
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
తాజాగా స్నీక్‌పీక్ పేరుతో ఓ 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌లో విజయ్ పబ్‌లో ఎంజాయ్ చేసే కుర్రాడిగా తరువాత ఓ రాజకీయనేతగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఈ నెల 6 సాయంత్రం 4 గంటలకు అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment