అలలధాటికి ధ్వంసమై సముద్రంలో కొట్టుకుపోతున్న అభిలాష్ పడవ
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్‌లో దగ్గర్లోని ఇల్ ఆమ్‌స్టర్‌డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్‌ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment