యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో పబ్లిక్ మీట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్.సి.సుందర్ సంగీతం అందించారు.
నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడులో రిలీజ్ చేసాం. మాములు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఏ హీరోకి ఇలాంటి రికార్డులను సాధించడం సాధ్యం కాలేదు. ఒక్క విజయ్‌కే అది దక్కింది.’ అన్నారు
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి చాలా థాంక్స్. ఇక విజయ్ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్‌తో విజయ్ దగరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వస్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది. రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment