Vijayarani
-
తల్లి కర్మకాండలకు వెళ్లొస్తూ..
చెన్నూరు: తల్లి కర్మకాండలకు వెళ్లి తిరిగి వస్తూ కొడుకు, అతని కుమారుడు, అత్త దుర్మరణం చెందగా, భార్య, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కడప–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెలంగాణ రాష్ట్రం ఖైరతాబాద్ ప్రాంతంలో నివాసం ఉండే కొండేటి కృష్ణ(48) తన తల్లి కర్మకాండల నిమిత్తం భార్య విజయరాణి, కుమార్తె నిహారిక, కుమారుడు రిషి(15), అత్త అన్నే పద్మావతితో కలిసి తిరుపతి వెళ్లారు. కర్మకాండల కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపానికి రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి వేగంగా వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ, పద్మావతి, రిషి అక్కడికక్కడే మృతి చెందగా, విజయరాణి, నిహారికలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సై రెండో ఇంటి ముందు భార్య ఆందోళన
నల్లకుంట(హైదరాబాద్): ఓ ఎస్సై తన భార్యపై వేధింపులకు గురి చేసిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేయడంతో పాటు, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవటం లేదంటూ ఎస్సై రెండో ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కొత్తగూడంకు చెందిన ఎన్.కరుణ కుమార్‌తో అదే జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నందిపాటి సాల్మన్, లలితల కుమార్తె విజయరాణితో 2011లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కరుణ కుమార్‌కు కట్నంగా రూ. 15 లక్షల నగదు, రూ. 3 లక్షల బంగారంతో పాటు రూ. 2 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఏడాదిన్నర పాటు వారి సంసారం సాఫీగానే సాగింది. కాగా, వారికి కూతురు అక్షయ(3) ఉంది. ఇదిలా ఉండగా, 2013 నుంచి కిమ్స్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తున్న అనూషతో కరుణ కుమార్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను కట్నం కోసం వేధించటంతోపాటు పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయమై 2014లో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా... ఎస్సైని విధుల్లోంచి సస్పెండ్ చేశారు. తిరిగి విధిల్లో చేరిన అతను ప్రస్తుతం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. అయినా వేధింపులు మానక పోవడంతో బాధితురాలు సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ లో మరోమారు ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. ఏడాది కాలంగా ఇంటికి సరిగా రాకుండా డీడీ కాలనీ జయరాజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న నర్స్ అనూష వద్దకు వెళుతున్నాడు. దీంతో బాధితురాలు కూతురు అక్షయను తీసుకుని, ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి బుధవారం ఉదయం కరుణ కుమార్, అనూష ఉంటున్న ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగి, భర్త తన వద్దకు వచ్చే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని విజయరాణి పేర్కొంది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని విజయరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తన ఇంటిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారంటూ అనూష.. విజయరాణిపై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. -
చిట్టీల రాణి, మరో ఏడుగురు అరెస్టు
హైదరాబాద్: చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా ముంచారనే కేసులో బుల్లితెర నటి బత్తుల విజయరాణితో పాటు మరో ఏడుగురిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీసీఎస్ అదనపు డీసీపీ (ఓఎస్డీ) ఇ.సుప్రజ, డీసీపీ పాలరాజు మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న విజయరాణి నాలుగేళ్ల నుంచి అనధికారికంగా రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకున్నా చిట్టీలు నిర్వహించేది. దీంతో నష్టాలు రావడంతో వాటిని భర్తీ చేసేందుకు అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంది. ఎక్కువ మొత్తం వడ్డీలు చెల్లించడానికే పోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో తమకు డబ్బులు చెల్లించాలని రుణదాతలు కొందరు బెదిరించడంతో గత నెల ఆమె కుటుంబసభ్యులతో కలసి బెంగళూరుకు పారిపోయింది. సుమారు 80 మంది బాధిత ఆర్టిస్టులు రూ. 10 కోట్ల వరకు మోసపోయామంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గత నెల 14న విజయరాణితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో విజయరాణి కొడుకు చరణ్, కోడలు రేవతి, చెల్లెలు సుధారాణి, ఆమె భర్త చైతన్య, స్నేహితులు హరిబాబు, కట్టా మల్లేష్ గౌడ్, న్యాయవాది శ్రీనివాస్ ఉన్నారు. వారందర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉందని, ఆమె 78 మందికి సుమారు రూ. 2.20 కోట్లు చెల్లించాల్సి ఉందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టులో ఉన్న ఆమె ఇల్లును జీపీఏ చేసుకున్న వారిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. నేనూ బాధితురాలినే: విజయరాణి ‘‘నేను ఎవర్నీ మోసం చేయలేదు. శక్తికి మించిన వడ్డీలు కట్టడానికి అప్పులపై అప్పు చేశాను. చివరికి నా కుటుంబానికి తినడానికి చిల్లిగవ్వ లేకుంటే పోలీసులే తిండి పెట్టారు. చిట్టీలు ఎత్తుకున్న వారు తిరిగి డబ్బు చెల్లించలేదు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని వడ్డీ వ్యాపారులు బెదిరించినందుకే పారిపోయాను. నేను కూడా బాధితురాలినే..’’ అంటూ విజయరాణి మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది -
మోసం చేయడం కాదు.. నేనే మోసపోయాను..
-
'చిట్టీల రాణి'... చిక్కిందిలా...
-
’చిట్టీ’లమ్మ చిక్కింది
-
'చిట్టీల రాణీ'.. చిట్టచివరికిలా దొరికింది !
-
పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి
హైదరాబాద్: టీవీ నటీనటులకు దాదాపు 10 కోట్ల రూపాయలకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను, ఆమె అనుచరులు పది మందిని సీసీఎస్ పోలీసులు బెంగళూరులో పట్టుకున్నారు. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. -
తెర వెనుక నేర వేషాలు
రూ.10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్ విజయరాణి హత్యాయత్నం కేసులో చిక్కిన సినీనటుడు రెహమాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో ఉదయ్ సాక్షి, సిటీబ్యూరో : తెరపై వివిధ క్యారెక్టర్లలో జీవిస్తున్న నటీనటులలో కొందరు తెరవెనుక మాత్రం నేర ‘వేషాలు’ వే స్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆర్టిస్టులు నేరాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. నేరబాట పట్టిన వారిలో ఒకరు టీవీ ఆర్టిస్టు విజయరాణి, మరొకరు సినీ ఆర్టిస్టు అబ్దుల్ రహమాన్, మూ డో వ్యక్తి వర్ధమాన నటుడు ఉదయ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో నేరానికి పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో... తాజాగా వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారాల్లో సినీనటులు పట్టుబడిన ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలోని కొందరు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు నెరపడం ఆందోళన కలిగిస్తోంది. హత్యాయత్నం కేసులో.... రక్తచరిత్ర సినిమాలో విలన్‌గా నటించిన అబ్దుల్ రెహమాన్ వారం క్రితం పట్టపగలు అందరిముందు ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పరారీలో ఉన్న రెహమాన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వి.సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న రెహమాన్ ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి మరిది, చింతల్‌బస్తీకి చెందిన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులతో కలిసి పక్షం రోజుల క్రితం రెహమాన్‌పై దాడి చేశాడు. దీంతో ఫయాజ్‌పై కక్ష పెంచుకున్న రెహమాన్ ఈనెల 18న చాచానెహ్రూపార్క్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. సకాలంలో ఫయాజ్ను ఆసుపత్రికి తరలించడంతో బతికిబట్టకట్టాడు. నగలు కూడా... చిట్టీల రాణి ఉదంతంలో సోమవారం మరికొందరు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి తమ గోడు చె ప్పుకున్నారు. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో విజయరాణి తమ తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద రూ.10 కోట్ల వరకు వసూలు చేసి పా రిపోయిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే, తాజాగా మరో ఉదంతం వె లుగు చూసింది. తన కుమారుడు సినీ హీరో అ వుతున్నాడని చెప్పి విజయరాణి తనకు తెలిసిన 20 మంది నుంచి బంగారు నగలు తీసుకుంది. మొత్తం కేజీ బంగారం తీసుకొని ఉడాయించిం ది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిం చారు. కాగా, రాణిని త్వరగా అరెస్టు చేసి బాధితులను ఆదుకోవాలని దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ డీసీపీ పాలరాజును కలిసి కోరారు. అలాగే దర్శకుడు దాసరి నారాయణరావు కూడా నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దొరక్కుంటే కేసు సీఐడీకి అప్పగిస్తాం : డీజీపీ నిందితురాలు విజయరాణి రెండుమూడు రో జు ల్లో దొరక్కుంటే సీసీఎస్ దర్యాప్తు చేస్తున్న ఈకేసును సీఐడీకి అప్పగిస్తానని డీజీపీ బి.ప్రసాదరావు టీవీ ఆర్టిస్టులకు హామీ ఇచ్చారు. న్యాయం చేయాలని బాధిత ఆర్టిస్టులు సోమవారం డీజీపీ ని కలవగా ఆయన ఈ విధంగా స్పందించారు. -
'చిట్టీ' చిలకమ్మా... ఎక్కడున్నావమ్మా ?
-
చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి
ప్రజలకు పోలీసుల వినతి 4 బ్యాంక్ అకౌంట్లు, కారు సీజ్ సాక్షి, సిటీబ్యూరో: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచి పారిపోయిన బత్తుల విజయరాణి ఆచూకీ తెలిస్తే నగర సీసీఎస్ పోలీసులకు తె లపాలని డీసీపీ జి.పాలరాజు, ఏసీపీ విజయ్‌కుమార్ ప్రజలను కోరారు. విజయరాణిపై ఈనెల 13న చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు. శ్రీనగర్‌కాలనీలోని ఆమె ఫ్లాట్‌ను శుక్రవారం సీజ్ చేసిన పోలీసులు... తాజాగా రూ.6 లక్షల విలువ చేసే ఆమె కారు (ఏపీ 09 సీఎస్ 4931)ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీఐ, ఆంద్రాబ్యాంక్, ఎస్బీహెచ్, కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్న ఆమె నాలుగు అకౌంట్లను కూడా శనివారం సీజ్ చేయించారు. అందులో కేవలం రూ.300 కంటే ఎక్కువ లేవు. ఆ ఖాతాల్లోని డబ్బులను నిందితురాలు పథకం ప్రకారం ముందే డ్రా చేసుకొని పారిపోయింది. విజయరాణి ఆచూకీ తెలిసివారు 9490616703,9490616291 సెల్నెంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.