న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ శునకం 'కమాండర్' వైట్ హౌజ్‌లో సిబ్బందిని తరచూ కరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ అధికారిని కరిచి వార్తల్లోకెక్కింది. అయితే.. ఈ శునకాన్ని వైట్‌హౌజ్ నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని ప్రదేశానికి ఆ శునకాన్ని పంపించినట్లు వైట్‌హౌజ్ అధికారులు తెలిపారు.
2021లో కమాండర్‌ను బైడెన్ వైట్‌హౌజ్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి కనీసం 11 సార్లు అది సిబ్బందిని కరిచినట్లు వార్తలు వచ్చాయి. బైడెన్ వద్ద అంతకుముందు ఉన్న మేజర్ అనే శునకంపై కూడా ఇదే తరహా కేసులు నమోదు కావడంతో దాన్ని కూడా వైట్ హౌజ్ నుంచి బయటకు పంపించారు.
అయితే.. ప్రస్తుతం కమాండర్‌ను ఎక్కడికి పంపించారో వివరాలు మాత్రం బయటికి వెళ్లడించలేదు. కమాండర్ రక్షణలో ఎంతో శ్రద్ధ కనబరిచిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని జిల్ బైడెన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ ప్రశంసించారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
Comments
Please login to add a commentAdd a comment