పబ్లిక్‌ మీట్‌ | Nota movie public meet in hyderabad | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ మీట్‌

Published Thu, Sep 27 2018 12:18 AM | Last Updated on Thu, Sep 27 2018 12:18 AM

Nota movie public meet in hyderabad - Sakshi

విజయ్‌ దేవరకొండ

‘‘అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. మెహరీన్‌ కథానాయిక. అక్టోబర్‌ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు.

అందులో భాగంగా విజయవాడ, హైదరాబాద్‌లలో భారీ పబ్లిక్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 30న విజయవాడ, అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లో ఈ మీటింగులకు ‘ది నోటా పబ్లిక్‌ మీట్‌’ అని పేరు పెట్టారు. నాజర్, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్‌ డ్రామా ఇది. మెహరీన్‌ ఇందులో జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. ‘‘ఇటీవల రిలీజైన ‘నోటా’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement