తెర వెనుక నేర వేషాలు
- రూ.10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్ విజయరాణి
- హత్యాయత్నం కేసులో చిక్కిన సినీనటుడు రెహమాన్
- డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో ఉదయ్
సాక్షి, సిటీబ్యూరో : తెరపై వివిధ క్యారెక్టర్లలో జీవిస్తున్న నటీనటులలో కొందరు తెరవెనుక మాత్రం నేర ‘వేషాలు’ వే స్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆర్టిస్టులు నేరాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. నేరబాట పట్టిన వారిలో ఒకరు టీవీ ఆర్టిస్టు విజయరాణి, మరొకరు సినీ ఆర్టిస్టు అబ్దుల్ రహమాన్, మూ డో వ్యక్తి వర్ధమాన నటుడు ఉదయ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో నేరానికి పాల్పడ్డారు.
డ్రగ్స్ కేసులో...
తాజాగా వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారాల్లో సినీనటులు పట్టుబడిన ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలోని కొందరు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు నెరపడం ఆందోళన కలిగిస్తోంది.
హత్యాయత్నం కేసులో....
రక్తచరిత్ర సినిమాలో విలన్‌గా నటించిన అబ్దుల్ రెహమాన్ వారం క్రితం పట్టపగలు అందరిముందు ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పరారీలో ఉన్న రెహమాన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వి.సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న రెహమాన్ ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి మరిది, చింతల్‌బస్తీకి చెందిన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులతో కలిసి పక్షం రోజుల క్రితం రెహమాన్‌పై దాడి చేశాడు. దీంతో ఫయాజ్‌పై కక్ష పెంచుకున్న రెహమాన్ ఈనెల 18న చాచానెహ్రూపార్క్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. సకాలంలో ఫయాజ్‌ను ఆసుపత్రికి తరలించడంతో బతికిబట్టకట్టాడు.
నగలు కూడా...
చిట్టీల రాణి ఉదంతంలో సోమవారం మరికొందరు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి తమ గోడు చె ప్పుకున్నారు. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో విజయరాణి తమ తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద రూ.10 కోట్ల వరకు వసూలు చేసి పా రిపోయిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే, తాజాగా మరో ఉదంతం వె లుగు చూసింది. తన కుమారుడు సినీ హీరో అ వుతున్నాడని చెప్పి విజయరాణి తనకు తెలిసిన 20 మంది నుంచి బంగారు నగలు తీసుకుంది. మొత్తం కేజీ బంగారం తీసుకొని ఉడాయించిం ది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిం చారు. కాగా, రాణిని త్వరగా అరెస్టు చేసి బాధితులను ఆదుకోవాలని దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ డీసీపీ పాలరాజును కలిసి కోరారు. అలాగే దర్శకుడు దాసరి నారాయణరావు కూడా నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దొరక్కుంటే కేసు సీఐడీకి అప్పగిస్తాం : డీజీపీ
నిందితురాలు విజయరాణి రెండుమూడు రో జు ల్లో దొరక్కుంటే సీసీఎస్ దర్యాప్తు చేస్తున్న ఈకేసును సీఐడీకి అప్పగిస్తానని డీజీపీ బి.ప్రసాదరావు టీవీ ఆర్టిస్టులకు హామీ ఇచ్చారు. న్యాయం చేయాలని బాధిత ఆర్టిస్టులు సోమవారం డీజీపీ ని కలవగా ఆయన ఈ విధంగా స్పందించారు.