Abdul Rahman
-
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా రెహ్మాన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెహ్మాన్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
కింగ్ ఖాన్ @ 50
విధి విచిత్రమైనది. ఎవరినైనా చల్లగా చూసిందంటే చాలు.. అథః పాతాళం నుంచి ఆకాశానికి ఎత్తేస్తుంది. షారుక్ ఖాన్ జీవితం అందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు 50 రూపాయల కోసం పని చేసిన షారుక్ ఇప్పుడు కోటీశ్వరుడు. ఒకప్పుడు బతుకు బండిని లాగడానికి టీ బండి నడిపిన షారుక్ ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. ‘బాలీవుడ్ బాద్షా’, ‘కింగ్ ఖాన్’ అనే బిరుదులను సొంతం చేసుకుని, తిరుగులేని నటుడిగా దూసుకెళుతున్నాడు. నేడు ఈ బాలీవుడ్ బాద్షా 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. * షారుక్ ఖాన్ అసలు పేరు ‘అబ్దుల్ రహ్మాన్’. షారుక్‌కి అతని బామ్మ పెట్టిన పేరిది. అయితే, ఆ పేరుని అధికారికంగా ఎక్కడా వాడలేదు. ఐదారేళ్ల వయసు వరకూ బామ్మ దగ్గర, ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు ‘షారుక్ ఖాన్’. దాన్నే అధికారికంగా వాడుతున్నాడు. * ఆర్మీలో చేరాలన్నది షారుక్ కల. అందుకే ఆర్మీ స్కూల్లో చేరాడు. షారుక్ తల్లికి మాత్రం తన కొడుకు ఆర్మీలో చేరడం ఇష్టం లేదు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. * షారుక్ తండ్రి స్వాత్రంత్య సమరయోధుడు. కొంత కాలం తర్వాత చిన్న వ్యాపారం మొదలుపెట్టారాయన. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో ఓ టీ షాప్ నడిపేవారాయన. ఆ టీ షాప్‌కి వెళ్లినప్పుడే షారుక్‌కి యాక్టింగ్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ స్కూల్లోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. అప్పుడు బుల్లితెర నిర్మాతల దృష్టిలో పడ్డాడు. పలు టీవీ సీరియల్స్‌లో నటించాడు. వ్యాఖ్యాతగా కూడా చేశాడు. * షారుక్ తొలి సంపాదన 50 రూపాయలు. ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రేక్షకులకు సీట్స్ చూపించే వ్యక్తిగా పని చేసినందుకు షారుక్ తీసుకున్న జీతం అది. అప్పట్లో ఢిల్లీలో ఉండేవాడు. ఆ యాభై రూపాయలు పారితోషికం తీసుకుని ఆగ్రా వెళ్లి, తాజ్‌మహల్ చూశాడు. * స్పోర్ట్స్ అంటే షారుక్‌కి చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఫుట్‌బాల్, హాకీ టీమ్స్‌కి కెప్టెన్‌గా చేశాడు. జాతీయ స్థాయిలో క్రికెట్ కూడా ఆడాడు. * మధ్యతరగతి కుటుంబానికి చెందిన షారుక్ సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ నడిపాడు. * షారుక్ తండ్రి 1981లో, ఆ తర్వాత పదేళ్లకు అతని తల్లి చనిపోయారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌కి గురయ్యాడు షారుక్. అందులోంచి బయటపడటానికి ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నాడు. అప్పుడే ఢిల్లీ నుంచి ముంబయ్‌కి మకాం మార్చాడు. ‘దీవానా’ చిత్రంలో కథానాయికునిగా చేసే అవకాశం తెచ్చుకుని, తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు సాధించారు. * ‘దీవానా’ తర్వాత వరుసగా సినిమాలు అంగీకరించేశారు. నాయకుడిగా మాత్రమే కాదు.. ‘డర్’, ‘బాజీగర్’, ‘అంజామ్’, ‘డాన్’, ‘డాన్ 2’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి, తనలో మంచి ప్రతినాయకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు. * వ్యక్తిగతంగా షారుక్ ఖాన్ పేరు ఆయనకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే, తెరపై ‘రాహుల్’ పేరుతో ఆయన చేసిన పాత్రలు హిట్టయ్యాయి. ‘దిల్ తో పాగల్ హై’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో పాటు మరో ఐదారు చిత్రాల్లో షారుక్ పాత్ర పేరు ‘రాహుల్’. ఈ చిత్రాలన్నీ హిట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ‘రాజు బన్ గయా జెంటిల్‌మేన్’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’,‘ చల్తే చల్తే’, ‘రబ్ నే బనా దీ జోడి’ చిత్రాల్లో ఆయన పాత్రల పేరు ‘రాజ్’ కావడం విశేషం. * దాదాపు పదహారు చిత్రాల్లో షారుక్ చనిపోతారు. వాటిలో ‘బాజీగర్’, ‘డర్’, ‘దిల్ సే’, ‘దేవ్‌దాస్’ వంటి చిత్రాలు ఉన్నాయి. * బాలీవుడ్లో ఉన్న ‘హ్యాపీ కపుల్స్’లో షారుక్, గౌరీఖాన్‌ల జంట ఒకటి. గౌరీని షారుక్ కలిసినప్పుడు అతని వయసు 18. అప్పుడు గౌరి వయసు 14. నాలుగైదేళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లాడారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా అనే కొడుకూ, కూతురూ ఉన్నారు. రెండేళ్ల క్రితం సరోగసీ విధానం ద్వారా పుట్టిన బాబుకి ‘అబ్రామ్’ అని పేరు పెట్టారు. * రాత్రి నిద్రపోయేటప్పుడు షారుక్ ఇస్త్రీ చేసిన పైజామాలనే వేసుకుంటారు. కలలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి వస్తే.. అందుకే ఇస్త్రీ చేసిన పైజామా వేసుకుంటానని ఓ సందర్భంలో షారుక్ పేర్కొన్నారు. -
పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్
హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ రైలు మంగళవారం పట్టాలెక్కింది. కాచిగూడ-గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడవనున్న ఈ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌ను ఉదయం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్లో సీనియర్ ఉద్యోగి అబ్దుల్ రహమాన్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 500 మంది ప్రయాణికులతో ఇది కాచిగూడ నుంచి గుంటూరుకు బయలుదేరింది. ఇది కాచిగూడ-గుంటూరు మధ్య ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 5.30కు బయలుదేరి ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.55కు కాచిగూడ చేరుకుంటుంది. నేడు తిరుపతికి: 14వ తేదీ (బుధవారం) ఉదయం కాచిగూడ-తిరుపతి డబు ల్‌డెక్కర్ సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 6.45 గంటలకు ఇది కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15కు కాచిగూడ చేరుకుంటుంది -
తెర వెనుక నేర వేషాలు
రూ.10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్ విజయరాణి హత్యాయత్నం కేసులో చిక్కిన సినీనటుడు రెహమాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన హీరో ఉదయ్ సాక్షి, సిటీబ్యూరో : తెరపై వివిధ క్యారెక్టర్లలో జీవిస్తున్న నటీనటులలో కొందరు తెరవెనుక మాత్రం నేర ‘వేషాలు’ వే స్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆర్టిస్టులు నేరాలకు పాల్పడటమే దీనికి నిదర్శనం. నేరబాట పట్టిన వారిలో ఒకరు టీవీ ఆర్టిస్టు విజయరాణి, మరొకరు సినీ ఆర్టిస్టు అబ్దుల్ రహమాన్, మూ డో వ్యక్తి వర్ధమాన నటుడు ఉదయ్ ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో నేరానికి పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో... తాజాగా వర్థమాన నటుడు ఉదయ్ కిరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. గతంలోనూ డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారాల్లో సినీనటులు పట్టుబడిన ఉదంతాలున్నాయి. సినీ పరిశ్రమలోని కొందరు మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు నెరపడం ఆందోళన కలిగిస్తోంది. హత్యాయత్నం కేసులో.... రక్తచరిత్ర సినిమాలో విలన్‌గా నటించిన అబ్దుల్ రెహమాన్ వారం క్రితం పట్టపగలు అందరిముందు ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పరారీలో ఉన్న రెహమాన్‌ను అరెస్టు చేసినట్టు డీసీపీ వి.సత్యనారాయణ సోమవారం వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న రెహమాన్ ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలి మరిది, చింతల్‌బస్తీకి చెందిన మహ్మద్ ఫయాజ్ తన స్నేహితులతో కలిసి పక్షం రోజుల క్రితం రెహమాన్‌పై దాడి చేశాడు. దీంతో ఫయాజ్‌పై కక్ష పెంచుకున్న రెహమాన్ ఈనెల 18న చాచానెహ్రూపార్క్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని కత్తితో పొడిచి పారిపోయాడు. సకాలంలో ఫయాజ్ను ఆసుపత్రికి తరలించడంతో బతికిబట్టకట్టాడు. నగలు కూడా... చిట్టీల రాణి ఉదంతంలో సోమవారం మరికొందరు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి తమ గోడు చె ప్పుకున్నారు. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో విజయరాణి తమ తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద రూ.10 కోట్ల వరకు వసూలు చేసి పా రిపోయిందని మాత్రమే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే, తాజాగా మరో ఉదంతం వె లుగు చూసింది. తన కుమారుడు సినీ హీరో అ వుతున్నాడని చెప్పి విజయరాణి తనకు తెలిసిన 20 మంది నుంచి బంగారు నగలు తీసుకుంది. మొత్తం కేజీ బంగారం తీసుకొని ఉడాయించిం ది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిం చారు. కాగా, రాణిని త్వరగా అరెస్టు చేసి బాధితులను ఆదుకోవాలని దర్శక, నిర్మాత తమ్మినేని భరద్వాజ డీసీపీ పాలరాజును కలిసి కోరారు. అలాగే దర్శకుడు దాసరి నారాయణరావు కూడా నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దొరక్కుంటే కేసు సీఐడీకి అప్పగిస్తాం : డీజీపీ నిందితురాలు విజయరాణి రెండుమూడు రో జు ల్లో దొరక్కుంటే సీసీఎస్ దర్యాప్తు చేస్తున్న ఈకేసును సీఐడీకి అప్పగిస్తానని డీజీపీ బి.ప్రసాదరావు టీవీ ఆర్టిస్టులకు హామీ ఇచ్చారు. న్యాయం చేయాలని బాధిత ఆర్టిస్టులు సోమవారం డీజీపీ ని కలవగా ఆయన ఈ విధంగా స్పందించారు. -
పాపం... రహిమాన్
ఈ బాలుడి పేరు అబ్దుల్ రహిమాన్.. ఊరు ప్రొద్దుటూరు.. వయసు 11.. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు.. ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే గొలుసుతో కాలును కట్టేసినట్లు కనిపిస్తుంది.. తోటి పిల్లలను కొట్టడం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే తల్లిదండ్రులే ఇలా కట్టేశారు.. ఒకటి.. రెండు కూడా చెప్పలేడు.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొద్దిసేపు ఇంటి తలుపులు మూసి మళ్లీ ఇలా కట్టేస్తారు.. తండ్రి పాత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తుంటాడు.. తమ శక్తి మేరకు ఆస్పత్రులలో చూపించినా ఫలితం లేదని.. బెంగళూరులోని నిమ్హాన్స్కు వెళ్లమంటున్నారని.. అక్కడికి వెళ్లి వైద్యం చేయించే పరిస్థితులలో లేమని.. దాతలు దయతలచి 9000409301 ఫోన్ ద్వారా సహాయం చేస్తే వైద్యం చేయించుకుంటామని రహిమాన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. - న్యూస్‌లైన్, ప్రొద్దుటూరు -
ఇంజినీర్ల ఉద్యమ బాట
=పెన్‌డౌన్ మొదలు =26, 27 తేదీల్లో సామూహిక సెలవులు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ విభాగం మొత్తం విధుల బహిష్కరణకు సిద్ధమైంది. గత శని, సోమవారాల్లో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో తమ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని చేసిన దాడులు,హేళనకు నిరసన గా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో భాగంగా 24, 25 తేదీల్లో పెన్‌డౌన్, 26న సామూహిక ఆప్షనల్ లీవ్, 27న సామూహిక క్యాజువల్ లీవ్‌లకు శ్రీకారం చుట్టారు. అప్పటికీ తగిన హామీ లభించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కానున్నట్లు ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు ఎండి అబ్దుల్ రహ్మాన్, కె. కిషన్, తదితరులు మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు జీహెచ్ఎంసీ ‘ఫేస్ టు ఫేస్’ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వసభ్య సమావేశాల్లో ఇంజినీరింగ్ విభాగాన్ని కించపరిచేలా వ్యవహరించారని, అజెండా మేరకు తామిచ్చిన లిఖితపూర్వక సమాధానాలను పక్కనపెట్టి, ఇంజినీరింగ్ విభాగాన్ని అవమానపర్చేలా విభాగం అధిపతి అయిన ఈఎన్సీపై దాడులకు దిగారని ఆరోపించారు. ప్రైవేట్ కన్సల్టెన్సీలకు పనుల అంశం వాస్తవానికి అజెండాలో 14వ అంశమైనప్పటికీ, కక్ష సాధించేందుకే ముందుకు జరిపి 10వ అంశంగా మార్చారన్నారు. కన్సల్టెన్సీల నియామకాల్లో తమకెలాంటి ప్రయోజనాలు లేవని, ప్రభుత్వ విధానాల మేరకే వాటిని నియమించామని చెప్పారు. ఆమేరకు, జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదానికి లోబడే బడ్జెట్లో సైతం ప్రత్యేక అకౌంట్‌ను కేటాయించి నిధులు మంజూరు చేశారన్నారు. తామెదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఎంతోకాలంగా అధికారులకు విన్నవించుకున్నా పరిష్కరించలేదన్నారు. పని ఒత్తిడితో జీహెచ్ఎంసీలో పనిచేసేందుకు కొత్త ఇంజినీర్లు ముందుకు రావడం లేదని, వచ్చినవారిలో సగానికి పైగా వెనుదిరిగారని చెప్పారు. తామెదుర్కొంటున్న సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తగిన హామీ లభించని పక్షంలో అసోసియేషన్ సమావేశంలో చర్చించి తదుపరి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఈఈలు చిన్నారెడ్డి, వేణుగోపాల్, మోహన్‌కుమార్, మోహన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ పన్వర్‌హాల్‌లో ఇంజినీర్లందరూ సమావే శమై తమపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఇంజినీర్ల పెన్‌డౌన్ సమ్మెతో మంగళవారం ఇంజినీరింగ్ కార్యాలయాల పనులు ఎక్కడివక్కడే స్తంభించాయి. బుధవారం నుంచి అన్ని పనులూ నిలిచిపోనున్నాయి. సెలవుపై ఈఎన్సీ .. శని, సోమవారాల్లో వరుస దాడులతోపాటు.. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సైతం ఈఎన్సీ ఇరవయ్యేళ్లుగా జీ హెచ్ఎంసీలో ఉన్నారని ప్రస్తావించడం తో కలతచెందిన ఈఎన్సీ ధన్సింగ్ దీర్ఘకాలిక సెలవుపెట్టారు. తనను బదిలీ చే యాల్సిందిగా కోరుతూ సోమవారమే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారని తెలిసింది. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇంజినీర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతిసే లా ప్రవ ర్తించిన కాంగ్రెస్, ఎంఐఎంలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని జీహెచ్ఎంసీలో బీజేపీ పక్ష నాయకుడు బంగారి ప్రకాశ్ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కన్సల్టెన్సీలకు పనులు అప్పగించడంపై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎంల వైఖరిని తప్పుబట్టారు. జీహెచ్ఎంసీలో అధికారకూటమిగా ఉండీ బడ్జెట్లోనే కన్సల్టెన్సీ సేవలకు నిధులు కేటాయించినప్పుడు ఆ పార్టీలు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు.