సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సీవాలా చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసిన విజయ్.. బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న నోటాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్ శంకర్.. మురుగదాస్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్ చేస్తుండటంపై ఆనంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment