
విజయ్ దేవరకొండ
నాకు రాజకీయాలంటే చిరాకు. కానీ, ఒకవేళ నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను అంటున్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘నోటా’. మెహరీన్ కథానాయిక. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందింది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మించారు. పాలిటిక్స్‌లో తిరుగుబాటు చేసిన ఓ యంగ్ పొలిటీషియన్‌గా ఈ చిత్రం కథ ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ఈనెల 6న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్.సి.
Comments
Please login to add a commentAdd a comment