‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన లేటెస్ట్ మూవీ ‘నోటా’లో యువ రాజకీయ నేతగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలో పదవీ బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారో థియేటర్‌లో తెలిసే సమయం ఆసన్నమైంది. విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు ద్విభాషా పొలిటికల్ థ్రిల్లర్ ‘నోటా’. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు విజయ్.
స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మెహరీన్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ‘గీత గోవిందం’లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించిన విజయ్ దేవరకొండ ‘నోటా’లో అందుకు పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. వాడి వేడి డైలాగ్స్‌తో ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందట. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీ.యస్, కెమెరా: శాంతన్ కృష్ణన్.
Comments
Please login to add a commentAdd a comment