నా కనులు నీవిగా చేసుకుని చూడు !
నా కనులు నీవిగా చేసుకుని చూడు !
Published Wed, Jul 5 2017 9:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM
ఏ ముహూర్తాన వారు కలిశారో తెలియదు గానీ ఓర్వకల్లు మండలానికి చెందిన ఇద్దరు దివ్యాంగులు వయస్సు తారతమ్యం ఉన్నా స్నేహితులయ్యారు. అంతేకాదు తమ వైకల్యాన్ని ఎదిరించి ఒకరికొక్కరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మండలంలోని బైరాపురం గ్రామానికి చెందిన గోపాల్‌కు చిన్నతనంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు కోల్పోయాడు. ఇతను ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎ. నాగన్న అంధుడు. ఆయన ప్రస్తుతం ఆర్‌అండ్‌బీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ వీరిద్దరూ కర్నూలు నగరంలో కలుసుకుంటారు. ఎవరికి ఏ పనిపడినా ఒకరికొకరు సహాయపడతారు. ఈ క్రమంలో మంగళవారం వారిద్దరూ సి.క్యాంపు సెంటర్ సమీపంలోని ఓ ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్లారు. పని ముగించుకున్న అనంతరం నాగన్నను ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి తీసుకెళ్లాడు గోపాల్. ట్రైసైకిల్ గోపాల్ నడుపుతుండగా, ఆ వాహనాన్ని పట్టుకుని నాగన్న ముందుకు కదులుతున్న దృశ్యం స్నేహమేరా జీవితమని చాటింది.
- డి. హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
Advertisement