తెలుగులోనూ భారీగా..!
చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్, ప్రయోగాలను మాత్రం ఆపటం లేదు. ప్రస్తుతం ఇరుముగన్ పేరుతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామాలో హీరోగా విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తెలుగు మార్కెట్ను టార్గెట్ చేసిన విక్రమ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
తెలుగులో ఇంకొకడు పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో పలువురు తెలుగు తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆడియోను గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. నయనతార, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.