'ఇరు ముగన్' ఫస్ట్ లుక్తో విక్రం సెన్సేషన్ | Iru mugan First Look Poster has been released | Sakshi
Sakshi News home page

'ఇరు ముగన్' ఫస్ట్ లుక్తో విక్రం సెన్సేషన్

Published Mon, Jan 11 2016 10:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

Iru mugan First Look Poster has been  released

విక్రం తాజా సినిమా 'ఇరు ముగన్' ఫస్ట్ లుక్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ తో అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. సగం యంత్రం, సగం మనిషిగా వినూత్న రూపురేఖలతో విక్రం ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేరీతిలో ఉన్న ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్  ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసింది.

ఆనంద్ శంకర్ రచన-దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రం సరసన నయనతార, నిత్య మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విక్రం ఎన్నో ఆశలు పెట్టుకొని నటిస్తున్న సినిమా 'ఇరుముగన్'. మరోసారి తన విలక్షణ పంథాతోనే అభిమానులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. తరచూ నిర్మాతలు మారడంతో ఆఖరికీ గత డిసెంబర్లో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ మొదలుపెట్టారు. 'ఇరుముగన్' పోస్టర్ విక్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకోంటుందని ఆన్లైన్లో దీనికి వెల్లువెత్తుతున్న స్పందన చాటుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement