breaking news
Vijay Devarakonda
-
వెండితెరపై హిస్టరీ రిపీట్!
వెండితెరపై హిస్టరీ రిపీట్ అవుతోంది. అవును... వందల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందుకోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్లతో నిర్మాతలు, సూపర్ టేకింగ్‌తో దర్శకులు తీస్తున్న ఆ సినిమాల వివరాలు, ఆ చారిత్రక సంఘటనల విశేషాలను తెలుసుకుందాం.మాస్ కాదు... ఫ్యాంటసీ ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి ఓ చారిత్రక కథను సిద్ధం చేశారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని, ఈ హిస్టారికల్ డ్రామాలో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా వెంకటేశ్ నటిస్తారని తెలిసింది. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, ఇది హిస్టారికల్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.తండ్రీకొడుకుల ఎమోషన్ ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సక్సెస్‌తో ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నారు మలయాళ హీరో మోహన్‌లాల్. అలాగే మోహన్‌లాల్ నటించిన మరో రెండు సినిమాలు ‘వృషభ, హృదయపూర్వం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ‘వృషభ’ సినిమా హిస్టారికల్ మూవీ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు.సైనికుడి పోరాటం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ సైనికుడి వీరోచిత పోరాటం, త్యాగం, ప్రేమ... వంటి అంశాలతో ఓ హిస్టారికల్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో నటిస్తున్నారని, 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.భాగ్యనగరం, నైజాంలో రజాకార్ల ఆకృత్యాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయిందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.బెంగాల్లో డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా రానుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ అని తెలిసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రధానంగా ఈ సినిమాలో బెంగాల్, బంగ్లాదేశ్‌ల నేపథ్యం కనిపిస్తుందట. 1850 టైమ్‌లైన్‌లో ఈ సినిమా మేజర్ కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తోంది.అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రుక్ముణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, విలన్‌గా మలయాళ నటుడు టోవినో థామస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ... ఆ తర్వాత 2026 జూన్ 25కు విడుదలను వాయిదా చేశారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంలో... రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలతో హీరో విజయ్ దేవరకొండ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. 2018లో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ రూపంలో ఓ హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు మేకర్స్.1854–1878 మధ్య కాలంలో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చెప్పని ఓ సరికొత్తపాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే... ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్, క్రిషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాజుల కథ హీరో నిఖిల్ రెండు హిస్టారికల్ సినిమాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘స్వయంభూ’. ‘బాహుబలి’ తరహా మాదిరి రాజుల కాలం నాటి కల్పిత కథతో ‘స్వయంభూ’ సినిమా కథనం ఉంటుంది. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ బడ్జెట్ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. అలాగే నిఖిల్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి. మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1905లో లండన్‌లో జరిగిన కొన్ని సంఘటనలు భారతదేశ స్వాతంత్య్రంపై ఏ విధంగా ప్రభావితం చూపాయి అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందట. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సవార్కర్‌కు చెందిన సంఘటనలు కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయట.గోపీచంద్ శూల ప్రేక్షకులను ఏడో శతాబ్దంలోకి తీసుకుని వెళ్లనున్నారు గోపీచంద్. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ వార్ డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ వారియర్‌గా నటిస్తున్నారు. కశ్మీర్లో ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను ఆ మధ్య పూర్తి చేశారు. ఈ సినిమా ఏడో శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ టచ్ చేయని ఓపాయింట్తో తాము ఈ సినిమా చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. గోపీచంద్ కెరీర్‌లోని ఈ హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా 2026 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.శతాబ్దాల క్రితంనాటి కథలు కాదు... కానీ సెమీ పీరియాడికల్ సినిమాలు (50–60 సంవత్సరాల క్రితం నేపథ్యంలో) మరికొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోని ‘దిప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, ఆది సాయికుమార్ ‘శంబాల’, రోషన్ మేకా ‘చాంపియన్’... ఈ కోవకి చెందిన సినిమాలే. కాంతార ప్రీక్వెల్ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు హిస్టారికల్ సినిమాల్లో రిషబ్ శెట్టి నటించడం విశేషం. అది కూడా ఈ సినిమాల వరుసగా చేయడం అంటే చిన్న విషయం కాదు. పీరియాడికల్ కథలపై కన్నడ నటుడు–దర్శక–హీరో రిషబ్ శెట్టి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రిషబ్ వరుసగా శతాబ్దాల క్రితం నాటి కథలతో సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘కాంతార: చాఫ్టర్ 1’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది.‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలై 1970లో జరిగే కొన్ని సన్నివేశాలతో కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 1990 బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ సినిమా కథనం సాగుతుంది. ‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలైంది కనుక ‘కాంతార’ ప్రీక్వెల్ ఇంకా ముందు జరిగిన కథగా ఉంటుంది. ఈ ప్రకారం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. తిరుగుబాటుదారుడి కథ: ‘జై హనుమాన్’ సినిమా తర్వాత రిషబ్ శెట్టి తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు.18వ శతాబ్దంలో భారత్‌లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారు రిషబ్ శెట్టి. ఈ ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన యోధుడు: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామా 1630– 1680 మధ్యకాలంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రానుందని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏకకాలంలో 2027 జనవరి 21న రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇలా.. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు హిస్టారికల్ డ్రామా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రిషబ్ శెట్టి. – ముసిమి శివాంజనేయులు -
చాన్నాళ్ల తర్వాత ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను : విజయ్ దేవరకొండ
పదేళ్ల క్రితం నేను ఎవరనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ స్తాయిలో ఉన్నాను. అదే నాకు గొప్ప విషయం. ఇన్ని కోట్ల మందిలో ఈ అవకాశం నాకు మాత్రమే దొరికింది. అది చాలు. ఈ స్థాయికి వచ్చినందుకు ఏదో ఒకటి చేయకపోతే అర్థం ఉండదు. అందుకే అర్జున్ రెడ్డికి వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డుని వేలానికి వేసి ఓ మంచి పనికి ఉపయోగించాను. నెగెటివిటీని నేను పట్టించుకోను. నా చుట్టు ఉన్నవారితో పాటు అభిమానుల్లోనూ పాజిటివిటీ నింపాడానికే ప్రయత్నిస్తాను’ అన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ జులై 31న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కింగ్డమ్ సినిమాకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.→ ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి 'మనం హిట్ కొట్టినం' అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.→ కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.→ గౌతమ్(దర్శకుడు) కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.→ ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.→ ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.→ నా తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. -
దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామందికి అతడి సినిమాల కంటే రష్మికనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో కలిసి నటించిన వీళ్లు.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రీసెంట్ టైంలో ఈ పుకార్లని బలపరిచేలా విజయ్, రష్మిక వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు రూమర్ బాయ్ ఫ్రెండ్ కోసం రష్మిక మరో క్రేజీ పని చేసింది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ బయటపెట్టారు.(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన 'కింగ్డమ్' మూవీ రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాగానే ఫెర్ఫార్మ్ చేస్తోంది. రిలీజ్ రోజే.. 'మనం కొట్టినం' అని సంతోషంగా సినిమా సక్సెస్ గురించి రష్మిక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు సీక్రెట్‌గా హైదరాబాద్‌లోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్లి మరీ ఈ మూవీ చూసొచ్చింది. తాజాగా పలువురు మీడియా వాళ్లతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరగ్గా.. ఇందులో మాట్లాడిన నాగవంశీ ఈ సంగతి చెప్పుకొచ్చారు.భ్రమరాంబ థియేటర్లో రష్మిక.. 'కింగ్డమ్' చూడాలనుకుందని, అయితే ఈమె వెళ్లిన తెలిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్లి సినిమా చూసొచ్చారు అని నాగవంశీ.. అసలు సంగతి చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విజయ్-రష్మిక బాండింగ్ అంటే ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే 'కింగ్డమ్' చిత్రానికి రెండు రోజుల్లో రూ.53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం) -
‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. దీంతో తొలి రోజు రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లోకి చేసింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండో రూ. 14 కోట్ల వసూళ్లు వచ్చాయి. (చదవండి: అర్జున్‌రెడ్డికి నా రెమ్యునరేషన్ అంతే.. అదే ఎక్కువ!: విజయ్ దేవరకొండ)మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. (చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్‌టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?)నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ.21 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 26, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 14.03 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.That’s how #KINGDOM gets hailed big with the audience’s love 💥💥#BoxOfficeBlockbusterKingdom hits 53Cr+ worldwide gross in 2 days 🔥🔥🎟️ - https://t.co/4rCYFkzxoa@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon… pic.twitter.com/xW6M0dd3s8— Sithara Entertainments (@SitharaEnts) August 2, 2025 -
అర్జున్‌రెడ్డి పారితోషికం.. అప్పుడు నాకదే ఎక్కువ: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అనగానే చాలామందికి గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే! పెళ్లిచూపులు సినిమాతో హీరోగా క్రేజ్ వచ్చినప్పటికీ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం (Arjun Reddy Movie)తో దమ్మున్న హీరో అని నిరూపించుకున్నాడు. దాదాపు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టించింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే విజయ్ రేంజ్ మారింది. కింగ్డమ్కు తొలిరోజు భారీ కెలెక్షన్స్ఈ మధ్య ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తుండటంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసిమీదున్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.అప్పుడదే ఎక్కువఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ.. కింగ్డమ్కు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసుకుంటూ.. అప్పుడు తన రెమ్యునరేషన్ రూ.5 లక్షలని, ఆ సమయంలో అదే తనకు పెద్ద అమౌంట్ అన్నాడు. ఇప్పుడు రిలీజైన కింగ్డమ్కు మంచి కలెక్షన్స్ వస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో.. -
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్‌బ్యాక్
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.హిట్టు కొట్టినంఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.ఆ సినిమాలతోనే పోటీఅయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. BOOM 💥🔥Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025చదవండి: రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్ -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్ 'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్‌తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్‌ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. -
'కింగ్డమ్' నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి: నిర్మాత
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. కొందరు నచ్చిందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం నచ్చలేదని అంటున్నారు. అంటే ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఒకటి రెండు రోజులు ఆగితే అసలు సంగతి ఏంటో బయటపడుతుంది. ఇకపోతే తాజాగా హైదరాబాద్‌లో మూవీ సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండి అని అన్నారు.'సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది ఇలాంటివి ఏమి పట్టించుకోకండి. ప్రతి సినిమాకు కామన్ ఇవి. సినిమా అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి హై ఇస్తుంది. మీకు నచ్చకపోతే కాల్ చేసి తిట్టండి అంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. మూవీలోని టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి' అని నాగవంశీ అన్నారు.(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నిర్మాతగా ఆయన తీసిన సినిమాని నాగవంశీ మెచ్చుకున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ పూర్తి రిజల్ట్ ఏంటనేది వీకెండ్ గడిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. 'కింగ్డమ్'లో విజువల్స్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయని చూసొచ్చిన ప్రేక్షకులు అంటున్నారు. కానీ సెకండాఫ్‌లో ల్యాగ్ ఉందని కంప్లైంట్ చేస్తున్నారు. అలానే హీరోహీరోయిన్ మధ్య రొమాంటిక్ సాంగ్ కూడా మూవీలో లేకపోవడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయమై సక్సెస్ మీట్ నిర్మాతని అడగ్గా.. స్కోప్ లేకపోవడంతోనే పాటని పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)"మీకు #Kingdom సినిమా High ఇవ్వకపోతే Phone చేసి తిట్టండి, అంత Confident గా చెప్తున్నా... Technicalities హాలీవుడ్ Standards లో ఉన్నాయి.."- #NagaVamsi pic.twitter.com/R1L5wrgqKT— Movies4u Official (@Movies4u_Officl) July 31, 2025 -
'కింగ్డమ్' ఓటీటీ డీటైల్స్.. ఎప్పుడు రావొచ్చు?
విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రీసెంట్ టైంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్‌తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!) -
‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. భారీ అంచనాల మధ్య నేడు(జులై 31)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కథ-కథనం పక్కకి పెడితే..విజయ్ నటనపై మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానిస్టేబుల్ సూరి పాత్రలో ఒదిగిపోయాడని, ఎమోషనల్ సన్నీవేశాల్లో అద్భుతంగా నటించారని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. విజయ్ అభిమానులు అయితే హిట్ సినిమా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా కింగ్డమ్ సినిమాపై తన రివ్యూ ఇచ్చేసింది. ‘ఇది నీకు(విజయ్), నిన్ను ప్రేమించిన వాళ్లకు ఎంత అర్థ అవుతుందో నాకు తెలుసు..‘మనం కొట్టినం’’ అని రష్మిక ఒక్క మాటతో సినిమా సూపర్ హిట్ అని చెప్పేసింది. కాగా, రష్మిక ట్వీట్‌పై విజయ్ స్పందించాడు. అవును ‘మనం కొట్టినం’అంటూ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు. I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!“MANAM KOTTINAM”🔥#Kingdom— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025 -
‘కింగ్డమ్’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్డమ్నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే , వెంకటేశ్ పీసీ, కసిరెడ్డి తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు:సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: గౌతమ్ తిన్ననూరిసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ:జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISCఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది: జులై 31, 2025విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. నిజం చెప్పాలంటే ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమానే లేదు. భారీ ఆశల మధ్య గతేడాది వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో విజయ్ ఆశలన్నీ ‘కింగ్డమ్’పైనే పెట్టుకున్నాడు.డైరెక్టర్ గౌతమ్‌కి కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను కింగ్డమ్ అందుకుందా? విజయ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..సూరి(విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. అన్న శివ(సత్యదేవ్) అంటే ప్రాణం. ఓ కారణంతో శివ చిన్నప్పుడే తండ్రిని చంపి ఇంటి నుంచి పారిపోతాడు. అతని ఆచూకి కోసం సూరి వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో సూరి శ్రీలంకలో ఉన్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే.. శ్రీలంకలో ఓ తెగ ఉంటుంది. 70 ఏళ్ల క్రితం ఇండియా నుంచి శ్రీలంకకు పారిపోయిన తెగ అది. గోల్డ్ మాఫియా సిండికేట్ చేతిలో వారు బానిసలు. మురుగన్(వెంకటేశ్) చెప్పింది చేయడమే వాళ్ల పని. శివ ఆ గ్యాంగ్ లీడర్. అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడమే సూరి లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? తమ్ముడు సూరి ఇండియన్ పోలీసుల గూఢచారి అని తెలిసిన తర్వాత శివ ఏం చేశాడు? అసలు ఈ తెగ ఇండియా నుంచి శ్రీలంకకు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది. గుఢచారిగా వెళ్లిన సూరి.. చివరకు ఆ తెగకు దేవుడిగా ఎలా మరాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. తెరపై భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సిద్ధహస్తుడు. ‘మళ్లీ రావా’లో ప్రేమ, విరహం, గతం-వర్తమానం మధ్య తడమాటాన్ని అద్భుతంగా చూపించాడు. జెర్సీలోని ట్రైన్ సీన్ ఒక్కటి చాలు గౌతమ్ తన కథల్లో ఎమోషన్ని ఎంత బలంగా చూపిస్తాడో చెప్పడానికి. కింగ్డమ్లో కూడా తన బలమైన ఎమోషన్‌పైనే గౌతమ్ ఎక్కువ దృష్టిపెట్టాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. గ్యాగ్ స్టర్ బ్యాక్ డ్రాప్‌తో అన్నదమ్ముల కథని చెప్పాడు. అయితే ఇక్కడ ఎమోషన్ వర్కౌట్ అయినా.. కథ-కథనంలో మాత్రం కొత్తదనం కొరవడింది. సినిమా చూస్తున్నంత సేపు ఇటీవల వచ్చిన రెట్రో సినిమాతో పాటు పాత చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు మన కళ్లముందు తిరుగుతాయి. కథను బలంగా చెప్పే క్రమంలో కొన్ని చోట్ల ట్రాక్ మిస్ అయ్యాడు. అయితే అనిరుధ్ నేపథ్య సంగీతం, విజయ్ నటన ఆ తప్పిదాలను కొంతవరకు కప్పిపుచ్చాయి. 1920లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బంగారు గని కార్మికుల నేపథ్యంతో కథ చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత కథ 70 ఏళ్లు ముందుకు జరిగి.. 1991లోకి వస్తుంది. చిన్నప్పుడే పారిపోయిన అన్నకోసం సూరి వెతకడం.. ఓ పోలీసు ఆఫీసర్ దృష్టిలో పడడం.. అన్న ఆచూకి చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకకు పంపిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లతో కథను నడిపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు మాత్రం భావోద్వేగాలనే బలంగా చూపించాడు. అన్నదమ్ములు కలిసే సీన్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. సముంద్రంలో వచ్చే ఛేజింగ్ సీన్, నేవి అధికారుల నుంచి బంగారం కొట్టేసే సీన్ ఫస్టాఫ్‌కే హైలెట్. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కథ అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. పైగా కొన్ని చోట్ల కథనం ట్రాక్ తప్పుతుంది. ఆపదలో ఉన్నవారిని చివరి నిమిషంలో అయినా సరే హీరో వచ్చి ఆదుకోవడం మన తెలుగు సినిమాల సాంప్రదాయం. కానీ కింగ్డమ్లో అది ఫాలో కాకపోవడంతో.. కొంతమందికి ప్రీక్లైమాక్స్ కొత్తగా అనిపిస్తే.. చాలా మందికి ఇలా చేశారేంటి? అనిపిస్తుంది. పార్ట్ 2 కోసమే క్లైమాక్స్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సాధారణ పోలీసు కానిస్టేబుల్‌గా, ఆ తర్వాత పోలీసుల గూఢచారిగా, కింగ్డమ్ రాజుగా ఇలా పలు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. తన కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సత్యదేవ్ పాత్ర. హీరో అన్న శివగా అద్భుతంగా నటించాడు. ఆయన పాత్రకు స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు రెండో హీరో సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఇక మాఫీయా లీడర్ మురుగన్‌గా వెంకటేశ్ విలనిజం బాగా పండించాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీకి పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్‌గా రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా వరకు రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో వాటిని అంతే అందంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రివ్యూ.. హిట్టా..! ఫట్టా..!
-
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ HD స్టిల్స్
-
'కింగ్డమ్' ట్విటర్ రివ్యూ.. అనకొండలా తిరిగొచ్చిన విజయ్
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్డమ్' థియేటర్స్‌లోకి వచ్చేసింది. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఓవర్సీస్లలో సినిమా పూర్తి అయింది. దీంతో వారు ట్విటర్ వంటి సోషల్మీడియాలలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సరైన విజయం కోసం విజయ్ దేవరకొండ కొంతకాలంగా ఎదురుచూస్తున్న క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకుడితో సినిమా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్‌దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపించారు. వారి బంధం ఎలా ఉందో నెటిజన్లు సోషల్‌మీడియాలో పంచుకున్నారు.కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ ఒక అనకొండలా తిరిగొచ్చాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదొక ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ అంటూ.. అన్నదమ్ముల అనుబంధం గురించి అద్భుతంగా చూపించారని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సత్య దేవ్ తమ నటనతో అదరగొట్టారని అంటున్నారు. ఈ సినిమా కోసం అనిరుధ్ సంగీతంతో ఫుల్ డ్యూటీ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన స్టోరీ లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచారని విజయ్‌ని అభినందిస్తున్నారు. టైర్-1 హీరోల లిస్ట్‌లోకి తెలంగాణోడు వచ్చేశాడని పేర్కొన్నారు.‘కింగ్డమ్’ టైటిల్ కార్డ్ నుంచే మెప్పించేలా ఉందని ఫ్యాన్స్‌తో పాటు కామన్ ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. సినిమా ప్రారంభం కావడమే సీన్‌తో ఉంటుందని, ఆపై కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు. కథ విషయంలో ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా ఖచ్చితమైన స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచిందన్నారు. మెత్తం మీద సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉందని ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి.ఫస్టాప్ ఎంత బలంగా ఉందో సెకండాఫ్ కూడా సూపర్ స్ట్రాంగ్‌గా ఉందని ఎక్కువ రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని జైలు సీన్స్‌తో పాటు బోట్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన బలమంటున్నారు. బక్కోడు ఫుల్ డ్యూటీ చేశాడంటూ అనిరుధ్ బీజీఎమ్‌తో ప్రతి సీన్‌ను భారీగా ఎలివేట్ చేశాడని చెప్పుకుంటున్నారు.ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే కానీ,..కింగ్డమ్లో ఎక్కువ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. అయితే, కొందరు మాత్రం కేజీఎఫ్, పుష్ప, బాహుబలి వంటి సీన్స్ కింగ్డమ్లో గుర్తుకుచేస్తాయని చెబుతున్నారు. ఫస్టాప్‌లో చాలా బలంగా ఉందని అందుకు తగ్గట్టుగా సెకండాఫ్ లేదని మరికొందరు అంటున్నారు. క్లైమాక్స్ కాస్త నిరూత్సాహపరిచాడని కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా పెద్దగా భావోద్వేగ సీన్స్ మెప్పించలేకపోయాయని కొందరు అంటున్నారు.#Kingdom 1st half opens to positive reviews 🥳🥳🎉🎉🎉Everyone’s praising #Anirudh’s musical work 🥁🥁#GowthamTinnauri strikes again 😳💥#VijayDeverakonda MASISVE COMEBACK loading… 🔥🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/tKfqJ5FNSO— Movies Singapore (@MoviesSingapore) July 30, 2025#Kingdom ⭐⭐⭐½/5!!First half Nice👍👍👍@anirudhofficial BGM💥💥💥💥🔥🔥🔥🔥🔥@TheDeverakonda 🔥🤯🔥🔥🤯💯 Interval 👍👍👍2nd half Good 💥 #KingdomOnJuly31st #VijayDeverakomda pic.twitter.com/0noDRo8tRu— its cinema (@itsciiinema) July 30, 2025#Kingdom Blockbuster🔥🔥@TheDeverakonda Anna Ni performance Excellent specially in emotional scenes 🔥E movie chusina taruvata andaru Vijay Anna performance gurunchi matladutaru . Gowtham style of Movie. Particular ga e movie ki Emotional carry chestava Leda anukuna but… pic.twitter.com/vjsURcqU5k— urstruly karthik (@CultMBFan2) July 30, 2025#Kingdom is an action drama that is technically very strong and works well on the drama front, though it falters somewhat in terms of emotional depth.Director Gowtham Tinnanuri succeeds in building a properly engaging narrative in the first half. Although the narration feels…— Venky Reviews (@venkyreviews) July 30, 2025#Kingdom - JAIL AND BOAT SEQUENCE - going to be a TALK OF THE TOWN Tomorrow #VijayDeveraKonda on DUTY. pic.twitter.com/AmfDO5AfjD— GetsCinema (@GetsCinema) July 30, 2025Tier 1 loki Telanganodu 💥😎#Kingdom #VijayDeverakonda pic.twitter.com/cV6EIDbbxM— Mahi Gadu (@mahi_gaduu) July 30, 2025The world of Kingdom next level stuff, unmatched since KGF! This is the kind of script we’ve been waiting for @TheDeverakonda and @anirudhofficial You truly belong to a different league. #Kingdom a pure adrenaline rush.A massive blockbuster @vamsi84 annapic.twitter.com/HNh8W64SL8— Vasu (@AllHailNTR) July 30, 2025Motham Thagalabadipoindhi 🔥#Kingdom USA premieres erupted with a massive wave of love and it’s a solid BLOCKBUSTER verdict with packed housefuls ❤️🔥❤️🔥North America Release by @ShlokaEnts@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse… pic.twitter.com/5KCTGHn3Zj— Ramesh Bala (@rameshlaus) July 31, 2025Good Movie - 3.5 /5 @TheDeverakonda was terrific as SURI with total screen presence 🔥Anirudh’s music is on another level & feels like he is the another hero.Ragile Ragile 🌋 Movie Content🌋 Top-notch production values - Worth the watch.#Kingdom pic.twitter.com/wxQV3QWEpH— 𝐌α𝐯𝐞𝐫𝐢𝐜𝐤 𝐑𝐞𝐝𝐝𝐲 (@IdedhoBagundhey) July 30, 2025#Kingdom - Watch out for this sequence in the poster. Vijay Deverakonda’s acting, Gowtham’s dialogue writing skills and Anirudh’s score complemented each other so well🔥🔥 pic.twitter.com/RliCqwqaWN— Gulte (@GulteOfficial) July 30, 2025#KingdomReview for premier's -4/5Peak Performance Of King 👑 @TheDeverakonda and mind-blowing BGM @anirudhofficial Second half boat scene high 💥Hit kottesav @TheDeverakonda#Kingdom pic.twitter.com/5EwbBUJD47— வம்சி 🦁 (@vamsireddi_07) July 30, 2025 -
కింగ్డమ్లో ఎవరా స్టార్ హీరో?.. విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్‌కు అంతా రెడీ అయిపోయింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ నెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, నాగవంశీ సమాధానాలిచ్చారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కింగ్డమ్ ట్రైలర్ చివర్లో ఓ కెమియో రోల్‌ను చూపించారు. ఆ రోల్లో ఉన్నది స్టార్ హీరోనా? అని అడిగారు. ఇది మీరు థియేటర్లోనే చూడాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు. అలాగే మీరు ఊహించినట్లే పెద్ద హీరోనే ఉంటాడని చెప్పారు. దీంతో అభిమానులు ఇంతకీ ఎవరా హీరో అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు.కాగా.. కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్‌తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. Who Is That Big Hero? pic.twitter.com/w5M7x0SKMH July 30, 2025 -
ఆ విషయంలో మేము పాస్ అయ్యాం : నాగవంశీ
‘ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము(కింగ్డమ్) పాస్ అయ్యాం. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు. ‘విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు. -
ఎవరికోసమో మారను.. నన్ను ఎవరూ వెలేత్తి చూపొద్దు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్డమ్పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండడంతో తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తానెప్పుడు ఎవరికోసమే మారనని.. ఎవరికీ భయపడనని అన్నారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నేనేప్పుడు లోపల ఏది అనిపిస్తే అదే మాట్లాడతా.. కెరీర్ ప్రారంభంలో అగ్రెసివ్‌గా ఉన్నా. అప్పుడు నాలో డిఫెన్స్ మెకానిజంతో ఉండేవాన్ని. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి. అందుకే కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుతూ..'ఇప్పుడు నా అభిమానుల ప్రేమతో నేను కూడా సాఫ్ట్ అయిపోయా. ఇప్పుడైతే నాకేలాంటి ఫియర్ లేదు. మొదట్లో నాకు కొద్దిగా భయముండేది. ఇప్పుడైతే అలాంటిదేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం వల్లే అలాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆడియన్స్ లవ్ వల్ల ఫియర్ పోయి ప్రశాంతంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు. -
'కింగ్డమ్' రిలీజ్ ప్రెస్‌మీట్.. విజయ్ ఇలా భాగ్యశ్రీ అలా (ఫొటోలు)
-
కింగ్డమ్ ఫీవర్.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్.. ఎన్ని అడుగులో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా కింగ్డమ్ ఫీవర్ నడుస్తోంది. మాస్ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా విజయ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సారి గట్టిగా కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.ఈ నేపథ్యంలోనే విజయ్ అభిమానులు కింగ్డమ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్‌ను ఫ్యాన్స్ రెడీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. ఇటీవలే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా తిరుపతిలో 40 అడుగుల విజయ్ దేవరకొండ కటౌట్‌ను ఆవిష్కరించారు,. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నటులు సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. 'కింగ్డమ్' జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. MASSive 75ft Biggest @TheDeverakonda Cut-Out at Sudharshan 35MM, RTC X Roads❤️🔥Get Ready to Celebrate #VijayDeverakonda’s Rage in #KINGDOM 💥💥💥 #KingdomOnJuly31st pic.twitter.com/gsR0uRcThc— Vijay Deverakonda Celebrations👑 (@VDCelebrations) July 30, 2025 -
'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?
'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్‌లోనూ అది క్లియర్‌గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.శ్రీలంక బ్యాక్ డ్రాప్లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్‌తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్‌కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?) -
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్‌లాల్‌దే...నిజానికి ఈ తరహా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్‌ను మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్‌తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్‌లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్‌టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్‌తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్‌ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్‌లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్‌లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్‌లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది. -
'కింగ్డమ్ మూవీ.. నా లైఫ్‌లో ఫస్ట్ క్యారవాన్ సినిమా'
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్‌ను చూడడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్‌లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
కింగ్డమ్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్
'కింగ్డమ్' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ చేశారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలానే 'రగిలే రగిలే' అని సాగే ఓ పాటని పాడాడు. ఇప్పుడు ఆ గీతానికి సంబంధించిన లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. వింటుంటేనే గూస్ బంప్స్ తెప్పిస్తోంది ఈ సాంగ్.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా)ఈ మూవీ అంతా అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్ యాక్షన్ స్టోరీతో తీశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో ఆ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ తమ్ముడు కాగా, సత్యదేవ్ అన్నగా నటించాడు. దాదాపు శ్రీలంకలోనే సినిమా అంతా చిత్రీకరించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు రిలీజ్ చేసిన 'రగిలే రగిలే' పాట బహుశా క్లైమాక్స్‌లో ఉండొచ్చనిపిస్తోంది. (ఇదీ చదవండి: అల్లు అరవింద్‌కు 'మహావతార్ నరసింహా' వరం) -
విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం'.. ఫ్యాన్స్‌ను తలచుకుని విజయ్ దేవరకొండ ఎమోషనల్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్విహంచారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మరో రెండు రోజుల్లో థియేటర్లో కలుస్తాం. ఓవైపు టెన్షన్‌గా.. మరోవైపు హ్యాపీగా ఉంది. ఈ రోజు సినిమా కంటే మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు దేవుడిచ్చిన వరం. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మీ ప్రేమలో మార్పు ఉండదు. ఈ రోజు దాదాపు 2000 మంది ఫాన్స్‌ను కలిశా. అన్నా ఈసారి మనం కొడుతున్నాం అన్నా.. మనం హిట్ కొడుతున్నాం.. టాప్‌లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్ చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకి వెళ్లి నా పోస్టర్‌తో మునిగి నేను హిట్ కొట్టాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతన్ని కలుస్తా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ కానీ.. మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు' అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. Trailer వచ్చాక చాలా మంచి Response వచ్చింది...వాళ్ళ DP లు చూస్తే... Superstar... Icon Star...Tiger...మీ అందరినీ నేను కలవకపోవచ్చు కానీ..మీందరికి ఏదొక Positive Contribution చేసే పోతా..#VijayDeverakonda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/OAGAgfBUWe— Suresh PRO (@SureshPRO_) July 28, 2025 -
'ఎప్పటికీ నేను మీ బక్కోడు'.. తెలుగులో అనిరుధ్ అదిరిపోయే స్పీచ్!
