పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్ | That may double-decker | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్

Published Wed, May 14 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్

పట్టాలెక్కిన డబుల్‌డెక్కర్

హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలో మొట్టమొదటి డబుల్ డెక్కర్  రైలు  మంగళవారం పట్టాలెక్కింది. కాచిగూడ-గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడవనున్న ఈ  బై వీక్లీ  సూపర్‌ఫాస్ట్ ట్రైన్‌ను ఉదయం 5.30 గంటలకు కాచిగూడ  రైల్వేస్టేషన్‌లో సీనియర్ ఉద్యోగి అబ్దుల్ రహమాన్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 500 మంది ప్రయాణికులతో ఇది కాచిగూడ నుంచి గుంటూరుకు బయలుదేరింది.  ఇది  కాచిగూడ-గుంటూరు మధ్య ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 5.30కు బయలుదేరి  ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. తిరిగి  అక్కడ మధ్యాహ్నం 12.45 గంటలకు  బయలుదేరి సాయంత్రం 5.55కు కాచిగూడ చేరుకుంటుంది.

 నేడు తిరుపతికి: 14వ తేదీ (బుధవారం) ఉదయం  కాచిగూడ-తిరుపతి డబు ల్‌డెక్కర్ సర్వీసు ప్రారంభం కానుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం  6.45 గంటలకు  ఇది కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 6.15కు  తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురు, ఆది వారాల్లో  ఉదయం 5.45 కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 5.15కు  కాచిగూడ చేరుకుంటుంది
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement