బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్‌లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
కాగా,లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.
🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c
— Nanana365 (@nanana365media) September 24, 2024
చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్‌లో జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
Comments
Please login to add a commentAdd a comment