవ్ అనే రెండు పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని శిబు ఫిలింస్ పతాకంపై శిబుతమీన్స్ నిర్మించారు. నయనతార,నిత్యామీనన్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. అరిమానంబి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన శంకర్ శిష్యుడు ఆనంద్ శంకర్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.ఆరా సంస్థ గత వారం తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేసిన ఇరుముగన్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ విజయ బాటలో పయనిస్తోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌తో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా చిత్రం దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ అరిమానంబి చిత్రం చూసి అభినందించిన విక్రమ్ మంచి కథ ఉంటే చెప్పండి కలిసి చేద్దాం అని అన్నారన్నారు. నిజానికి అప్పుడు తన వద్ద స్క్రిప్ట్ ఏదీలేదన్నారు.ఒక సింగిల్ లైన్ మాత్రమే చెప్పానన్నారు. అది చాలా బాగుంది బాగా ఇంప్లిమెంట్ చేయమని విక్రమ్ చెప్పారన్నారు. దీంతో తన బాధ్యత మరింతపెరిగిందని అన్నారు. ఒరుముగన్ చిత్రం విజయం వెనుక యూనిట్‌లోని ప్రతి వారి కృషి ఉందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ నిజానికి ఇరుముగన్ చిత్రం తెరకెక్కుతుందో? లేదోనన్న ఆందోళనతో ఉన్నామన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాత శిబుతమీన్ రంగంలోకి ప్రవేశించి రెండే రోజుల్లో సమస్యల్ని పరిష్కరించి ఇరుముగన్ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తన తన భుజస్కందాలపై వేసుకుని ఈ విజయానికి కారణం అయ్యారన్నారు. ఇక అఖిలన్, లవ్ పాత్రల్లో ఏ పాత్ర కష్టం అనిపించిందని అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేశానన్నారు. ముఖ్యంగా లవ్ పాత్రను కొంచెం ఎక్కువ చేసినా, తక్కువ చేసినా ఇంత ఫలితం ఉండేది కాదన్నారు. నయనతార, నిత్యామీనన్, తంబిరామయ్య ఇలా అందరూ తమతమ పాత్రలకు న్యాయం చేశారని అందుకే ఇరుముగన్ ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణను పొందుతోందని విక్రమ్ అన్నారు. ఇరుముగన్ చిత్రం తమిళనాడులో విడుదల చేసిన ఆరా ఫిలింస్ అధినేత సురేశ్ మాట్లాడుతూ ఈ చిత్రం తొలి ఆరు రోజుల్లోనే 29.5 కోట్లు వసూల్ చేసిందని తెలిపారు.వచ్చే వారం కూడా ఒక థియేటర్ తగ్గకుండా ప్రదర్శింపడుతుందని చెప్పారు. -
నా కెరీర్లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
-
నా కెరీర్లో లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది!
సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విలక్షణ నటుడు విక్రమ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఇరుముగన్’. నయనతార, నిత్యామీనన్ కథానాయికలు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ఎన్కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హరీష్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. స్నేహ గ్రూప్ ఎండీ వరుణ్‌రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ట్రైలర్ ఆవిష్కరించారు. విక్రమ్ పాటల సీడీని విడుదల చేసి రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు అందించారు. విక్రమ్ మట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన గొప్ప పాత్రల్లో ఈ చిత్రంలో చేసిన అఖిలన్, లవ్ క్యారెక్టర్లు కూడా నిలుస్తాయని చెప్పగలను. మంచి కథ తయారు చేసుకుని దాన్ని అద్భుతంగా తెరకెక్కించిన ఆనంద్‌కు మంచి భవిష్యత్ ఉంది. తనతో మరో రెండు, మూడు చిత్రాలు చేయాలనుకుంటున్నా’’ అని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా, వ్యక్తిగా విక్రమ్ సూపర్. ఆయన నటనలో చీటింగ్ కనిపించదు. ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ నెల్లూరుకు చెందిన వారే. కృష్ణారెడ్డి కూడా నెల్లూరివాసి కావడం సంతోషం’’ అని పేర్కొన్నారు. ఆనంద్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే కారణం విక్రమ్గారే. తెలుగు ప్రేక్షకుల అభిమానం చూస్తుంటే తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయాలనుంది. ఈ చిత్రంలో విక్రమ్‌గారు రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు’’ అని చెప్పారు. ‘‘పది చిత్రాలు పంపిణీ చేశాను. నిర్మాతగా నాకిది తొలి చిత్రం. సెప్టెంబర్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నీలం కృష్ణారెడ్డి తెలిపారు. ఈ వేడుకలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, రాజ్ కందుకూరి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
సెంటిమెంట్‌ను నమ్ముకున్న విక్రమ్
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముగన్ సినిమాలో హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తన క్యారెక్టర్ లుక్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసే ఈ స్టార్ హీరో ఈ సారి విలన్ పాత్ర కోసం హిజ్రాగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్న విక్రమ్, ఓ సెంటిమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. తమిళ నాట.. హీరోగా విలన్‌గా ఒకే నటుడు నటించిన సినిమాలన్ని ఘనవిజయం సాధించాయి. అజిత్ నటించిన వాలి, రజనీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రోబో, కమల్ హాసన్ దశావతారం లేటెస్ట్గా సూర్య 24 సినిమాలు ఈ సెంటిమెంట్‌కు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు ఇదే జానర్లో వస్తున్న ఇరుముగన్ కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు విక్రమ్. -
ఆనందుడు అందరివాడేలే!
ఆదర్శం పచ్చని చెట్ల మధ్య కొలువైన చిన్న పల్లె కలప్. పల్లె అందాలే... పర్యాటకులను ఆకర్షించాయిగానీ అక్కడి పేదరికం, సౌకర్యాల లేమి... ఎవరి దృష్టికీ ఆనలేదు... ఒక్క ఆనంద్ శంకర్ దృష్టికి తప్ప. కోయంబత్తూరుకు చెందిన ఆనంద్ శంకర్‌కు పర్యటనలు అంటే ఇష్టం. మారుమూల ప్రాంతాలకు వెళ్లడం అంటే మరీ ఇష్టం. కొంత కాలం క్రితం... ఉత్తరాఖండ్‌లోని ఒక మారుమూల పల్లె అయిన కలప్కు వెళ్లాడు ఆనంద్. అక్కడి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆనంద్‌ను ఆకట్టుకుంది. మళ్లీ అయిదు సంవత్సరాల తరువాత... అదే పల్లెకి మళ్లీ వచ్చాడు. ఈసారి ఆయన్ను అక్కడి అందం ఆకట్టుకోలేదు. అప్పటికీ ఇప్పటికీ మారని పేదరికం ఆనంద్‌ను కదిలించింది. ఆనంద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ఫొటోగ్రాఫర్ కెమెరా... ఫొటోలోని అందాన్ని మాత్రమే కాదు... ఫొటో వెనుక ఉన్న నిశ్శబ్దం, విషాదాన్ని కూడా పట్టుకుంది. డెహ్రాడూన్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో వైద్యం, విద్యకు సంబంధించిన కనీస సదుపాయలు లేవు. ఈ పరిస్థితి ఆనంద్‌ను ఆలోచింపజేసింది. ‘ఈ మూరుమూల ప్రాంతానికి ఏదైనా మంచి చేస్తే, మిగిలిన ప్రాంతాలకు కూడా ఇదో ఆదర్శం అవుతుంది’ అని మనసులో అనుకున్నాడు ఆనంద్ శంకర్. ఆయన ఆలోచన ఆలోచనగానే మిగిలిపోలేదు. ‘కలప్ స్వచ్ఛంద సంస్థ’గా అవతరించింది. మొదటిసారి కలప్కు వచ్చినప్పుడు జ్వరంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలికి సహాయం చేశాడు ఆనంద్ శంకర్. అప్పుడు ఆమె కళ్లలో కనిపించిన వెలుగును ఎప్పటికీ మరవలేదు. ఈ వెలుగు ఆయనను సేవాపథంలో మరింత ముందుకు తీసుకెళ్లింది. గ్రామంలో హెల్త్‌క్యాంప్ నిర్వహించేలా చేసింది. ఈ క్యాంప్ నిర్వహణ తనకు ఎంతో తృప్తిని ఇచ్చింది. హెల్త్‌క్యాంప్ నిర్వహణ ఒక్కటి మాత్రమే కాదు... కలప్ గురించి పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్నాడు ఆనంద్. ‘అక్కడెక్కడో కోయంబత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేయడం ఏమిటి?’ అని కొందరు ఆనంద్‌ను ఆశ్చర్యంగా అడిగారు. ‘నిజానికి జవాబు నాకు కూడా తెలియదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే మాత్రం... నేను కలప్ను చూడలేదు. కలప్ నన్ను చూసింది. మంచిపనికి ప్రేరణ ఇచ్చింది’ అంటాడు. ఆరోగ్యం నుంచి విద్య వరకు రకరకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆనంద్ అతని మిత్రులు రకరకాల స్వచ్ఛందసేవాసంస్థలు, ఫండింగ్ ఏజెన్సీలతో మాట్లాడారు. వారి ప్రయత్నం ఫలించి ‘కలప్ ట్రస్ట్’ సాకారం అయింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచితవైద్యశాల మొదలైంది. ఈ వైద్యశాలలో డా.నందన ఎంబీబీఎస్ వైద్యాన్ని అందిస్తున్నారు. ఆమెకు ట్రస్ట్ జీతం ఇస్తుంది. గ్రామంలోని ఇద్దరు మహిళలను తన సహాయకురాళ్లుగా నియమించుకొని క్లినిక్ నడుపుతుంది నందన. ఈ హాస్పిటల్ సిబ్బంది వైద్యసేవలు అందించడంతో పాటు శరీర పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి కూడా ప్రచారం చేస్తుంటారు. నందన చుట్టపక్కల గ్రామాలలో నెలకొకసారి హెల్త్చెకప్ క్యాంప్‌లు నిర్వహిస్తుంటారు. ఇక విద్య గురించి... గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా... అది నామమాత్రంగా ఉంది. అందుకే... రెగ్యులర్ స్కూల్ టైమ్ పూర్తికాగానే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ భాషను నేర్పించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బొమ్మలాట, పాటలు, కథలు... మొదలైన కళారూపాల సహాయంతో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను కూడా బోధిస్తున్నారు. విశేషమేమిటంటే పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్ భాషలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో... వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారితో సంభాషించడానికి ఈ ఇంగ్లిష్ శిక్షణ ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఊళ్లో కరెంట్ ఉండడం అనేది ఎప్పుడోగానీ జరిగేది కాదు. వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాల వల్ల ఏర్పడిన విద్యుత్ సమస్యను తీర్చడానికి నడుం కట్టింది కలప్ ట్రస్ట్. ‘విలేజ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సోలార్ గ్రిడ్‌తో గ్రామంలో విద్యుత్కాంతులు ప్రసరించాయి. కమ్యూనిటీ టూరిజం ప్రోగ్రాం వల్ల స్థానికులకు ఉపాధి దొరికింది. ఒక్కటా రెండా... ఆనంద్ ఆధ్వర్యంలోని ‘కలప్ ట్రస్ట్’ కలప్ ముఖచిత్రాన్ని మార్చడానికి ఎన్నో మంచిపనులు చేస్తుంది. అందుకే కలప్ గ్రామం ఆనంద్ అక్కడెక్కడి వాడో అనుకోవడం లేదు... అందరివాడు అనుకుంటుంది.అక్కున చేర్చుకుంటుంది. -
'ఇరు ముగన్' ఫస్ట్ లుక్‌తో విక్రం సెన్సేషన్
విక్రం తాజా సినిమా 'ఇరు ముగన్' ఫస్ట్ లుక్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ తో అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. సగం యంత్రం, సగం మనిషిగా వినూత్న రూపురేఖలతో విక్రం ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేరీతిలో ఉన్న ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసింది. ఆనంద్ శంకర్ రచన-దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రం సరసన నయనతార, నిత్య మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విక్రం ఎన్నో ఆశలు పెట్టుకొని నటిస్తున్న సినిమా 'ఇరుముగన్'. మరోసారి తన విలక్షణ పంథాతోనే అభిమానులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. తరచూ నిర్మాతలు మారడంతో ఆఖరికీ గత డిసెంబర్లో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ మొదలుపెట్టారు. 'ఇరుముగన్' పోస్టర్ విక్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకోంటుందని ఆన్లైన్లో దీనికి వెల్లువెత్తుతున్న స్పందన చాటుతోంది. -
ఇద్దరమ్మాయిలతో అపరిచితుడు
నారీనారీ నడుమ మురారి కానున్నారు నటుడు విక్రమ్. తన తాజా చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్నారు. విక్రమ్‌కు ఇద్దరు నాయికలతో నటించడం కొత్తేమి కాదు. ధూల్, రాజబాట తదితర చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటించారు. అయితే తాజాగా ఇంతకుముందు జత కట్టని భామలతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఐ వంటి బ్రహ్మాండ చిత్రం తరువాత ప్రస్తుతం పత్తు ఎండ్రత్తుక్కలే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చెన్నై చిన్నది సమంత నాయకి. ఈ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారు. అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి హిట్ కొట్టిన వర్ధమాన దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి విక్రమ్ పచ్చజెండా ఊపారు. ఇందులో ఆయనకు జంటగా అందాల భామలు కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్ నటించడానికి రెడీఅవుతున్నారు. దర్శకుడు ఆనంద్ శంకర్ తొలి చిత్రం నాయకి ప్రియా ఆనంద్ అన్నది తెలిసిన విషయమే. తన తదుపరి చిత్రంలోను దర్శకుడు ఆమెనే ఒక నాయకిగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఈ చిత్రంలో కథా నాయకుడి పాత్రకు విక్రమ్ మాత్రమే చేయగలరని దర్శకుడు అభిప్రాయం. అలాగే అరిమా నంబి చిత్రానికి ఇది పూర్తి విరుద్దంగా, వైవిధ్యంగా ఉంటుందంటున్నారు. చిత్రం జూన్‌లో సెట్‌పైకి వెళ్లనుందని తెలిపారు.