- నాగేశ్వరి కుటుంబానికి రూ.2.3లక్షలు డిపాజట్
ఫేస్‌బుక్, మిత్రులు, ఔదార్యం
Published Mon, Aug 8 2016 11:58 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
ధర్మపురి :చిన్నవయసులోనే మధుమేహంతో బాధపడుతున్న పట్టణానికి చెందిన నాగరాజు నాగేశ్వరి (8)కి ఫేస్‌బుక్ మిత్రులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ధీనస్థితిని చూసిన ధర్మపురికి చెందిన రేణికుంట రమేశ్ ఆమె కథనాన్ని ఫేస్‌బుక్ ద్వారా తన స్నేహితులకు పంపించారు. ఆ కథనాన్ని ధర్మపురిలో ఉంటున్న వారితోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఫేస్‌బుక్ మిత్రులు చదివి చలించిపోయారు. మిత్రులందరూ కలిసి రూ.2.3లక్షలు పోగుచేశారు. ఆ డబ్బును సోమవారం ధర్మపురిలోని ఎస్‌బీఐలో నాగేశ్వరి పేరిట ఖాతా తీసి డిపాజిట్ చేశారు. సంబంధిత బాండ్‌ను బ్యాంకు మేనేజర్ స్వరూపారాణి నాగేశ్వరి తల్లిదండ్రులకు అందించారు. ఈ సొమ్ముతో వచ్చిన వడ్డీని వైద్య ఖర్చులకు వినియోగించుకోవాలని మేనేజర్ సూచించారు. నాగేశ్వరికి ప్రతినెలా వైద్యపరీక్షలు చేయిస్తానని కరీంనగర్‌కు చెందిన శ్రీనిధి ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాస్ ప్రకటించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement