
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న సినిమా నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్ రచయిత, నిర్మాతల మధ్య వివాదంతో ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది.
అయితే తాజా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 5న నోటా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment