చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి | If you know the whereabouts of the rani cittila tell | Sakshi
Sakshi News home page

చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి

Published Sun, Mar 23 2014 12:48 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి - Sakshi

చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి

  •      ప్రజలకు పోలీసుల వినతి
  •      4 బ్యాంక్ అకౌంట్లు, కారు సీజ్
  •  సాక్షి, సిటీబ్యూరో: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచి పారిపోయిన బత్తుల విజయరాణి ఆచూకీ తెలిస్తే నగర సీసీఎస్ పోలీసులకు తె లపాలని డీసీపీ జి.పాలరాజు, ఏసీపీ విజయ్‌కుమార్ ప్రజలను కోరారు.  విజయరాణిపై ఈనెల 13న చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు.  

    శ్రీనగర్‌కాలనీలోని ఆమె ఫ్లాట్‌ను శుక్రవారం సీజ్ చేసిన పోలీసులు... తాజాగా రూ.6 లక్షల విలువ చేసే ఆమె కారు (ఏపీ 09 సీఎస్ 4931)ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనగర్‌కాలనీలోని ఎస్‌బీఐ, ఆంద్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్, కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్న ఆమె నాలుగు అకౌంట్లను కూడా శనివారం సీజ్ చేయించారు.

    అందులో కేవలం రూ.300 కంటే ఎక్కువ లేవు. ఆ ఖాతాల్లోని డబ్బులను నిందితురాలు పథకం ప్రకారం ముందే డ్రా చేసుకొని పారిపోయింది.  విజయరాణి ఆచూకీ తెలిసివారు 9490616703,9490616291 సెల్‌నెంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement