సాక్షి, జన్నారం(ఖానాపూర్): ఫేస్‌బుక్ పోస్టుతో ఓ నిరుపేద కుటుంబానికి గూడు సౌకర్యం కలిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోర్లకుంఠ వెంకటి, పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ‍్లు. వృద్ధులైన వెంకటి తల్లిదండ్రులు వారితోపాటు ఉంటున్నారు. జీవనోపాధి కోసం వెంకటి ఇరాక్‌కు వెళ్లగా.. పద్మ కూలీపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గుడిసెలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు గుడిసె కాలిపోయి నిరాశ్రయులయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ గ్రామస్తుల ద్వారా తెలుసుకుని కుటుంబం దీనస్థితిపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫేస్‌బుక్ మిత్రులు పద్మ బ్యాంకు ఖాతాకు రూ.65 వేలు విరాళంగా పంపించారు. గ్రామ సర్పంచ్ దర్శనాల వెంకటస్వామి ఆధ్వర్యలో శివాజీ యూత్ మిత్రులు మరో రూ.90 వేలు సేకరించారు. ఇంటిని నిర్మించారు. సత్యసాయి అభయహస్తం సభ్యులు ఆదివారం ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అభయ హస్తం సభ్యులు గట్టు రాజేందర్, గుడికందుల ప్రసాద్, సామ ఉమాపతి, ఎన్నాకుల అశోక్, అలుగుందుల సుధాకర్, గంప ప్రసాద్, శివాజీ మిత్రబృందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment