ఆదుకోని ఆసరా..?
Published Wed, Mar 22 2017 6:48 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
మందమర్రి రూరల్ : మానవత్వం మంట కలిసిపోతుంది. ప్రభుత్వ పథకాలు ఉన్నవారికే చుట్టాలన్నట్లు సమాజంలో దివ్యాంగులను వెక్కిరిస్తున్నాయి. సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా.. సంబంధిత అధికారులను కలిసినా.. ప్రజాప్రతినిధులకు మొర పట్టుకున్నా.. ప్రభుత్వం దివ్యాంగులకు అందించే ఆసరా ఫించన్ అందడం లేదు. శంకరమ్మ జగన్ లు రామకృష్ణాపూర్‌లోని కాకతీయ కాలనిలో జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
పూర్తిగా కాళ్లు చేతులు లేని జగన్‌కు ప్రభుత్వం అందించే ఫించన్ రాక పోవడంతో శంకరమ్మ చంటి పిల్లాడిలా తనని ఎత్తుకొని కనీసం ఫించన్ ఇప్పించండి సారూ.. అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది. ఫించన్ ఇప్పించమని బుధవారం మండల అభివృద్ధి అధికారిని కలిసింది. ఎక్కడికి వెళ్లాలన్నా భర్తను ఎత్తుకుని తీసుకు వెళ్తుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనీసం మూడు చక్రాల సైకిల్ అందించాలని శంకరమ్మ ప్రాదేయపడుతోంది.
Advertisement
Advertisement