Actress Malavika Mohanan First Look From Thangalaan Movie - Sakshi
Sakshi News home page

Guess The heroine: హాట్‌నెస్‌కి కేరాఫ్‌లా ఉండేది.. ఇప్పుడేమో ఇలా

Aug 4 2023 4:05 PM | Updated on Aug 4 2023 4:39 PM

Actress Malavika Mohanan First Look Thangalaan Movie - Sakshi

దాదాపు హీరోయిన్లు అందరూ వీలైనంత గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంటారు. కుదిరితే సినిమాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బ్యూటీస్ అందరూ ఫొటోషూట్స్‌తో మనల‍్ని ఎంటర్‌టైన్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఆ బాపతే. కాకపోతే ఆమె, ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. 

ఎ‍క్కువసేపు సస్పెన్స్ ఉంచకుండా చెప్పేస్తున్నాం. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈమె.. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తోంది. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా ఓ ఆరేళ్లపాటు మలయాళంలో మూడు, కన్నడ-హిందీలో తలో మూవీ చేసింది. 2019లో రజినీకాంత్ 'పెట్టా'లో నటించడం ఈమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!)

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన తర్వాత మాళవిక మోహనన్‌కు దళపతి విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' చిత్రాల్లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడినప్పటికీ ఈమెకు ఓ మాదిరి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె, ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చియాన్ విక్రమ్ 'తంగలాన్'‌లోనూ ఈమెనే కథానాయిక. ఈ చిత్రంలోని ఈమె ఫస్ట్‌లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.

ఈ ఫొటోలో మాళవికని చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ తాళ్ల లాంటివి ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించబోతుంది. నార్మల్‌గా హాట్‌ అండ్ గ్లామర్‌గా కనిపించే ఈ బ్యూటీని ఇలా మార్చేయడం చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా మాళవిక లేటెస్ట్ లుక్ మాత్రం క్రేజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement