హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్‌ శెట్టి | Director Uday Shetty Talk About Gam Gam Ganesha Movie | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్‌ శెట్టి

Published Thu, May 30 2024 8:19 PM | Last Updated on Thu, May 30 2024 8:19 PM

Director Uday Shetty Talk About Gam Gam Ganesha Movie

‘భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు డైరెక్టర్‌ ఉదయ్ శెట్టి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఆనంద్ దేవరకొండ హీరో. సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. రేపు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఉదయ్‌ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 
 

నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.

వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.

ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.

"గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది.

"గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.

నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement