
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా భారీ హైప్ తో పాటు ఇతర భాషల్లోనూ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పరభాషా దర్శకులు కూడా విజయ్ దేవరకొండ హీరోగా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస‍్తున్నారు. ప్రస్తుతం పరుశురాం దర్శకత‍్వంలో ‘గీతాగోవిందం’ సినిమాతో పాటు షికారు, మహానటి సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు.
ఇవేకాకుండా మరో మూడు నాలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తాజాగా ఓ తమిళ దర్శకుడు విజయ్ హీరోగా సినిమా తెరకెక్కించేందుకు చర్చలు జరుపుతున్నాడట. విక‍్రమ్ హీరోగా ఇరుముగన్ (ఇంకొకడు) సినిమాను తెరకెక్కించిన ఆనంద్ శంకర్, విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ కు కథ కూడా వినిపించాడట. అయితే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తయితే గాని విజయ్ తమిళ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment