17 ఏళ్లకు యువతి ఆచూకీ | Whereabouts Young woman of 17 years | Sakshi
Sakshi News home page

17 ఏళ్లకు యువతి ఆచూకీ

Published Thu, Jun 2 2016 3:26 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

17 ఏళ్లకు యువతి ఆచూకీ - Sakshi

17 ఏళ్లకు యువతి ఆచూకీ

సోమందేపల్లి:  17 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఓ యువతి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయింది. 1999లో సోమందేపల్లి నుంచి వెళ్ళిపోయిన ఆమెను తమిళనాడులోని హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆమె బాగోగులు చూస్తూ వచ్చింది.  ఆనారోగ్యంతో పాటు బుద్ది మాంద్యం కావడంతో ఆమె వివరాలు దాదాపు 17 ఏళ్ళుగా ఆ స్వచ్ఛంద సంస్థకు తెలియరాలేదు.

ప్రస్తుతం కోలుకోవడంతో తన పేరు రాధ (35) అని, తల్లిదండ్రులు వెంకటస్వామి, వెంకటమ్మలని, తమ స్వగ్రామం సోమందేపల్లి అని తెలపడంతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాహకులు సోమందేపల్లి పోలీసులకు బుధవారం రాత్రి సమాచారం అందజేశారు. ఆ యువతి కుటుంబీకుల ఆచూకీ తెలపాలని వారు కోరారు. దీంతో ఆమె ఫొటోలను ఎస్‌ఐ గౌస్ మహ్మద్ బాషా మీడియాకు అందజేశారు. ఈ యువతి ఆచూకీ తెలిసిన వారు సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement