చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ జిల్లాలో సీఏఎఫ్ విభాగానికి చెందిన ఓ కమాండర్ మంగళవారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కరణ్‌పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19వ నంబర్ బెటాలియన్ కంపెనీ కమాండర్ సుబీర్‌సింగ్(43).. తన వద్ద ఉన్న ఇన్‌శాస్ రైఫిల్‌తో పొట్ట భాగంలో కాల్చుకున్నాడు. దీన్ని గమనించిన ఇతర జవాన్లు వచ్చి చూసేలోపే మృతి చెం దాడు. స్థానిక క్యాంపు అధికారుల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.
చదవండి:
కిరాతకం: అందరూ చూస్తుండగానే..
ఇద్దరు మహిళల పెళ్లి.. సైకోలుగా ప్రవర్తిస్తూ దారుణం
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కమాండర్ ఆత్మహత్య
Published Wed, Apr 14 2021 9:10 AM | Last Updated on Wed, Apr 14 2021 11:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment