పాపం... రహిమాన్
ఈ బాలుడి పేరు అబ్దుల్ రహిమాన్.. ఊరు ప్రొద్దుటూరు.. వయసు 11.. పుట్టుకతోనే మానసిక వికలాంగుడు.. ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే గొలుసుతో కాలును కట్టేసినట్లు కనిపిస్తుంది.. తోటి పిల్లలను కొట్టడం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే తల్లిదండ్రులే ఇలా కట్టేశారు.. ఒకటి.. రెండు కూడా చెప్పలేడు.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొద్దిసేపు ఇంటి తలుపులు మూసి మళ్లీ ఇలా కట్టేస్తారు.. తండ్రి పాత ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తుంటాడు.. తమ శక్తి మేరకు ఆస్పత్రులలో చూపించినా ఫలితం లేదని.. బెంగళూరులోని నిమ్‌హాన్స్‌కు వెళ్లమంటున్నారని.. అక్కడికి వెళ్లి వైద్యం చేయించే పరిస్థితులలో లేమని.. దాతలు దయతలచి 9000409301 ఫోన్ ద్వారా సహాయం చేస్తే వైద్యం చేయించుకుంటామని రహిమాన్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
- న్యూస్‌లైన్, ప్రొద్దుటూరు