విజయ్ దేవరకొండ వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఇక రిలీజ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు కింగ్డమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్‌ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో మాట్లాడి అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.అనిరుధ్ మాట్లాడుతూ..'ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులకు నా ధన్యవాదాలు. గత 12 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మీ కొడుకులా చూసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్‌నే.. అలాగే మీ బక్కోడు..' అంటూ తెలుగులో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Once again Proved Telugu audience >>>> Any industry 🥵🥵🔥🔥#VijayDeverakomda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/S6eUwfUqLq— Srinivas (@srinivasrtfan) July 28, 2025 -
విజయ్ దేవరకొండతో ఫ్యాన్స్ మీట్.. బిర్యానీతో పాటు సెల్ఫీలు
రౌడీబాయ్ విజయ్ దేవరకొండ తన అభిమానులతో కొంత సమయం పాటు సరదాగ గడిపారు. తను నటించిన కొత్త సినిమా కింగ్డమ్ విడుదల సందర్భంగా వారందరినీ కలుసుకున్నారు. అందుకు వేదికగా హైదరాబాద్‌లోని సారథి స్టూడియో నిలిచింది. తమ అభిమాన హీరోను కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్లో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులే పాల్గొన్నారు. వాస్తవంగా ఆయన్ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతారని తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ కూడా వారిని ఎంతమాత్రం నిరూత్సాహపరచలేదు. అక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ అందరితో ఫోటోలు దిగారు. వారందరూ కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా.. చికెన్‌తో పాటు బగారా అన్నం రెడీ చేపించారు. తమ పట్ల విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అయ్యారు. నేడు (జులై 28) కింగ్డమ్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనుంది. సాయింత్రం 5గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విజయ్ ఫ్యాన్స్ పాల్గొననున్నారు.‘కింగ్డమ్’ చిత్రం జులై 31న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటి వరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.ఫోటో షూట్ అయ్యాక ఫ్యాన్ కీ అన్నంపెట్టడం🫡👌🏻అన్నదానం కీ మించింది ఏది లేదు🥹❤️ఫుడ్ టెస్ట్ అదిరింది సూపర్ థాంక్స్ @TheDeverakonda అన్న❤️🫂#KingDom #VijayDeverakonda pic.twitter.com/LwCYRikqIn— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) July 28, 2025 -
కింగ్డమ్ ట్రైలర్.. కాంతార స్టైల్లో ఉన్న స్టార్ హీరో ఎవరు?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 31న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శనివారం జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు.కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్‌తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే జూలై 31 వరకు వేచి చూడాల్సిందే.కాగా.. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అంటే ఒక భాషలో తీసిన సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇతర భాషలకు చెందిన నటీనటులు.. తెలుగు ఇండస్ట్రీలోకి బోలెడంత మంది వస్తూనే ఉన్నారు. తాజాగా 'కింగ్డమ్' మూవీతో మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్లో హైలైట్ అవ్వడంతోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఇంతకీ ఎవరితడు?'కింగ్డమ్' మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో శ్రీలంకలో జరిగే స్టోరీతో తెరకెక్కుతోంది. ట్రైలర్‌తోనే కథేంటి అనేది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా హైలైట్ అయ్యాడు. అతడి పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్లో రెండు షాట్స్‌లోనే కనిపించాడు. ఇతడెవరా అని చూస్తే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అని తెలిసింది. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)వెంకటేశ్.. మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్‌లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్‌గా చేశాడు. ఈ మూవీతోనే 'కింగ్డమ్' ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్‌కి మరో కొత్త విలన్ దొరికాడేమో అనిపిస్తుంది.మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతమందించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు. కాకపోతే తొలి భాగం ఫలితం బట్టి అది ఆధారపడి ఉంటుందేమో?(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీ సినిమా రివ్యూ) -
కింగ్డమ్పై రష్మిక ట్వీట్.. ముద్దు పేరేంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
గతేడాది పుష్ప-2తో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కింగ్డమ్ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్‌లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్‌తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.Rushhielu ❤️Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025 -
ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత
టాలీవుడ్ యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికి తెలిసిందే. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదస్పదంగానూ మారిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘జర్సీ’ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ని తిరుపతిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో భాగ్యశ్రీపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చడం వల్లే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారు?’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వంశీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్గా పెట్టుకున్నాను. విజయ్ కానీ, గౌతమ్ కానీ నన్ను అడగలేదు. నాకు భాగ్యశ్రీని నచ్చి హీరోయిన్గా తీసుకున్నాను. నేను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను’ అని వంశీ అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, భాగ్యశ్రీ (వీడియో)
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్ విజయం తన కెరీర్‌కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు. ' మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ, వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అంటూ ఆయన అన్నారు. సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు. దీంతో విజయ్, భాగ్యశ్రీ, నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.#KINGDOM team Divine Visit to Tirupathi ✨️❤️@TheDeverakonda and team completed Lord Venkateswara Swamy Darshanam in the early hours today 🙏Gearing up to surprise in theatres on July 31st💥💥#VijayDeverakonda #BhagyashriBorse pic.twitter.com/iLQM5374jB— Eluru Sreenu (@IamEluruSreenu) July 27, 2025 -
కొన్నేళ్లుగా ఈ ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి.. ఎన్నో జ్ఞాపకాలు: రష్మిక
రష్మిక- విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ నేరుగా స్పందించలేదు. అలా అని ఆ వార్తను ఖండించనూ లేదు. పైగా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి పార్టీస్‌కి, వెకేషన్స్‌కి వెళ్లడం.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రేమలో ఉన్నది నిజమనే అంతా నమ్ముతున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచేస్తుంది.తాజాగా రష్మిక డియర్ కామ్రెడ్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రిలీజై ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..‘ఆరేళ్ల డియర్ కామ్రేడ్.. ఎంతో ప్రేమ, ఆనందం, పాజిటివిటీ నింపిన చిత్రమిది. ఈ ఫోటోలు చాలా ఏళ్ల క్రితం తీసినవి. ఇప్పటికీ నా ముబైల్లో అలాగే దాచుకున్నా. వాటిని తిరిగి చూస్తుంటే.. ఆ మదుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మనకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది’ అంటూ రష్మిక విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని టాలీవుడ్ టాక్. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'కింగ్డమ్' ట్రైలర్ ఈవెంట్లో విజయ్, భాగ్యశ్రీ.. భారీగా ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అవుతా :విజయ్ దేవరకొండ
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు. -
ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ
హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అతడు కింగ్డమ్ మూవీపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.సినిమా వల్లే..విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా వల్ల సమాజంలో నాకంటూ పేరుప్రఖ్యాతలు వచ్చాయి. జనాల ప్రేమ దొరికింది. సినిమాల్లోకి రాకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకొద్దు. కానీ సినిమాల్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్‌ను మిస్ అవుతున్నాను. మన లైఫ్‌లో బంధాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ బాగా తెలిసొచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌కు నో టైమ్ఈ రెండుమూడేళ్లలో నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. అమ్మానాన్నకు సమయం కేటాయించలేదు. గర్ల్ ఫ్రెండ్‌కు కూడా కాస్తైనా టైం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్‌తో కూడా గడపలేదు. ఇవన్నీ నన్ను బాధిస్తుండేవి. సడన్‌గా ఒకరోజు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని పద్ధతి మార్చుకున్నాను. కుటుంబసభ్యులతో పాటు నా జీవితంలో ఉన్న అందరికీ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.ప్రేమలో..కాగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ రష్మిక మందన్నాతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. చాలాసార్లు తాను సింగిల్ కాదని హింటిచ్చాడు. విజయ్, రష్మిక.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు చెక్కేస్తుంటారు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.చదవండి: తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్ -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ యాక్షన్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. సినిమా విడుదల రోజు నుంచి పది రోజుల వరకు ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా.. ఈరోజు రిలీజైన పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు భారీగా ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు
-
నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. చివరికీ ఈ నెల 31 థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: గమనిక: వైరల్ అవుతున్న 'విజయ్ దేవరకొండ' స్టంట్?)మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కింగ్డమ్ మూవీ ట్రైలర్ తేదీని ప్రకటించారు. ఈ నెల 26న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. తిరుపతిలో ట్రైలర్ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ ఫీవర్ సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత కింగ్డమ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొనున్నారు. #KINGDOMTrailer is coming. JULY 26th - Tirupati 🙏❤️ pic.twitter.com/a5t3mZukeU— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2025 Countless prayers One man’s journey!Watch his destiny unfold. Every step towards his #Kingdom 🔥👑#KingdomTrailer - Out on JULY 26! 💥💥Grand Trailer Launch Event at Tirupati! 🤩@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @dopjomon… pic.twitter.com/weHN7vFA5L— Sithara Entertainments (@SitharaEnts) July 22, 2025 -
సినీ తారలకు ఈడీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తేదీల వారీగా సినీతారలకు విచారణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిలకు వేర్వేరుగా సోమవారం సమన్లు జారీ చేసింది. బుధవారం రానా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేయడంలో వారి పాత్ర..ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు..తీసుకున్న పారితోషకాల వివరాలు, అందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించారు. సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది. -
బెట్టింగ్ యాప్ కేసు: సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)ని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాశ్ రాజ్‌ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది.సెలబ్రిటీలపై కేసుకాగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాశ్ రాజా, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగళ్ల తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో.. ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది.చదవండి: యాక్సిడెంట్.. పక్షవాతం రావొచ్చన్నారు, అప్పుడు తమన్..: సింగర్ -
హిందీలో సామ్రాజ్య
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్గా నటించగా సత్యదేవ్ కీలకపాత్రలో నటించారు. సత్యదేవ్, విజయ్‌దే వరకొండ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ‘కింగ్డమ్’ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. కాగా... ఈ సినిమాకు హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. -
గమనిక: వైరల్ అవుతున్న 'విజయ్ దేవరకొండ' స్టంట్?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా కోసం గట్టిగానే శ్రమించారు. అందుకు తగ్గట్లుగానే ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వరుస ప్లాపులతో ఉన్న ఆయన ఈసారి కింగ్డమ్ సినిమాతో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్ మెప్పించేలా ఉంది. ‘ఏమైనా చేస్తా సర్... అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్...’ అంటూ విజయ్ దేవరకొండ పేల్చిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే, 'కింగ్డమ్' కోసం తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి, పాత్రకు తగిన శారీరక, మానసిక శిక్షణ కూడా పొందాడు. యుద్ధ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో, ఆయన పాత్రకు తగినంత ఇంటెన్సిటీ, ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం అయ్యింది. అందుకు తగ్గట్టుగానే విజయ్ కష్టపడ్డాడు. తాజాగా విజయ్ చేసిన స్టంట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. చేతుల సాయం లేకుండా రెండు గోడలను కాళ్ళతో సపోర్ట్ చేసుకుంటూ సుమారు 12 అడుగులపైకి విజయ్ వెళ్తాడు. చాలా కష్టంతో కూడుకున్న ఈ స్టంట్‌ను సులువుగా విజయ్ చేసేశాడు. తమ కోసం విజయ్ చాలా కష్టపడుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అక్కడ ఉంది విజయ్ కాదంటూ విమర్శలు కూడా ఎక్కుబెట్టారు.కింగ్డమ్ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం విజయ్ దేవరకొండ శారీరక శిక్షణ పొందాడు. టీజర్లో కనిపించిన యాక్షన్ సన్నివేశాలు, విజయ్ కొత్త లుక్ చూస్తే, ఆయన బహుశా ఫిట్నెస్, స్టంట్ ట్రైనింగ్‌తో పాటు బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై కృషి చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లేందుకు విజయ్ నూటికి నూరు శాతం కృషి చేశాడని నిర్మాతలు పేర్కొన్నారు. జులై 31న ఈ చిత్రం విడుదల కానుంది.NOTE: వీడియోలో ఉన్నది నటుడ విజయ్ దేవరకొండ కాదని పబ్లీష్ చేసిన సమయంలోనే వివరంగా చెప్పాము గమనించగలరు.#Kingdom lo vijay stunts elane vuntayi anta ni dedication ki hat's off anna @TheDeverakonda #KingdomOnJuly31st #VijayDevarakonda pic.twitter.com/q7zRIAAvJV— Dragon 🐉 (@Bharath111NTR) July 17, 2025 -
ఆస్పత్రిలో విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ (Kingdom Movie). గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మరోవైపు విజయ్‌కు బాలీవుడ్ మూవీలో విలన్‌గా నటించే ఆఫర్ వచ్చింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3 చిత్రంలో విలన్ పాత్ర కోసం రౌడీ హీరోను సంప్రదించారు. అయితే ఈ ఆఫర్‌కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.చదవండి: థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఈ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా అన్నదమ్ముల ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో విజయ్, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించారు. ఈ ఇద్దరి అనుబంధం నేపథ్యంతో రూపొందిన అన్నా అంటూనే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనిరుధ్ ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఆ సాంగ్ ప్రోమో వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈనెల 25న విడుదల కావాల్సినా ఈ చిత్రం వారం రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ఈ నెలాఖర్లో అంటే జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీలోని అన్నా అంటూనే సాగే ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. అనిరుధ్ ఆలపించారు. కాగా.. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
Anirudh Ravichander: తమిళ్ కి ఓ లెక్క తెలుగు కి ఓ లెక్క..
-
కారణం లేకుండా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ
తన మాటలు, చేతలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చాలా సైలెంట్ అయిపోయాడు. మరో 15 రోజుల్లో ఇతడు నటించిన 'కింగ్డమ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నెమ్మదిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. నిర్మాత నాగవంశీ లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిత్ర విశేషాలతో పాటు విజయ్ దేవరకొండని నెటిజన్లు టార్గెట్ చేయడం గురించి కూడా మాట్లాడారు. కారణం లేకుండానే అలా చేస్తున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.'విజయ్ దేవరకొండని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలానే కారణం లేకుండా అతడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావొచ్చు, రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో కావొచ్చు.. అతడు మాట్లాడింది వేరే అర్థం వచ్చేలా మార్చేస్తున్నారు' అని నాగవంశీ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)విజయ్ దేవరకొండ విషయానికొస్తే కెరీర్ ప్రారంభంలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో తర్వాత సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఆటిట్యూడ్‌తో మాట్లాడేవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వచ్చేవి. అందుకు తగ్గట్లు గత కొన్నేళ్లుగా ఇతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. మరీ ముఖ్యంగా గత రెండు చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ అయితే ఘోరమైన రిజల్ట్ అందుకున్నాయి. అందుకే ఇప్పుడు విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. హిట్ కొట్టిన తర్వాత మాట్లాడుదాం అనుకుంటున్నారు.'కింగ్డమ్'.. జూలై 31న థియేటర్లలోకి రానుంది. మరోవైపు రాహుల్ సంక్రిత్యాన్ తోఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్' అని మరో మూవీ విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ మూడు కూడా సక్సెస్ అయితేనే విజయ్ కెరీర్ పరంగా నిలబడతాడు. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోతాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంత మారిపోయాడా? అస్సలు ఊహించలేదుగా) -
టాలీవుడ్లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదానిరి అర్థం మరి సింపుల్‌గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్‌గ్రౌండ్ అండతో స్టార్‌గా ఎదగడమే. ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంచు మనోజ్ మాట్లాడారు. యూట్యూబ్‌తో కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్నే అని.. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. దీనికి కౌంటర్‌గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ)మంచు మనోజ్ మాట్లాడుతూ..'నేను కూడా నెప్టో కిడ్నే. అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు. బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. నేను కూడా అలానే వచ్చా. నెప్టో కిడ్‌గా చెబుతున్నా.. ఇక్కడ అలాంటివి పనిచేయవు. ఎవరైనా దేకాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అనేది.. పెద్ద స్టార్ చేశారా? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు.. సినిమా ఎప్పటికీ సినిమానే. మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది.' అని అన్నారు. కాగా.. మాళవికా మనోజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.🚨#ManchuManoj latest 💥pic.twitter.com/xXf7hb0M9N— Tollywood Movies ✨ (@TollyMovies4u) July 8, 2025 -
ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. జూలై 25న రావాల్సిన కింగ్డమ్ మరో ఆలస్యంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నెలాఖర్లో బిగ్ స్క్రీన్‌పై కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఓ స్పెషల్ వీడియోతో కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్క్రిప్ట్ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటున్నట్లు వెల్లడించారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో మనకు ఎలాంటి సపోర్ట్ లేకపోతే ఈ స్క్రిప్ట్ బాగాలేదు.. ఈ సినిమా నేను చేయను.. అని ముక్కుసూటిగా చెప్పలేం. గతంలో నాకు ఇంత ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న నటుడికే అవకాశం వస్తే.. ఆ స్క్రిప్ట్‌ను చేయనని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఆ తర్వాత అతని తండ్రి వచ్చి మరో మూడు, నాలుగు నెలలు ఆగండి. వీలైతే ఎక్కువమంది రైటర్లను తీసుకొస్తానని అంటాడు. నేనైతే ఇటీవల స్క్రిప్ట్‌ల విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులతో ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు డబ్బుతో పాటు కెరీర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేసేదానితో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నా. స్క్రిప్ట్‌తో ఓకే అనిపించిన తర్వాతే ముందుకు వెళ్తున్నా' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిటారు. ఈ యాక్షన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
ఆ ట్యాగ్ వల్ల ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తగలాయి: విజయ్
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గతంలో తన పేరు ముందు 'ది' ట్యాగ్‌ని ఉపయోగించిన తర్వాత, దానిని వివాదాస్పదంగా భావించి, అభిమానులకు తొలగించమని సూచించారు. దీనిపై తాజాగా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ఆ ట్యాగ్ ఇతర హీరోలతో పాటు వారి అభిమానులకు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని, తన పేరు ముందు 'ది' ఉపయోగించడం సరికాదనే నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.లైగర్ సినిమా విడుదల సమయంలో ఆయన పేరు ముందు సౌత్ సెన్సేషన్ అని చేర్చారు. దీంతో విజయ్ దేవరకొండపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగిందని ఇలా గుర్తుచేసుకున్నారు. 'లైగర్ సమయంలో నా పేరు ముందు ఒక ట్యాగ్‌లైన్ చేరుస్తున్నట్లు నా టీమ్ ఒత్తిడి చేసింది. నాకు ఆ ట్యాగ్ అక్కర్లేదు అంటూ వారికి చెప్పాను. దానిని చాలా కాలం పాటు వారితో ప్రతిఘటించాను. నా పేరుతోనే నాకు పేరు రావాలని మాత్రమే కోరుకున్నాను. కానీ మీడియాలో అప్పటికే సౌత్ సెన్సేషన్, రౌడీ స్టార్ వంటి ఇతర ట్యాగ్‌లైన్స్ నా పేరు ముందు చేరిపోయాయి.' అని ఆయన గుర్తు చేసుకున్నారు.అయితే, తన పేరు ముందు ఈ ట్యాగ్ లైన్స్ ఉండటం వల్ల కొందరికి ఇబ్బంది కలిగిందని అప్పుడే తొలగించాలని కోరినట్లు విజయ్ చెప్పారు. అయితే, తన పేరు ముందు 'ది' అని మాత్రమే ఉపయోగించాలని గతంలో ఆయన సూచించినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ, అది కూడా వివాదాస్పదం కావడంతో దానిని కూడా తొలగించాలని అభిమానులకు సూచించినట్లు విజయ్ చెప్పారు. తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్ చేర్చవద్దని తన అభిమానులను కోరినట్లు ఆయన గుర్తచేసుకున్నారు. తనను విజయ్ దేవరకొండ అని మాత్రమే పిలవమని కోరానన్నారు. ఏ హీరోలకు ఇలా జరగలేదు: విజయ్తన పేరు ముందు ఎలాంటి ట్యాగ్స్ అవసరం లేదని విజయ్ దేవరకొండ తాజాగా ఇలా చెప్పారు. 'నా పేరుకు ముందు 'ది' అనే పదం జోడించబడినందున విపరీతమైన వ్యతిరేఖత వచ్చింది. అలా వివాదాస్పదం కావడంతో తొలగించాలని అభిమానులకు అప్పుడే చెప్పాను. కానీ, చాలామంది హీరోలకు తమ పేరుకు ముందు ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఇలాంటి ట్యాగ్ వల్ల ఇతర ఏ హీరోలకు తగలనన్ని ఎదురుదెబ్బలు నాకు మాత్రమే తగిలాయి. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న వారికి యూనివర్సల్ స్టార్ నుండి పీపుల్స్ స్టార్ వరకు ఏ పేరు అయినా ఉండవచ్చు తప్పు లేదు. నాకంటే చిన్నవారు, నాకంటే పెద్దవారు, నాకంటే ముందు అరంగేట్రం చేసినవారు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక ట్యాగ్‌లైన్ ఉంటుంది. బహుశా నాకు మాత్రమే అలాంటివి లేవు. ఇలా మరెవరికీ ఎదురుదెబ్బ తగలకూడదు.' అని ఆయన అన్నారు. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈనెల 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. దీంతో మేకర్స్ మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.(ఇది చదవండి: విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!)తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని రివీల్ చేశారు. జూలై 31న కింగ్ డమ్ విడుదల కానుందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.One man.A heart full of fury.A world that pushed too far.Now it’s CARNAGE time.#Kingdom Release Date Promo out now 🔥Telugu - https://t.co/SYAlvEXoNhTamil - https://t.co/QHRfX0jNEUIn Cinemas July 31st, 2025 ❤️@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/OxOmcrZhil— Sithara Entertainments (@SitharaEnts) July 7, 2025 -
ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం డ్యూయల్ రోల్స్ సీజన్ కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే అభిమానుల ఆనందాలకు అవధులుండవు. అలాంటిది రెండు పాత్రల్లో కనిపిస్తే? ఇక చెప్పేదేముంది... పండగ చేసుకుంటారు. పైగా ద్విపాత్రాభినయం చేస్తే వేరియేషన్ చూపించే అవకాశం కూడా ఉంటుంది హీరోలకి. ఇక డ్యూయల్ రోల్స్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్న హీరోలపై ఓ లుక్కేద్దాం.మరోసారి...‘రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు’... ఇలా తన కెరీర్లో పలు సినిమాల్లో ద్విపాత్రాభియం చేసి, ప్రేక్షకులను అలరించారు చిరంజీవి(Chiranjeevi ). చాలా రోజుల తర్వాత ఆయన మరోసారి ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వినోదం నేపథ్యంలో రూపొందుతోన్న ‘మెగా 157’లో మనసుని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. చిరంజీవి పాత్ర ‘రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, యముడికి మొగుడు, చంటబ్బాయి’ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ద్విపాత్రాభినయంలో కనిపించనున్న చిరంజీవి తండ్రీ కొడుకులుగా కనిపిస్తారా? లేకుంటే సోదరులుగానా? అనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.రెండు చిత్రాల్లో...‘బాహుబలి 1, 2’ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు హీరో ప్రభాస్(Prabhas). ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి, బిల్లా’ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసిన ఆయన ‘ది రాజా సాబ్’తో మరోసారి తన అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో తాత–మనవడు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా పడింది.సలార్ 2 లోనూ...ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబరు 22న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారట ప్రభాస్. ‘సలార్’లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా ‘సలార్ 2’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆయన వస్తారని సమాచారం.రెండు సినిమాల్లోనూ తండ్రి... కొడుకు?‘‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో ఎన్టీఆర్(Jr NTR) చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఇటీవల జపాన్‌లో కూడా విడుదలవడం, అక్కడి ప్రమోషన్లలో ఎన్టీఆర్ పాల్గొనడం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘దేవర: పార్ట్ 2’ రూపొందనుంది. కొరటాల శివ ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పనుల్లోనే ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ‘దేవర’ చిత్రంలో కేవలం కొడుకు పాత్రనే చూపించారు దర్శకుడు. రెండో భాగంలో తండ్రి పాత్ర సందడి చేయనుంది. తండ్రి పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తుందని టాక్. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (హృతిక్ రోషన్ హీరో) ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్.మూడోసారి?హీరో రామ్‌చరణ్ ‘నాయక్’, ‘గేమ్ చేంజర్’ సినిమాల్లో ద్వి΄ాత్రాభినయం చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న ΄ాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్వి΄ాత్రాభియం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ఓ ప్రత్యేక ΄ాటలో కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారని భోగట్టా. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.తొలిసారి...‘పుష్ప 1, 2’’ వంటి భారీ పాన్ ఇండియా హిట్స్ తర్వాత హీరో అల్లు అర్జున్... తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఖరారు కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో అల్లు అర్జున్ తొలిసారి ‘ఏఏ 22 ఏ6’లో ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక పాత్ర హీరో కాగా మరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యత ఉందట. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుందని, అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్‌ను రంగంలోకి దింపుతున్నారనీ టాక్. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. 2026 ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోందట యూనిట్. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి అల్లు అర్జున్‌ది ద్వి΄ాత్రాభినయమా? త్రి΄ాత్రాభినయమా? అనే విషయంపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలి.తొలిసారి...హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ట్యాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నారట విజయ్. తండ్రీ కొడుకులుగా వెండితెరపై సందడి చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.సర్దార్ 2లో...కార్తీ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022 అక్టోబరు 21న విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘సర్దార్ 2’. ఇక గత ఏడాది కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ముగిసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలోనూ ద్వి΄ాత్రాభినయంలో కనిపించనున్నారు కార్తీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రొలాగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాని 2026 పొంగల్‌కి విడుదల చేయనున్నారట మేకర్స్. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా డ్యూయల్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది. -
కింగ్డమ్ గురించి తిడుతూనే ఉన్నారు.. మీకు మాటిస్తున్నా: నాగవంశీ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మే 30కి వాయిదా వేశారు. అప్పటికీ కింగ్డమ్కు మెరుగులు దిద్దడం కంప్లీట్ కానందున జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు నితిన్ తమ్ముడు చిత్రం విడుదలవుతోంది.మళ్లీ వాయిదాఅయితే కింగ్డమ్ (Kingdom Movie) వాయిదా పడటం ఖాయం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. కింగ్డమ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. నేను ఏం పోస్ట్ చేసినా కింగ్డమ్ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్ ఎంతగానో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా.. కింగ్డమ్ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. కింగ్‌డమ్‌దే విజయంనేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా.. కింగ్‌డమ్‌దే గెలుపు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం అన్నాడు. దీంతో కింగ్డమ్ వాయిదా కన్ఫార్మ్ అయిపోయింది. Em post chesina, Kingdom sweet curses mathram vasthune untayi ani telusu 😅But trust me our team is working around the clock to bring you a Massive Big Screen Experience… One thing I can promise you - The ADRENALINE RUSH this film delivers is unreal 🔥🔥And you all know…— Naga Vamsi (@vamsi84) June 30, 2025 చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
ఆ సినిమా తర్వాత పెళ్లి పీటలు ఎక్కనున్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ?
-
దిల్ రాజు డ్రీమ్స్ అద్భుతమైన ప్లాట్‌ఫామ్
‘‘కొత్త వాళ్లకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. ‘దిల్’రాజుగారికి ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్ సైట్‌ని ఎందుకుప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు. ఇది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్. లక్షలాది మందికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్ సైట్ లాంచ్‌కి న్యాయం జరిగినట్టే’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై, వెబ్ సైట్‌ని లాంచ్ చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శేఖర్ కమ్ములగారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాకి నటుడిగా చాన్స్ కోసం అపై్ల చేశాను. దాదాపు 6 నెలలు వేచి చూశాను. 16 వేల అప్లికేషన్స్‌లో 11 మందిని ఎంపిక చేయగా వారిలో నేనూ ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. మన కలని, మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి’’ అని చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్ ఉండదు. అలాంటి కొత్త టాలెంట్ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ‘దిల్ రాజు డ్రీమ్స్’ సంస్థనిప్రారంభించాం. మేము ఇక్కడికి రావడానికి 30 ఏళ్లు పట్టింది. ఇక్కడ సక్సెస్ అనేది ఒక్క శాతం మాత్రమే. ఎప్పుడైతే మీరు సినిమా రంగంలో సక్సెస్ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు 24 గంటలు కష్టపడాలి. నేను, విజయ్, దేవిశ్రీ, నాని... ఇలా అందరూ ఇండిపెండెంట్‌గా సక్సెస్ అయి వచ్చిన వాళ్లమే. అంతకుముందు జనరేషన్ లో చిరంజీవి, రజనీకాంత్‌గార్లు కూడా ఇండిపెండెంట్‌గానే సక్సెస్ సాధించారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇక్కడికి ఎంతోమంది ప్రతిభావంతులు వచ్చారు. మీరు ఎదిగాక ఇండస్ట్రీని మర్చిపోవద్దు’’ అని నిర్మాత శిరీష్ కోరారు. -
విజయ్ దేవరకొండకి కొత్త పేరు పెట్టిన రష్మిక.. ఎంత ముద్దుగా ఉందో!
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే గాసిప్ గత కొనేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. వాటిపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ కానీ స్పందించడం లేదు కానీ..‘అవును మేం ప్రేమలోనే ఉన్నాం’ అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్ అయితే ఇస్తున్నారు. కలిసి ట్రిప్స్‌కి వెళ్తున్నార.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే.. పరోక్షంగా తాము రిలేషన్లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్ ఉన్న ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..తమ లవ్ మ్యాటర్‌ని కొంచెం కొంచెం రిలీల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక విజయ్‌కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి.. మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.వారియర్‌గా రష్మిక.. ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక..ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆమె వారియర్‌గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్ లుక్‌లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్ లుక్‌పై ప్రశంసలు కురిస్తూ.. రష్మికకి ఆల్ ది బెస్ట్ చుబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ కూడా మైసా ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు.విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా విజయ్ పోస్ట్‌పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్‌తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో విజయ్‌కి చాలా మంది హీరోయిన్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ...ఎవరూ కూడా అలా పిలవలేదు. విజయ్‌తో రష్మికకు స్నేహానికి మించిన బంధం ఉంది కాబట్టే అలా ముద్దుగా పిలిచిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. -
మత్తు ముఠాలూ.. ఈగల్ ఉంది జాగ్రత్త: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే సమీక్ష పెట్టి మరీ హెచ్చరించా..తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని. మళ్లీ అదే చెబుతున్నా.. తెలంగాణ సరిహద్దుల్లోకి మత్తు ముఠాలు రావాలంటే వణికే పరిస్థితి ఉండాలి. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే యాజమాన్యాలపైనా కేసులు పెడతాం. తెలంగాణలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కనిపెట్టేలా ‘ఈగల్’ రంగంలోకి దిగుతుంది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా? ఉద్యమాల గడ్డ తెలంగాణ. ఇక్కడ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా?..’ అంటూ ప్రశ్నించారు. అంతా కలిస్తేనే ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా పాల్గొన్న సినీ హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పంజాబ్, హరియాణా పరిస్థితి రావొద్దు ‘ఒకప్పుడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను గంజాయి, డ్రగ్స్ గడ్డగా మార్చొద్దు. ఒకప్పుడు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ రక్షణలో ముందున్న పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని యువత ఇప్పుడు డ్రగ్స్ మహ్మమ్మారితో నిరీ్వర్యమైపోతోంది. అలాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా ఉండాలనే సదుద్దేశంతోనే తెలంగాణలో గంజా యి, ఇతర మత్తుపదార్థాల రవాణా, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక దేశాన్ని దెబ్బ తీసేందుకు శత్రు దేశాలు డ్రగ్స్‌ను సైతం ఆయుధంగా మార్చుకునే పరిస్థితులు నేడు ఉన్నాయి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.. ఇకపై ‘ఈగల్’ ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)ను ఇకపై ‘ఈగల్’ గా మారుస్తున్నాం..ఈగల్ అంటే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్. తెలంగాణలోని కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి పండించినా..ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లయ్ చేసినా ఈగల్ గుర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లో డ్రగ్స్ పట్టుబడితే యా జమాన్యాల పైనా కేసులు పెట్టాలని డీజీపీని ఆదేశిస్తున్నా. కాలేజీలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి విద్యార్థుల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత యాజమాన్యాలపైనా ఉంది. కొందరు తల్లిదండ్రులు తమకున్న పరిస్థితుల కారణంగా వారి పిల్లలపై దృష్టి పెట్టలేకపోవచ్చు. కానీ అత్యంత ఎక్కువ సమయం స్కూళ్లు, కాలేజీల్లోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల ప్రవర్తనను గమనించేందుకు యాజమాన్యాలు చైల్డ్ సైకాలజిస్టులను ఏర్పాటు చేసుకోవాలి. చాక్లెట్లు కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి డ్రగ్స్ జాడ గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు కూడా ఒకవేళ చదువుల్లో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. నేను ఉద్యోగాలు ఇస్తాను. లేదంటే రాజకీయంగా ఎదగాలి. మన యువత న్యూయార్క్, టోక్యో, సౌత్ కొరియా యువతతో పోటీపడే స్థాయికి ఎదగాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. సినీ హీరోల విజయ గాథలు స్ఫూర్తిగా తీసుకోవాలి ‘ఎవరికీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. కష్టపడితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయి. మాకెవరికీ బ్యాంక్ గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కఠోర శ్రమతో ఆయన మెగాస్టార్‌గా ఎదిగారు. రామ్‌చరణ్ కూడా ఎంతో శ్రమతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించారు. నేను కూడా 2006లో జెడ్పీటీసీగా మొదలు పెట్టి 2023 నాటికి రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యాను. విజయ్ దేవరకొండ కూడా నాలాగే నల్లమల నుంచి వచ్చారు. మా పక్క ఊరే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగారు. అయితే సినిమాల్లోని పాత్రలను కాకుండా సినీ హీరోల నిజ జీవితంలోని విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..’ అని రేవంత్‌రెడ్డి కోరారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకునే వారిని బహిష్కరించాలని మలయాళ సినీ పరిశ్రమలో నిర్ణయం తీసుకున్నారని, తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అలాంటి చర్యలు తీసుకోవడంపై చర్చిస్తామన్నారు. తెలంగాణను మత్తు రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ జితేందర్ కోరారు. ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నషా ముక్త్ (మత్తు రహిత) తెలంగాణ ధ్యేయంగా తమ విభాగం పనిచేస్తోందన్నారు. కాగా డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లొద్దని..డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దామనే నినాదంతో రూపొందించిన లఘు చిత్రాన్ని, వీడియో గీతాన్ని సీఎం విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.‘డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం’ వీడియో గీతాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయ్ దేవరకొండ, రాంచరణ్, అడ్లూరి లక్ష్మణ్, గోపీచంద్, జితేందర్ ఒక తండ్రిగా నాకు ఆందోళన కలుగుతోంది.. స్కూళ్ల వద్ద ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో ఏమిస్తున్నారో తెలియట్లేదు. పిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక తండ్రిగా ఇప్పుడు నాకు కూడా ఆందోళనగా ఉంది. యువత డ్రగ్స్ వైపు మళ్లకుండా కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. డ్రగ్స్ మహమ్మారిని తరిమేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి మేం కూడా పూర్తిగా సహకరిస్తాం. డ్రగ్స్ బారిన పడకుండా కాపాడడం మన కుటుంబం నుంచే మొదలు పెడదాం. ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే డ్రగ్స్లేని సమాజం సాధ్యం. – రామ్చరణ్ఆరోగ్యం లేకపోతే అన్నీ వృథాయే.. సినిమాలు, షూటింగ్‌లు, ఇల్లు మినహా బయట ఏం జరుగుతుందో నాకు పెద్దగా తెలియదు. కానీ ఈ మధ్య కొందరు పోలీసు అధికారులు ఈ డ్రగ్స్ విస్తరణను నాకు వివరించారు. ఆ తర్వాతే ఇది ఎంత ముఖ్యమైన అంశమో నాకు అర్థమైంది. అందుకే డ్రగ్స్‌తో వచ్చే ముప్పును చెప్పడానికి వచ్చా. డబ్బులు లేని లైఫ్‌ను.. ఉన్న లైఫ్ నేను చూశా. సక్సెస్, మనీ ఉన్నా..ఆరోగ్యం బాగా లేకపోతే అది వృథా. కాబట్టి డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించండి..డబ్బులు సంపాదించండి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. అదే మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. – విజయ్ దేవరకొండ -
ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్డీసీ ఛైర్మన్, సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ..' మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై.. ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్‌కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్ బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్‌శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం' అని పిలుపునిచ్చారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్‌లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ ... డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్‌కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని అన్నారు.Getting Successful in filmsPlaying a Game after our workSpending quality time with FamilyGives you high that you can't get from anywhere.- #RamCharan Message to Youthpic.twitter.com/rjDHweFOfQ— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) June 26, 2025 -
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు
గచ్చిబౌలి: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన తమిళ హీరో సూర్య చిత్రం రెట్రో ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్ర దాడి అంశాన్ని ప్రస్తావించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘కశ్మీర్ మనదే.. కశ్మీర్ ప్రజలు మనవాళ్లే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్ యుద్ధం చేసిన రీతిలో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం చేస్తోంది.కానీ పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తిండి, నీళ్లు లేక వాళ్ల ప్రజలే పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తారు’అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ చేసినట్లుగా’అనే వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరిచాయంటూ ట్రైబల్ కమ్యూనిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ నాయక్ అలియాస్ అశోక్ రాథోడ్ ఈ నెల 17న రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. విజయ్ దేవరకొండపై శనివారం అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. -
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు అయింది. ఏప్రిల్ 26న జరిగిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో గిరిజనులను అవమానించలేలా మాట్లాడారంటూ విజయ్‌పై గిరిజన సంఘం నాయకుడు అశోఖ్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు వారు వివరించారు.ఇంతకీ ఏం జరిగింది?ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేడయంతో విజయ్‌పై కేసు నమోదు చేశారు.అప్పుడే స్పందించిన విజయ్ఈ వివాదంపై విజయ్ అప్పుడే స్పందించాడు. తాను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని చెప్పారు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. -
విజయ్ దేవరకొండతో సినిమా.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే?
మహానటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుల్ సెటైరికల్ కామెడీ ఓరియంటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఐవీ శశి దర్శకత్వం వహించారు. రాధికా ఎల్ నిర్మించిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో కీర్తి సురేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానిలిచ్చారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మీరు నటిస్తున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కీర్తి సురేశ్.. ఈ విషయాన్ని దిల్ రాజు సార్ చెబుతారంటూ నవ్వుతూ మాట్లాడింది. కాగా.. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా గురించి కీర్తి సురేశ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. 'ఇప్పటివరకూ చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. కుటుంబమంతా ఇంట్లో కూర్చోని హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఒక సీరియస్ విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పాం' అని అన్నారు. ఈ చిత్రంలో బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, రవితేజ, విష్ణు, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ప్రభావతి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. -
కారులో జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?
రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్‌గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్‌పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్టైనర్)కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్‌ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J— Lilly ✨ (@therwdygirl) June 18, 2025 -
రష్మిక మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ!
నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బిగ్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్ ది బెస్ట్ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.Wishing #Kuberaa all the very best as it heads to the big screen. @sekharkammula sir will always be a special name in my journey — he gave many actors like me hope. To see him now telling a story on this scale, with a cast filled with personal favourites like @dhanushkraja,…— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2025 -
విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక
విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు రష్మిక. వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు, అది కూడా చాలా ఏళ్ల క్రితం చేశారు. కానీ వీళ్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. అదే ప్రేమ. రష్మిక-విజయ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు విదేశాలకు టూర్స్‌కి వెళ్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు తమ బంధం గురించి పెద్దగా స్పందించని రష్మిక.. రీసెంట్ టైంలో మాత్రం మెల్లమెల్లగా క్లూలు ఇస్తోంది.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రష్మిక చిన్న హింట్ ఒకటి ఇచ్చేసింది. యాంకర్ సుమ.. ఈ సినిమాలో నటించిన ధనుష్, నాగార్జునలని కూడా పలు ప్రశ్నలు అడిగింది. రష్మికని మాత్రం ఫలానా హీరోల నుంచి ఏం కాపీ కొడతారు అని అడగ్గా.. నాగార్జున దగ్గర నుంచి ఛార్మ్, ధనుష్ దగ్గర సూర్యుడి కింద అయిన పనిచేసేలా బలం, అల్లు అర్జున్ దగ్గర నుంచి స్వాగ్, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి అని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు) శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ధనిక-పేద, డబ్బు బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు. ఇందులో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పటివరకు అయితే పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం ఈమె బాగానే పాల్గొంటుంది. మొన్నీమధ్య టీమ్‌తో కలిసి ముంబై కూడా వెళ్లొచ్చింది.ఇక రష్మిక-విజయ్ దేవరకొండ బంధం విషయానికొస్తే.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం అటు అవును అని గానీ ఇటు లేదు గానీ చెప్పకుండా అలా సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అదే రీతిన బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉంది. విజయ్ దేవరకొండ మాత్రం 'కింగ్డమ్' మూవీని రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. జూలై 4న విడుదల అన్నట్లు చెప్పారు గానీ ఈసారి కూడా వాయిదా పడటం గ్యారంటీ అంటున్నారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)"I want to Copy Everything from #VijayDeverakonda" - Rashmika pic.twitter.com/YEgwjURgrY— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 -
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్‌లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్‌డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్‌గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్‌లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్‌గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్‌గా తనదైన మేనరిజమ్‌తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్‌గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్‌లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్‌తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్‌గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్‌లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్‌గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్‌లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్‌గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్‌కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్‌గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్‌పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
‘యాస’కు సై అంటున్న టాలీవుడ్ స్టార్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస మారుతోంది. గతంలో హీరోలు, హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా అన్ని ప్రాంతాల వారికి అర్థమయ్యేలా సాధారణ యాసలో డైలాగులు చెప్పేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. చిత్రకథ ఏ ప్రాంతీయ నేపథ్యంలో సాగుతుందో అక్కడి యాసని పలికేందుకు నటీనటులు సై అంటున్నారు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ, ఆంధ్ర... ఇలా ప్రాంతం ఏదైనా అక్కడి నేటివిటీకి తగ్గట్టు యాస నేర్చుకుని, తమదైన శైలిలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నారు. ఇలాంటి చిత్రాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో మేకర్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మన హీరోలు పలుకుతున్న యాస విశేషాలేంటో చూద్దాం... రాయలసీమ నేపథ్యంలో... చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగానే ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి శ్రీకారం చుట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేశారు మేకర్స్. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందనుందని, చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారనీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో రాయలసీమ నేపథ్యం ఉంటుందని సమాచారం. చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. సో... చిరంజీవి రాయలసీమ యాసలో అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ వంటి చిత్రాల తర్వాత చిరంజీవి– నయనతార కలిసి మూడవసారి నటిస్తున్న చిత్రం ‘మెగా 157’. 2026 సంక్రాంతి కానుకగా ‘మెగా 157’ విడుదల కానుంది. పుడతాం ఏటి మళ్లీ... రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో.. ‘ఓటే పని చేసే నాకి, ఒకేనాక బతికే నాకి ఇంత పెద్ద బతుకెందుకు?’, ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన వచ్చింది. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ భారీ విలేజ్ సెట్లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర తారాగణంపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్‌తో సుమారు 50 శాతం పూర్తవుతుందని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 2026 మార్చి 27న ‘పెద్ది’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.బ్రిటీష్ పాలన నేపథ్యంలో... విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాతో తొలిసారి రాయలసీమ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. తెలంగాణకి చెందిన విజయ్ ‘వీడీ 14’లో తన పాత్ర కోసం మొదటిసారి రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ఆ యాసని పర్ఫెక్ట్గా పలికేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో దేశభక్తి అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ఓ యోధుడిగా కనిపించనున్నారట విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా కథ కూడా రాయలసీమ నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది.కదిరి నరసింహ సామి సాచ్చిగా... వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో కొనసాగుతుంది. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ ఇటీవల వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం స్పష్టమైంది. అందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్ అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురంలోని ప్రముఖ కార్ల కంపెనీ కియా గ్రౌండ్స్‌తో పాటు అక్కడి అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే ఈ షెడ్యూల్ ముగిసినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, ద్వితీయ షెడ్యూల్ అనంతపురంలో విజయవంతంగా పూర్తి చేసింది యూనిట్. మూడో షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు తనదైన పంచ్ హ్యూమర్‌తో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు మేర్లపాక గాంధీ. ‘వీటీ 15’ కోసం అనంతపురం యాసలో మాట్లాడనున్నారు వరుణ్ తేజ్. ఈ సినిమాకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారట.ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం రాయలసీమలోని చిత్తూరు నేపథ్యంలో సాగనుంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అక్కినేని అఖిల్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు అఖిల్. ఇందుకోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఆయన మేకోవర్ అయ్యారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్ చిత్తూరు జిల్లాలో కొనసాగనున్నట్లు తెలిసింది.ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా...‘విరూపాక్ష, బ్రో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ‘హనుమాన్ ’ వంటి బ్లాక్‌బస్టర్ పాన్ ఇండియన్ మూవీ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోందని సమాచారం. ‘ఏటిగట్టు సాచ్చిగా సెప్తుండా.. ఈ తూరి నరికినానంటే అరపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాల్లోనుంచొచ్చాది’ అంటూ రాయలసీమ యాసలో సాయి దుర్గాతేజ్ చెప్పిన డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. పైగా ఫస్ట్ లుక్స్, టీజర్ చూసిన వారికి తన కెరీర్లోనే పూర్తి స్థాయి మాస్ లుక్‌లో, బలమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలు స్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ అయ్యారు తేజ్. ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా 120 రోజుల పాటు కొనసాగింది. ఈ లెంగ్తీ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో కలుపుకుని 75 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.మదనపల్లె యాసలో... ‘మేజర్, హిట్: ది సెకండ్ కేస్’ వంటి హిట్ సినిమాల తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. ఇంటన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో అద్భుతంగా అనిపించింది. ఈ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. రాయలసీమలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యాసలో అడివి శేష్ పలికిన డైలాగ్స్, ఆయన వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తెరకెక్కుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా అడివి శేష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. ‘డెకాయిట్’ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్ 25న విడుదల కానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కీర్తి సురేశ్.. చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే తన నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే, సూర్యతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్లీ బిజీ అవుతుంది. బాలీవుడ్ తన మొదటి సినిమా 'బేబీ జాన్' నిరాశ పరిచినప్పటికీ మళ్లీ అక్కడే మరో ఛాన్స్ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. నటుడు రాజ్‌కుమార్ రావుతో (Raj Kumar Rao) కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. ‘సెక్టార్ 36’ ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.అదే విధంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేశ్( Keerthy Suresh) నటించే ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రంలోనూ కథానాయకిగా నటించే అవకాశం ఆమెను వరించిందట, అయితే ఆమె విజయ్‌దేవరకొండకు జంటగా నటించనున్నడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్‌ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి వివాహానంతరం మళ్లీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకుముందు సూర్యకు జంటగా 'గ్యాంగ్' చిత్రంలో నటించారన్నది గమనార్హం. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో సౌత్ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు. -
మళ్లీ దొరికిపోయిన రష్మిక.. తానే హింట్ ఇచ్చిందిగా!
పుష్పభామ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పుష్ప-2 తర్వాత వచ్చిన ఛావా మూవీతో సైతం సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సికందర్లోనూ మెరిసింది. ప్రస్తుతం నాగార్జున-ధనుశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉండే ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్‌గా ఉన్నాయి. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ నెట్టంట భిన్నమైన కామెంట్స చేస్తున్నారు. ఆ ఫోటోలు తీసింది.. మరెవరో కాదు.. బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ.. "ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి. ఈ రంగు, ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్.. ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్‌లో భర్తీ చేయలేనివి " అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోల్లో ఉన్న బ్యాగ్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలు కచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు. ఏదేమైనా గతంలో చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక.. మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది. గతేడాది దీపావళి పండుగ సమయంలోనూ రష్మిక.. విజయ్ ఇంటివద్దనే సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే గత కొన్నేళ్లుగా రష్మిక-విజయ్‌పై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరు జంటగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో నటించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’పై విజయ్ దేవరకొండ!
తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ పత్రిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన తాజా ఎడిషన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండను ప్రచురించింది. "విజయ్ దేవరకొండ: ది మ్యాన్ ఆన్ ఎ మిషన్" అనే ఆకర్షణీయ టైటిల్‌తో విడుదలైన ఈ మ్యాగజైన్ దృష్టిని సొంతం చేసుకుంటోంది. "ఆత్మవిశ్వాసం, ఆకర్షణతో నిండిన విజయ్ దేవరకొండను మేము క్యాప్చర్ చేశాం. తన రాబోయే చిత్రం 'కింగ్డమ్'తో విజయ్ ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు" అని 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తమ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పాన్-ఇండియా చిత్రం "కింగ్డమ్"తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. "కింగ్డమ్" జూలై 4, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ మరియు జోమన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా రూపొందుతోంది. 'కింగ్డమ్' విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'కింగ్డమ్' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. లెక్క ప్రకారం ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ ఏం మొదలు పెట్టకపోవడంతో వాయిదా గ్యారంటీ అని గత కొన్నిరోజులుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. కొత్త రిలీజ్ తేదీని మూవీ టీమ్ ప్రకటించింది.'లైగర్', 'ద ఫ్యామిలీ స్టార్' లాంటి డిజాస్టర్స్ తర్వాత విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఎలాండి హడావుడి లేకుండా 'కింగ్డమ్' పూర్తి చేశాడు. కొన్నిరోజుల క్రితం ఓ పాట రిలీజ్ చేయగా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడేమో జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. కానీ రీ రికార్డింగ్ లాంటి కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఈ వాయిదా అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే జూలై 4న నితిన్ 'తమ్ముడు' కూడా రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితమే ఇది అనౌన్స్ చేశారు. మరి ఇద్దరూ వస్తారా? లేదా ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?'కింగ్డమ్' మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. నాగవంశీ నిర్మాత. చాన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా. ఇప్పుడు రాబోయేది తొలి పార్ట్ మాత్రమే. హిట్ అయిన దానిబట్టి సీక్వెల్ కూడా ఉండొచ్చు.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) -
సైన్యం కోసం విజయ్ దేవరకొండ
-
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు డబుల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. విజయ్ నటించనున్న ‘వీడీ 14’, ‘ఎస్వీసీ 59’ సినిమాల కొత్తపోస్టర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండపోస్టర్ని రిలీజ్ చేశారు.‘‘బ్రిటిష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘వీడీ 14’. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగాపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందనున్న 59వ చిత్రం ఇది. అందుకే ‘ఎస్వీసీ 59’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఓపోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈపాన్ ఇండియా సినిమాని రూపొందించనున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది.రౌడీ వేర్ లాభాల్లో సైన్యానికి విరాళం విజయ్ దేవరకొండకి క్లాత్ బ్రాండ్ ‘రౌడీ వేర్’ ఉన్న విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అంటూ రాబోయే కొన్ని వారాలపాటు ఈ రౌడీ వేర్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భారత సైన్యానికి విరాళంగా ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. -
భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యానికి పలువురు విరాళాలు ఇస్తున్నారు. తన వంతు బాధ్యతగా ఇప్పుడు విజయ్ కూడా విరాళం ప్రకటించాడు.(ఇదీ చదవండి: మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే) రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్ అసలు చేస్తారా లేదా? సినిమా విడుదల కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) This year, @TheDeverakonda's birthday is more than a celebration - it’s about giving back.Spot the Deverakonda Birthday Truck in your city and grab a free ice cream!And for the next few weeks, a portion of all #RWDY proceeds will go to the Indian Armed Forces.Jai Hind.… pic.twitter.com/al65L0NWum— Suresh PRO (@SureshPRO_) May 9, 2025 -
బర్త్‌డే స్పెషల్.. విజయ్ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
మళ్ళీ కలిసి నటిస్తున్న లవ్ బర్డ్స్?
-
‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ
గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్‌అయితే విజయ్ మాత్రం ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ తన ఎక్స్ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎవరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025 -
'విజయ్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నిజమే అంటూ 'రష్మిక' హింట్
వెండితెరపై విజయ్ దేవరకొండ-రష్మికలది (Rashmika) ప్రత్యేకమైన జోడీ అని చెప్పవచ్చు. వారిద్దరు మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ‘గీత గోవిందం’తో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్ కామ్రేడ్’తో అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోసారి రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ(Vijay devarakonda) స్క్రీన్‌పై కనిపించనున్నాడని అర్థం అవుతుంది.విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్‌తో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్‌ను మొదటగా మైత్రి మూవీస్, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్- రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, HMMLetsee అనే దానికి అర్థమేంటి..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్- రష్మికలతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన రష్మక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విజయ్‌తో ఉన్న స్నేహం వల్ల తేదీలు సర్ధుబాటు చేయనుందట. VD14 అనే వర్కింగ్టైటిల్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్ చేశారని టాక్. రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు. #HmmLetsSee @iamRashmika 😉— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025 -
అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') 'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!) -
అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ'
గత కొన్నాళ్లుగా హిట్ పడక డీలా పడిపోయిన హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. కింగ్డమ్ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. మే 30న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 'హృదయం లోపల' అని చిత్రంలోని తొలి పాటని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander)కి విజయ్ ప్రేమలేఖ రాయడం విశేషం.(ఇదీ చదవండి: చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?) 'మనం పాట రిలీజ్ చేశాం కదా. ఈ సందర్భంగా అనిరుధ్ కి నా చిన్న ప్రేమలేఖ. వీఐపీ, త్రీ సినిమాలు రిలీజైనప్పటి నుంచే నేను అనిరుధ్ కి వీరాభిమానిని. అసలు ఈ కుర్రాడెవరా? నేను యాక్టర్ అయిన తర్వాత అతడు మ్యూజిక్ కి నేను స్క్రీన్ పై కనిపించాలని అనుకునేవాడిని. పదేళ్ల తర్వాత ఇప్పుడు నా 13వ సినిమా రిలీజ్ కి రెడీ. మరో 28 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇది విజయ్ దేవరకొండ-అనిరుధ్ తొలి పాట. ఇప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టాడు.'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. అనిరుధ్ సంగీతమందించాడు. ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెలంతా చేస్తూనే ఉంటారు. మరి ఈసారైనా 'కింగ్డమ్' మూవీతో(Kingdom Movie) విజయ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Hey @anirudhofficial ☺️#HridayamLopala from #Kingdom - Today 4.06 PM onwards ❤️@gowtam19 @vamsi84 pic.twitter.com/NoIt6IiXea— Vijay Deverakonda (@TheDeverakonda) May 2, 2025 -
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు. గిరిజన ప్రజల గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే?సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అతడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ ఇండియాది. కశ్మీరీలు మనవాళ్లే.. రెండేళ్ల క్రితం ఖుషీ సినిమా షూటింగ్ అక్కడే జరిపాం. అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయి. పాకిస్తాన్ వాళ్లు.. అక్కడి ప్రజలనే చూసుకోలేరు.. అలాంటిది ఇక్కడేం చేయాలని చూస్తున్నారో!ఇండియా.. పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పీచ్ ఇచ్చాడు. ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చడంపై వ్యతిరేకత వచ్చింది. What a speech anna @TheDeverakonda ❤️🙌🏻#RetrofromMay01 #VijayDevarakonda #KINGDOM pic.twitter.com/653qCLhlu8— The Revanth (@Revanth__7) April 26, 2025 చదవండి: 21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్‌ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
పాకిస్తాన్ కొడుకుల్ని.. రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ
-
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
‘‘నేను యాక్టర్ కావాలనుకున్నప్పుడు సూర్య అన్నని కలవాలనుకునేవాణ్ణి. ‘గజినీ’ సినిమా చూసి.. ఆ బాడీ ఏంటి? డ్యాన్స్ ఏంటి? నటన ఏంటి? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయో తెలుసుకునేందుకు ఆయన్ని కలవాలని చాలాసార్లు అనిపించేది. కలవాలనే కోరిక ఉన్నా కలవలేకపోయాను. నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఈ మూమెంట్, ఈ ‘రెట్రో’ సినిమా నా జీవితంలో మరపురాని అనుభూతి’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నాను.. మేమంతా మీకు అండగా ఉంటాం. నా లైఫ్‌లో ఒక సినిమాటిక్ మెమొరీ అంటే ‘చంచల...’ (సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా) పాట వచ్చినప్పుడు... ఆ రోజు నాకు కలిగిన అనుభూతిని ఈరోజు వరకు మరచిపోలేదు. ఇప్పటికీ ఆ పాటని వింటూ నా బాల్యంలోకి వెళుతుంటాను. నాకు ‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక కశ్మీర్ మనదే.. కశ్మీరీయులు మనవారే. ఇండియా.. పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన పనే లేదు. ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వారి ప్రభుత్వంపై దాడి చేస్తారు. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ–‘‘కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలోప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకుశాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. ‘రెట్రో’లో లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నాగవంశీగారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీగారి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్–3’ కూడా విజయం సాధించాలి. విజయ్ ‘కింగ్ డమ్’ సినిమా కూడా సక్సెస్ కావాలి. ‘అగరం ఫౌండేషన్’ గురించి విజయ్ మాట్లాడాడు.. అయితే చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా ‘అగరం ఫౌండేషన్’కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు’’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ–‘‘రెట్రో’ సినిమాని తెలుగులో పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన సూర్య సర్కి థ్యాంక్స్. ఈ సినిమాతో మీకు ఇక్కడ బ్లాక్ బస్టర్ ఇస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘రెట్రో’ చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం, డైరెక్టర్ వెంకీ అట్లూరి, పాటల రచయిత కాసర్ల శ్యాం, నటుడు కరుణాకరన్ మాట్లాడారు. -
బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్‌కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!
హీరో విజయ్ దేవరకొండకు హిట్ పడి చాలాకాలమైపోయింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. గత రెండు చిత్రాలు లైగర్, ద ఫ్యామిలీ స్టార్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'కింగ్ డమ్' మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో మీడియా కంట కూడా విజయ్ పడలేదు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)అలాంటిది ఇప్పుడు ఓ బాలీవుడ్ జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్.. విజయ్ దేవరకొండపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇతడి పట్ల హిందీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.'లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్ చూసి నేను చాలా అప్ సెట్ అయ్యాను. ఎందుకంటే మన మీడియా(బాలీవుడ్) విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ లా చూపిస్తోంది. సౌత్ కి వెళ్తే కేవలం టైర్-2 హీరో మాత్రమే. అతడేం సూపర్ స్టార్ కాదు. మన జర్నలిస్ట్ ఒకరు.. మన దగ్గర సల్మాన్ ఉంటే అక్కడ విజయ్ ఉన్నాడని అన్నారు. విజయ్ 12 సినిమాలు తీస్తే అందులో 9 ఫ్లాప్స్. ఓ మూడు హిట్స్ ఉన్నాయంతే'(ఇదీ చదవండి: నా కళ్లు అందుకే ఎర్రగా ఉన్నాయ్.. రష్మిక వీడియో)'లైగర్ సినిమా కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. కానీ ఫుల్ రన్ లో రూ.20 కోట్లు వచ్చాయి. ఇక్కడి పీఆర్స్ విజయ్ దేవరకొండ పెద్ద బ్రాండ్, స్టార్ అన్నట్లు చూపించారు. అలాంటిది ఇతడిని సల్మాన్ ఖాన్ తో పోలుస్తున్నారు. సల్మాన్ ఫ్లాప్ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది' అని సదరు జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చెప్పుకొచ్చాడు.మరి ఉన్నట్లుండి ఈ బాలీవుడ్ జర్నలిస్ట్ విజయ్ దేవరకొండపై ఎందుకు పడ్డాడనేది అర్థం కాలేదు. విమర్శలు ఘాటుగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని నిజాలు లేకపోలేదు. మరి 'కింగ్ డమ్'తో హిట్ కొట్టి, ఇలాంటోళ్ల నోళ్లు విజయ్ దేవరకొండ మూయిస్తాడా లేదా అనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)I was shocked when our media hyped #VijayDeverakonda like a demiGod.He’s a tier 2 hero in the south, not a superstar. #Liger made - 20cr, yet he was compared to #SalmanKhan, whose flops still earn 100cr.— Pink Villa Himesh Mankad pic.twitter.com/yRG1eSNYKx— Telugu Chitraalu (@TeluguChitraalu) April 13, 2025 -
విజయ్ దేవరకొండ నాన్న వర్ధన్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన టీమ్ (ఫోటోలు)
-
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవాళ్లలో కూడా రెగ్యులర్ సినిమాలు చేసేవాళ్లు ఇంకా తక్కువని చెప్పొచ్చు. రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'లో (Mad Square) లైలా పాత్రలో కనిపించిన అలరించిన ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) తెలుగు బ్యూటీనే. అనంతపురంలో పెరిగిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో అనుభవాల్ని పంచుకుంది.'నేను సినిమాల్లో ప్రయత్నిస్తున్నానని మా ఇంట్లో తెలుసు. అలా నాకు విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా'చిత్రంతో (Taxiwala Movie) అవకాశమొచ్చింది. అయితే వారం రోజుల షూటింగ్ అయ్యేంత వరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో నా మొదటి సినిమా. అసలు ఉంటానో మధ్యలోనే తీసేస్తారో అని భయంగా ఉండేది.' (ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)'అందుకే షూటింగ్ మొదలైన వారం వరకు ఈ సినిమాలో నేనే హీరోయిన్ ఎవరికీ చెప్పలేకపోయా. కాస్త నమ్మకం రాగానే ఇంట్లో చెప్పాను. అప్పుడు వాళ్లు కూడా సంతోషపడ్డారు. తర్వాత అందరికీ చెప్పుకొన్నాను' అని ప్రియాంక చెప్పుకొచ్చింది.షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక.. 2017లో 'కలవరమాయే' మూవీతో హీరోయిన్ అయింది. కానీ ట్యాక్సీవాలా చిత్రంతో గుర్తింపు వచ్చింది. తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరసు, టిల్లు స్క్వేర్ తదితర చిత్రాలు చేసింది. కాకపోతే ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా) -
బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా?
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా టాక్. రష్మిక ఒకటి రెండుసార్లు పరోక్షంగా తన ప్రేమ గురించి బయటపెట్టింది గానీ విజయ్ పేరు మాత్రం చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు వీళ్ల గురించి ఈ డిస్కషన్ ఎందుకంటే దానికి ఓ కారణముంది.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు)రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. వరస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒమన్ దేశానికి వెళ్లింది. అక్కడే బీచ్ ఒడ్డున సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేసింది.కట్ చేస్తే విజయ్ దేవరకొండ.. బీచ్ ఒడ్డున తీసుకున్న కొన్ని ఫొటోల్ని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇవి చూసిన కొందరు నెటిజన్లు.. రష్మికతో కలిసి విజయ్ బర్త్ డే పార్టీలో పాల్గొనే ఉంటాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా ఎప్పుడూ పోస్ట్ పెడతారా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు వివాదాలు.. మరోవైపు వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
వారియర్ లుక్‌లో రష్మిక.. పాటతో అలరించిన విజయ్ దేవరకొండ!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.ఈ రోజు(ఏప్రిల్ 5)రష్మిక బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్"(The Girlfriend) సినిమా నుంచి విశెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రష్మిక వారియర్ లుక్ లో గన్, కత్తితో పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో వచ్చే పోయెమ్ ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు. 'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే - 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
విజయ్ దేవరకొండ సినిమాపై నాగవంశీ కామెంట్స్
-
ముంబై వీధుల్లో చక్కర్లు కొడ్తున్న విజయ్ & రష్మిక ..
-
అలాంటి ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం: విజయ్ దేవరకొండ
కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు.హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు. కానీ ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. స్టార్ గా ఎదిగిన తర్వాత నాలో కలిగిన ఫీలింగ్ ఒక రిలీఫ్ లాంటిది. (చదవండి: లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్)మనం సాధించాల్సింది సాధించిన తర్వాత దక్కే సంతృప్తి అది. ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచం చాలా చిన్నదైంది. మనం K డ్రామాస్ చూస్తున్నాం, కొరియన్ బీటీఎస్ ను ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు సౌత్ సినిమాను నార్త్ ప్రేక్షకులు అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది.రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు. ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్"(Kingdom Movie) టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు. -
రౌడీతో జోడీ?
‘రౌడీ జనార్థన’తో జోడీ కట్టనున్నారట కీర్తీ సురేష్. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన’ అనే మూవీ తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మేలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించారట. కథ నచ్చడంతో కీర్తీ సురేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి... విజయ్ దేవరకొండ–కీర్తీ సురేష్‌ల జోడీ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
నాని వర్సెస్ విజయ్.. రౌడీ ఫేట్ మారేనా..!
-
ఒకటికి రెండు
తెలుగు సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప’ వంటి చిత్రాల విజయాలు అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలన్నింటిలోని కామన్ పాయింట్ ఏంటంటే... ఈ సినిమా కథలన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి.అందుకే ఒకటి కాదు... రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఒకటికి రెండు ట్రెండ్ టాలీవుడ్లో ఊపందుకుంది. భారీ కథలు ఎంపిక చేసుకుని, ఆ కథను పలు భాగాలుగా ఆడియన్స్‌కు చూపిస్తున్నారు మేకర్స్. ఈ కోవలో పెద్ద కథలతో రానున్న కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.ఉగాదికి రిలీజ్ హీరో మహేశ్‌బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ చిత్రీకరణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఇటీవలే ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. నెక్ట్స్ షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు.కాగా దక్షిణాఫ్రికా, కెన్యా దేశాల్లో ఈ మూవీ చిత్రీకరణ జరగనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2026 చివర్లో లేదా 2027 ఉగాది సమయంలో ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సినిమా ‘బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్’ అంటూ రెండు భాగాలుగా వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైతే, మహేశ్‌బాబు కెరీర్లో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే అవుతుంది.ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా చేసే సినిమాలు భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ సినిమా బ్లాక్‌బస్టర్ సాధించడంతో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ, సలార్’ చిత్రాలు ఫ్రాంచైజీలుగా రానున్నాయి. ఈ రెండు సినిమాల తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.మలి భాగాల చిత్రీకరణకు ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘రాజా సాబ్’ కథ కూడా పెద్దదే. ఈ హారర్ కామెడీ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మూడేళ్లుగా కొనసాగుతోంది. మూడు తరాలు, ఆ తరాలకు చెందిన ఆత్మలు, హారర్ ఎలిమెంట్స్ వంటి అంశాలతో ‘రాజా సాబ్’ మూవీ రెండు భాగాలుగా రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు.ఇప్పటికే ‘రాజా సాబ్’ సినిమా నుంచి ప్రభాస్‌కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొంత టాకీ పార్టు, సాంగ్స్ షూట్, వీఎఫ్ఎక్స్... వంటివి పెండింగ్ ఉండటంతో ‘రాజా సాబ్’ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని సమాచారం. వీరమల్లు పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మే 9న విడుదల కానుంది. 17వ శతాబ్దంలో జరిగే ఈ కథలో పవన్ కల్యాణ్ కథ రీత్యా ఓ దొంగ తరహా పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఈ మూవీలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, బాబీ డియోల్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులూ మొదలయ్యాయి. ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారట విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నామని ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలి భాగం మే 30న రిలీజ్ కానుంది. ఈ పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.కోహినూర్ వజ్రం కోసం...‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న హిస్టారికల్ ఫిల్మ్ ‘కోహినూర్’. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనేది క్యాప్షన్. గత ఏడాది దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించనున్నారని, 2026 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని కూడా అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది.‘భద్రకాళి దేవత మహిమగల వజ్రం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి వెళ్లింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాలకు తీసుకు రావడానికి ఓ యువకుడు సాగించే, చారిత్రాత్మక ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుంది’’ అని ఈ మూవీ గురించి మేకర్స్ పేర్కొన్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ కాంబినేషన్లో ‘క్షణం, కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా ‘కోహినూర్’ తెరకెక్కనుంది.ఏటిగట్టు కథలు హీరో సాయిదుర్గా తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్ ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీని దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం విదేశాల్లో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు సాయిదుర్గా తేజ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సంజయ్ దత్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. కాగా ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.స్వయంభూ నిఖిల్ నటిస్తున్న హిస్టారికల్ అండ్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలిసింది. కాగా ఈ మూవీ చిత్రీకరణ 95 శాతం పూర్తయినట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిఖిల్.‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. మిరాయ్ సాహసాలు ‘హను–మాన్’తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు హీరో తేజ సజ్జా. ఆ మూవీ తర్వాత తేజ సజ్జా చేస్తున్న మరో మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సాహసాలు, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా ఉంటాయట. కాగా ‘మిరాయ్’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఈ ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. సో... ఆ రోజున ‘మిరాయ్’ సినిమా తొలి భాగం విడుదల కావొచ్చని ఊహించవచ్చు. ఇలా రెండు భాగాలుగా విడుదల కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
రెండు భాగాలుగా కింగ్డమ్
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ తర్వాత మే 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ని తొలుత రెండు భాగాలుగా రూపొందించాలనుకోలేదు. అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.రెండో భాగం కోసమని మొదటి పార్ట్ కథను పెంచలేదు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’.. ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా ఇప్పటివరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్. -
విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటిపై కేసు నమోదు
-
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కలకలం
-
బెట్టింగ్ యాప్స్ కేసు.. స్పందించిన విజయ్ దేవరకొండ టీమ్!
బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు కూడా నమోదైన సంగతి తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై ఆయనర్ టీమ్ స్పందించింది. బెట్టింగ్ యాప్స్ (Betting App Case)కి విజయ్ దేవరకొండ ప్రచారం చేయలేదని.. స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది. విజయ్ ప్రచారం చేసిన కంపెనీలు అన్ని చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని , ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని పీఆర్ టీమ్ తెలియజేసింది.విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు’అని ఆయన పీఆర్ టీమ్ పేర్కొంది. -
బెట్టింగ్ యాప్స్ కేసు: విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు. -
నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వార్‌పై నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో హీరో అభిమానుల మధ్య యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. టీజర్, ట్రైలర్ మొదలు సినిమా రిలీజ్ వరకు ప్రతీది పోల్చుతూ హీరో ఫ్యాన్స్ ఏదో రకంగా గొడవ పడుతూనే ఉంటారు. అయితే హీరోలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కలిసి మెలిసే ఉంటారు. అయితే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఇటీవల సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయింది.నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజాగా దీనిపై ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) స్పందించారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నాని(nani), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ ఈ నెల 21న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పదేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సోషల్ మీడియాలో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా చేయగలరా?’ అని ఓ విలేకరి అడగ్గా నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్ వార్ గురించి తెలియదు కానీ, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయంలో విజయ్‌కు నాని సపోర్ట్‌గా నిలిచేవాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు’ అన్నారు. అలాగే నాని, విజయ్‌తో కలిసి మళ్లీ ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో సినిమా చేయలేం. నా నాలుగో సినిమాని మళ్లీ ఇలాంటి నేపథ్యంతో తీస్తే.. అది ఇంత బాగా రాకపోవచ్చు. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. ఇంత నేచురల్‌గా తీయడం సాధ్యంకాకపోవచ్చు’ అన్నారు. ఎవడే సుబ్రమణ్యంలోని నాని పాత్రను ఇప్పుడున్న యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి చేయగలడని, విజయ్ పాత్రను పోషించాలంటే కొత్త హీరో కావాల్సిందేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. నాని - విజయ్ కి మొదట్లో చాలా సపోర్టివ్ ఉండేవాడు..వివాదాలపై స్పందించిన నాగ్ అశ్విన్ : #NagAshwin@NameisNani @TheDeverakonda #Nani #VijayDevaraKonda pic.twitter.com/CqCUlBPh0x— The Cult Cinema (@cultcinemafeed) March 18, 2025 -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'.. అనిరుధ్ అదరగొట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల ఫిబ్రవరిలో సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇచ్చారు. కింగ్డమ్ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను తాజాగా విడుదల చేశారు. నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ సాండ్ ట్రాక్ అద్భుతందా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు.. ఫ్యాన్స్ మాత్రం!?
తెలుగు హీరోల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో బయటకు తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. గతంలో మహేశ్- పవన్ (Pawan Kalyan) అభిమానుల మధ్య ఇలాంటి హంగామా ఎక్కువగా నడిచేది. కానీ ప్రస్తుతం నాని- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది.(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)కొత్త మూవీ పోస్టర్ వచ్చినప్పుడో.. టీజర్ లేదా ట్రైలర్ రిలీజైనప్పుడో.. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లైక్స్, మిలియన్ వ్యూస్.. మా హీరోకి ఎక్కువచ్చాయంటే మా హీరోకి ఎక్కువొచ్చాయని విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ సదరు హీరోలు మాత్రం ఇలాంటివేం పట్టించుకోరేమో అనిపిస్తుంది.ఎందుకంటే విజయ్ దేవరకొండ-నాని (Nani) కలిసి నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం'.. మార్చి 21న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీమ్ అంతా మరోసారి కలిశారు. అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుని పార్టీ చేసుకున్నారు. ఇందులో నానిని హగ్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తనెంటో ఎంత ఇష్టమో కూడా చెప్పాడు. ఇవన్నీ చూసైనా సరే అభిమానుల్లో మార్పు వస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?)Caught up with my favourite people to celebrate a special film. #YevadeSubramanyam ♥️@TheDeverakonda @nagashwin7 @SwapnaDuttCh #PriyankaDutt #MalvikaNair @riturv @radhanmusic @VyjayanthiFilms @SwapnaCinema March 21st- inkokkasaari :) pic.twitter.com/KpNAHHT6oI— Nani (@NameisNani) March 16, 2025 -
దిల్ రాజు అండతో రెచ్చిపోనున్న రౌడీ..!
-
విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్.. లీక్ చేసిన దిల్ రాజు!
దిల్ రాజు(Dil Raju) నిర్మాణ సంస్థలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా బాగుందని టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘రాజావారు రాణివారు’ఫేం రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పనులు సైలెంట్‌గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారట. కానీ ఈ లోపే దిల్ రాజు సినిమా టైటిల్‌ని ప్రకటించి మేకర్స్‌కి షాకిచ్చాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్డేట్స్ గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్ధన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్‌ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్ రాజుతో పాటు మిగతావాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. ఈ చిత్రంతో పాటు ‘బలగం’ వేణు దర్శకత్వంలో కూడా దిల్‌రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ని ఖరారు చేవారు. -
నాని వర్సెస్ విజయ్ మార్చిలో మాస్ జాతర
-
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్‌బాస్ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్‌బాస్ షోకి మరింత ప్లస్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్!బిగ్‌బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్‌గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్‌ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్‌లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్‌ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్తట్రెండ్బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్‌లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కచ్చితంగా హోస్‌లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్కి బ్రేక్ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్‌లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రాఫర్ కూడా ఈ సారి హౌస్‌లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్‌ని ప్లాన్ చేస్తున్నారు. -
కుంభమేళాకు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్
-
కాశీనాథుని ఆలయంలో విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ సతీమణి కూడా!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్డమ్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్‌ను అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
వైజాగ్‌లో కింగ్డమ్
వైజాగ్ వెళ్లారట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ చిత్రీకరణ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం విజయ్ దేవరకొండ వైజాగ్ వెళ్లారని తెలిసింది.దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్‌లో ‘కింగ్డమ్’ చిత్రీకరణ జరుగుతుందని, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరణ జరిగేలా ఈ చిత్రదర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేశారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, రెండు రకాల టైమ్‌లైన్స్‌తో కథ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాను మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రమే కాకుండా దర్శకులు రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలాలతో విజయ్ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. -
ఇయర్ ఎండ్ కు గీతగోవిందం మ్యారేజ్?
-
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. యూట్యూబ్‌లో 10 మిలియన్స్ వ్యూస్‌తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
'విజయ్ దేవరకొండ కింగ్డమ్ టీజర్'.. రష్మిక పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను అందించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ రౌడీ హీరో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కింగ్డమ్ టీజర్ పోస్టర్‌ను పంచుకుంది. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్‌థింగ్ మెంటల్.. విజయ్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్..టాలీవుడ్లో ఈ జంటపై కొన్నేళ్లుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో చాలాసార్లు వీరిద్దరు పెట్టిన పోస్టులతో ఫ్యాన్స్‌కు దొరికిపోయారు. గతేడాది దీపావళికి సైతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకుంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరోసారి ఈ జంటపై రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా కింగ్డమ్ టీజర్‌ను రష్మిక షేర్ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. కాగా.. వీరిద్దరు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది రష్మిక. ఈ బాలీవుడ్ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. -
విజయ్ దేవరకొండ 'వీడీ12'.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఈ సినిమాకు కింగ్డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్‌కు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్‌తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్‌తో టీజర్‌ను విడుదల చేయడం విశేషం.తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్‌తో కింగ్డమ్పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
జూనియర్ ఎన్టీఆర్‌తో విజయ్ దేవరకొండ.. మొత్తానికి లుక్ రివీల్ చేశాడుగా!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్, టీజర్ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చారు. ఈనెల 12న టీజర్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఒక రోజంతా జీవితం, సమయాలు, సినిమా గురించి మీతో నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా అనిపించింది.. టీజర్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు మీరు కూడా నాలాగే ఎగ్జైట్ అయ్యారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక రోజంతా సమయమిచ్చినందుకు థ్యాంక్ యూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్‌కు ధన్వవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.టీజర్‌కు ఎన్టీఆర్ డబ్బింగ్..అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం వీడీ12కు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. బుధవారం రిలీజ్ చేయనున్న టీజర్‌కు ఎన్టీఆర్ తన వాయిస్‌ను అందించారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మాకు అవసరమైన సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్న.. మీ వాయిస్‌తో వీడీ12 టీజర్ భావోద్వేగాలను మరోస్థాయికి తీసుకెళ్తుందని నాగవంశీ ట్వీట్ చేశారు.అయితే ఈ పోస్ట్‌లో విజయ్ దేవరకొండ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ మొహం కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భంగా తన వీడీ12 లుక్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. ఫుల్ గడ్డంతో మాస్ హీరోగా దర్శనమిచ్చారు రౌడీ హీరో. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Spent most of yesterday with him. Chatting about life, times, cinema. Laughing about the same.. Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life. Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025 -
మహాకుంభమేళాలో విజయ్.. గెటప్ కనిపించొద్దని...!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళా (Maha Kumbh 2025)కు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతీలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. ముఖానికి మాస్కుతో..అక్కడికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్కుతో కవర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం.. ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది.సినిమావిజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో అతిథి పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 12వ సినిమా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు భోగట్టా! ఈ మూవీ తర్వాత విజయ్.. రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించనున్నాడు.చదవండి: పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి -
విమానం ఆలస్యం..హీరో విజయ్ దేవరకొండ సహా పలువురి ఎదురుచూపులు
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం(ఫిబ్రవరి7) ఉదయం 9 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరలేదు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే టేకాఫ్ కాలేదని స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానంలో వెళ్లాల్సిన వారంతా ఉదయం నుంచి విమానాశ్రయంలోనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.విమానంలో ప్రముఖ టాలీవుడ్ హీరో విజయదేవరకొండతో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ఎప్పుడు వెళుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారంతా స్పైస్‌జెట్ విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేలు పెట్టి టికెట్ కొన్నా తమకు ఈ ఇబ్బందులేంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది కుంభమేళాకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు శంషాబాద్ నుంచి విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నారు. -
లైగర్ లో నటించడం నాకు ఇష్టం లేదు
-
'మీ తిట్లు విన్నాక ఆ పని పూర్తి చేశా..' ఇంతకీ టైటిల్ అదేనా?
ఏదైనా సినిమా ప్రకటిస్తే చాలు దాని టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు? ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అభిమానులు. చిత్రయూనిట్ చెప్పేవరకు ఆగట్లేదు. టాప్ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)ని కూడా ఇలాగే విసిగిస్తున్నారట. విజయ్ దేవరకొండ 12వ సినిమా (#VD12) టైటిల్ చెప్తావా? లేదా? అని ఏకంగా బండబూతులు తిడుతున్నారట.తిట్టు భరించాక..ఈ విషయాన్ని నాగవంశీ సోషల్ మీడియాలో వెల్లడించాడు. మీ అందరి తిట్లు భరించాక.. నేను దర్శకుడు గౌతమ్‌ను చాలా హింస పెట్టాక ఎట్టకేలకు ఓ టైటిల్ ఫిక్స్ చేశాం. అదేంటో అతి త్వరలోనే ప్రకటిస్తాం అన్నాడు. అప్పటివరకు ఎదురుచూస్తూ ఉండండి అన్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ సామ్రాజ్యం అయి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!పోలీసాఫీసర్‌గా విజయ్?విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. కల్కి 2898 ఏడీలో ముఖ్య పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది విజయ్ కెరీర్లో 12వ సినిమా. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా విడుదల ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది.#VD13 సినిమామరోవైపు విజయ్ తన పదమూడో సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో విజయ్ పల్లెటూరి మాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారుపీరియాడిక్ మూవీలో విజయ్విజయ్ తన పద్నాలుగో సినిమాను శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో చేస్తున్నాడు. బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.చదవండి: వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? -
బ్రిటీష్ పాలన నేపథ్యంతో...
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. కాగా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా సెట్ వర్క్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘‘బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రం ‘వీడీ 14’. ఇప్పటి వరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఒక పవర్ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.త్వరలోనే షూటింగ్ప్రారంభిస్తాం’’ అని రాహుల్ సంకృత్యాన్ పేర్కొన్నారు. ‘‘19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
యంగ్ హీరోస్.. స్టార్ టైటిల్స్
-
డేట్ మారిందా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ డేట్‌కి రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో విజయ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకులు రాహుల్ సంకృత్యాన్ , రవికిరణ్ కోలా సినిమాల్లో విజయ్ దేవర కొండ నటించనున్నారు. -
కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్లానింగ్ మార్చిన రౌడీ స్టార్
-
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి రూమర్స్ నిజమేనా..!
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ దీనిపై స్పందించకుండా కామ్‌గా ఉంటున్నారు. సమయం వచ్చినప్పడు తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని విజయ్ అంటున్నాడు. (చదవండి: యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి పోతారంటూ సెటైర్.. నాగవంశీ రిప్లై ఇదే!)ఇక రష్మిక అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచననే లేదని చెబుతోంది. కానీ వీరిద్దరు వెకెషన్ ట్రిప్ వెళ్లడం..అక్కడ కెమెరాకు చిక్కడం..ఆ ఫోటోలు వైరల్ అవడం జరుగుతూనే ఉంది. అయితే అఫిషియల్‌గా మాత్రం ఎక్కడా బయటపెట్టట్లేదు. తాజాగా యంగ్ ప్రొడ్యుసర్ నాగవంశీ రష్మిక ప్రేమాయణం గురించి స్పందించాడు. (చదవండి: దర్శకుడి చేతిలో ‘ప్రేమలు’ బ్యూటీ చెంప దెబ్బలు.. నిజమెంత?)రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసని చెప్పాడు. ప్రస్తుతం రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ లో నాగ వంశీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నువ్వు చెప్పకపోయినా ఆ తెలుగు హీరో మాకు తెలుసు’, ‘రష్మిక లవ్ చేస్తున్నది విజయ్ దేవరకొండనే’, ‘ఈ ఏడాదిలో రష్మిక- విజయ్‌ల పెళ్లి జరగాలి కోరుకుంటున్నాను’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
ప్రేమ,పెళ్లిపై రష్మిక అలా.. విజయ్ ఇలా
సినీ నటుల వ్యక్తిగత జీవితాలపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి విషయంలో రకరకాలు పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి గాసిప్లను కొంతమంది సీరియస్‌గా తీసుకొని ఖండిస్తుంటారు. మరికొంతమంది అయితే పెద్దగా పట్టించుకోరు. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి కామన్లే అనుకొని వదిలేస్తుంటారు. విజయ్ దేవరకొండ ఆ కోవలోకి చెందిన హీరో అనే చెప్పాలి. ఆయన ప్రేమ, పెళ్లిపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తునే ఉన్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ మాత్రం ఈ రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోకుండా..తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. గతంలో ఒకసారి తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ తర్వాత చాలా గాసిప్స్ వచ్చిన స్పందించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా తన రిలేషన్షిప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాతో విజయ్ మాట్లాడుతూ..సమయం వచ్చినప్పుడు తానే తన రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. ‘నా రిలేషన్షిప్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని నాకు అనిపించినప్పుడు నేనే ఆ విషయాన్ని బయట పెడతా. దానికంటూ ఓ సమయం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు నేనే సంతోషంగా ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాను. నా డేటింగ్ విషయంపై వస్తున్న రూమర్స్‌ని నేను పెద్దగా పట్టించుకోను. పబ్లిక్ ఫిగర్‌గా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. అది కూడా నా వృత్తిలో భాగంగానే భావిస్తాను. ఆ రూమర్స్ నాపై ఎలాంటి ఒత్తిడిని కలిగించవు. వార్తలను వార్తగానే చూస్తా’ అని విజయ్ అన్నారు. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘అపరిమితమైన ప్రేమ ఉంటే..దానికి తోడుగా బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.ఇక మరో ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్నా తన ప్రేమ, రిలేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. ‘లైఫ్ పార్ట్నర్ అనేవాడు అన్ని వేళలా నాకు తోడుగా నిలవాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి’ అని చెప్పింది. ఇక ప్రేమ గురించి మాట్లాడుతూ.. సా దృష్టింలో ప్రేమలో ఉన్నారంటే.. వాళ్లు తమ భాగస్వామితో కలిసి ఉన్నట్లే. జీవితంలో ప్రతి ఒక్కరికి తోడు కావాలి. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనమే ఉండదు’ అని రష్మిక అన్నారు. -
అల్లు అర్జున్ ను కలిసిన విజయ్ దేవరకొండ
-
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రాబోయే మార్చిలో రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ఇతడి తండ్రి స్వయంగా మాట్లాడటినట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ టాపిక్ అసలు ఎందుకొచ్చింది?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామంది రష్మిక అని అంటారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఓ టూర్‌కి కలిసి వెళ్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎంత చర్చ నడిచినా కిక్కురుమనరు.తాజాగా విజయ్ తండ్రి గోవర్దన్ని కొడుకు పెళ్లి గురించి అడిగితే.. విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడని, గౌతమ్ సినిమా జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రీ మూవీస్ నిర్మాణంలో సినిమా ఉంటుందని, అనంతరం కొన్నాళ్లకు దిల్ రాజు నిర్మాతగా కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందని చెప్పారు. అందుకే కాస్త వీలు చూసుకుని, విజయ్‌కి టైమ్ కుదిరినప్పుడే పెళ్లి ఆలోచన చేస్తామని అన్నారు. దీనికి మరో ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చని చెప్పారు. అంటే ఇప్పట్లో విజయ్ పెళ్లి లేనట్లే!(ఇదీ చదవండి: నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్) -
దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక
హీరోయిన్ రష్మిక.. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనే రూమర్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని అనడానికి ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయం కనిపిస్తూనే ఉంటుంది. విజయ్-రష్మిక అప్పుడప్పుడు కలిసి టూర్స్‌కి వెళ్తుంటారు. కానీ ఎవరికి వాళ్లు ఒంటరిగా దిగిన పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. వాటిని కలిపి చూస్తే జంటగా వెళ్లారని నెటిజన్లు పట్టేస్తారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)కొన్నాళ్ల క్రితం చెన్నైలో జరిగిన 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెళ్లి, ప్రియుడి గురించి టాపిక్ రాగానే రష్మిక తెగ సిగ్గుపడిపోయింది. నేను చేసుకోబోయేది ఎవరో మీకు కూడా తెలుసుగా! అని సమాధానమిచ్చింది. అంటే విజయ్ దేవరకొండ అని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసింది.బుధవారం రాత్రి మూవీ టీమ్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్లో సినిమా చూసిన రష్మిక.. గురువారం సాయంత్రం ఏఎంబీలో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి సినిమా చూసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు విజయ్ కుటుంబాన్ని కలిసినప్పటికీ ఎప్పుడు ఇలా బయటపడలేదు. కానీ ఇప్పుడు సినిమాని కలిసి చూడటం లాంటివి చూస్తుంటే త్వరలో విజయ్-రష్మిక గుడ్ న్యూస్ చెప్పేస్తారేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు) -
లవ్ లో ఉన్న మాట నిజమే.. ఓపనైపోయిన రౌడీస్టార్.. విజయ్
-
అల్లు అర్జున్‌కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్ 'పుష్ప 2' మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి కాగా.. చివరి దశ ప్రమోషన్లలో టీమ్ అంతా ఫుల్ హడావుడిగా ఉంది. ఇలాంటి టైంలో బన్నీకి ఎప్పటిలానే క్యూట్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గతంలో పుష్ప తొలి భాగం రిలీజ్ టైంలో ఇచ్చినట్లే ఇప్పుడు మళ్లీ సీన్ రిపీట్ చేశాడు.(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?)తన సొంత 'రౌడీ' బ్రాండ్ కలెక్షన్స్ నుంచి అల్లు అర్జున్‌కి ఇప్పటికే పలుమార్లు విజయ్ దేవరకొండ డ్రస్సులు ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ కోసం మరో బహుమతి పంపాడు. 'పుష్ప' పేరుతో ఉన్న టీ షర్ట్‌లను ఇచ్చాడు. దీంతో వాటిని ఫొటో తీసిన అల్లు అర్జున్.. తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. 'నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు థ్యాంక్యూ' అని బన్నీ రాసుకొచ్చాడు. 'లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి' అని విజయ్ రిప్లై ఇచ్చాడు.డిసెంబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'పుష్ప 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. రూ.1000 కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ అనే టాక్ నడుస్తోంది. ఇందుకు తగ్గట్లే పాట్నా, చెన్నై, కోచిలో భారీ స్థాయిలో ఈవెంట్స్ పెట్టారు. ముంబైలో శుక్రవారం ప్రెస్‌మీట్ జరగనుంది. డిసెంబరు 1న బెంగళూరులో ఈవెంట్ ఉంది. మరి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఉందా లేదా అనేది ప్రస్తుతానికి సందేహంగా ఉంది.(ఇదీ చదవండి: 'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్) -
ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక
రష్మిక పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజమని వీళ్ళిద్దరూ చెప్పరు. కానీ ఎప్పటికప్పుడు కలిసి ఎక్కడో ఓ చోటకు వెళ్తారు. ఎవరో వీళ్లిద్దరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో కొన్నిరోజుల పాటు ఈ టాపిక్ నెటిజన్ల మధ్య డిస్కషన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎందుకు అనుకుందో ఏమో గానీ రష్మక.. తన ప్రేమ విషయంలో సగం ఓపెన్ అయిపోయింది.'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చెన్నైలో ఆదివారం జరిగింది. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో రష్మి పెళ్లి టాపిక్ వచ్చింది. 'మీరు చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తినా? లేదంటే బయటి వ్యక్తినా?' అని యాంకర్ అడగ్గా.. ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని రష్మి నవ్వుతూ చెప్పింది. దీనికి శ్రీలీల చప్పట్లు కొడుతూ తనకు తెలుసు అన్నట్లు తెగ సంబరపడిపోయింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు)మరి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరే ప్రపోజ్ చేస్తారా? అని యాంకర్ మరోసారి అడగ్గా.. అస్సలు వెయిట్ చేయను, నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తాను అని రష్మిక చెప్పింది. ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని అందరికీ తెలుసు. అయితే నేరుగా ఇతడి పేరు చెప్పగానే.. తాము ప్రేమలో ఉన్నది నిజమే అని హింట్ ఇచ్చేసింది. దీంతో అటు రౌడీ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.రష్మిక-విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నట్లు పబ్లిక్‌గా క్లారిటీ వచ్చేసింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారో చూడాలి? రష్మిక సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. 'ఛావా' అనే హిందీ మూవీ డిసెంబరు చివర్లో విడుదల కానుంది. 'సికిందర్' మూవీలో సల్మాన్‌కు జోడిగా నటిస్తుంది. వీటితో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.(ఇదీ చదవండి: స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!)Do you propose or wait for the proposal?Would you marry someone from the film industry or not“Everyone knows about it."- #RashmikaMandanna at #PushpaWildfireevent pic.twitter.com/x7dxjyM4gb— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 24, 2024 -
మరోసారి విజయ్ దేవరకొండతో కనిపించిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే పలు ఫోటోలతో చాలా వార్తలు వచ్చాయి. పులు సినిమాల్లో జోడీగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వారిద్దరూ నిజ జీవితంలో కూడా ఒకరికొకరు అంతే దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఒకే స్పాట్లో ఉన్న ఫోటోలు చాలానే వచ్చాయి. అయితే, తాజాగా వారిద్దరూ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటూ కనిపించారు. ఎవరో వారి పోటోను సీక్రెట్‌గా తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. కానీ, ఈ ఫోటో ఎప్పుడు తీశారు..? ఎక్కడ తీశారు వంటి వివరాలు మాత్రం తెలపలేదు.గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో మెప్పించిన ఈ జోడీ.. వారిపై వస్తున్న రూమర్స్ గురించి ఇప్పటికే స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చింది. మొదట వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పరోక్షంగా రివీల్ చేయడంతో అప్పటి నుంచి ఈ రూమర్స్ ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల క్రితం విజయ్ ఓ వేదికపై మాట్లాడుతూ తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు నటించిన వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు కూడా తెలిపారు. విజయ్ వ్యాఖ్యలు వైరల్ అయిన కొద్దిరోజులకే ఈ ఫోటో బయటకు రావడంతో వారిద్దరి ప్రేమ నిజమేనేమో అనే సందేహాలు వస్తున్నాయి. -
35 ఏళ్లు వచ్చాయి.. ఇంకా సింగిల్‌గా ఉంటానా?: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ తన రిలేషన్షిప్ స్టేటస్ బయటపెట్టాడు. తాను సింగిల్ కాదని ఒప్పేసుకున్నాడు. విజయ్ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు.ప్రేమ గురించి తెలుసుప్రేమ విషయానికి వస్తే.. ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో తెలుసు.. ఒకర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. షరతుల్లేని ప్రేమ గురించి నాకు తెలియదు. నా ప్రేమ మాత్రం అంచనాలతోనే ఉంటుంది. నాది అన్‌కండిషనల్ లవ్ కాదు అని తెలిపాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అతడు రష్మిక కోసమే చెప్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మికతో లవ్!కాగా విజయ్-రష్మిక చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ అది బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే పండగలు, వెకేషన్స్ అప్పుడు మాత్రం ఒకే చోట ఫోటోలు దిగి వాటిని నెట్టింట్లో వదిలి తాము కలిసే ఉన్నట్లు హింట్లిస్తుంటారు.చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్లానింగ్ మార్చిన విజయ్
-
ఒకే ఫ్రేమ్ లో రౌడీ, రెబల్, యానిమల్.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..!
-
విజయ్ దేవరకొండ 'సాహిబా'ను మీరూ చూసేయండి
టాలీవుడ్ రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విజయ్ దేవరకొండ నటించిన మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి సాంగ్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 'సాహిబా' అనే పాట కోసం రాధిక మదన్‌తో కలిసి విజయ్ కనిపించారు. బాలీవుడ్లో సత్తా చాటుతున్న సింగర్ జస్లిన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేశారు.మ్యూజిక్ ఆల్బమ్స్ కోసం విజయ్ దేవరకొండ గతంలో కూడా పనిచేశారు. సుమారు ఆరేళ్ల క్రితం 'నీ వెనకాలే నడిచి' అనే సాంగ్ కోసం ఆయన వర్క్ చేశారు. 2018లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్ కూడా అప్పట్లో ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు 'సాహిబా' కోసం సింగర్ జస్లిన్ రాయల్ ఫిదా చేశారు. 'హీరియే' పాటతో జస్లిన్ రాయల్ కూడా గతంలో భారీగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. -
ఆకాశంలో విహరిస్తూ ఫుడ్ ఆరగించిన టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వీడీ12 మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కేరళలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఓ ఆల్బమ్ సాంగ్‌లో వీడీ కనిపించనున్నారు. సాహిబా అనే సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్ జస్లిన్ రాయల్‌తో కలిసి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల ముంబయిలో ప్రకటించారు. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ రావడంతో విజయ్ చిల్ అవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!)అయితే తాజాగా ఆయన తన ఫెవరేట్ ఫుడ్ కేఎఫ్‌సీ చికెన్ తింటూ గాల్లో ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణిస్తూ గాల్లోనే ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆకాశంలో విహరిస్తూ తనకు ఇష్టమైన కేఎఫ్‌సీ ఫుడ్ తింటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్‌లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్‌తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్‌ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తన కెరీర్లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్‌కు ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్‌పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'పెళ్లి చూపులు' కోసం ప్లాన్ చేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'పెళ్లి చూపులు'. 2016లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలైన 'పెళ్లి చూపులు' అమెరికాలో పది సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శితమై చరిత్ర సృష్టించింది. రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుని తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి చూపులు చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈమేరకు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.ప్రస్తుత సమయంలో విజయ్‌కు ఒక భారీ హిట్ తప్పనిసరి.. ఈ క్రమంలో తనకు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమా చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలాంటి టైమ్‌లోనే విజయ్‌కి ఒక చక్కటి కథను తరుణ్‌భాస్కర్ వినిపించారట. అందుకు ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఒక యాక్షన్ సినిమాను తీసేందకు ఆయన రెడీ అవుతున్నారట. వీరిద్దరి సినిమా కోసం బడ్జెట్ ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారని టాక్. అయితే, ఫైనల్‌గా విజయ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పెళ్లి చూపులు సినిమా తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో రెండు జాతీయ అవార్డ్స్ దక్కించుకుంది. రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్‌తో పాటు, రెండు నందులను కూడా ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం హిందీ,తమిళ్, మలయాళంలో రీమేక్ అయింది.