‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..? | Gam Gam Ganesh Movie First Day Box Office Collection | Sakshi
Sakshi News home page

‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..?

Published Sat, Jun 1 2024 4:31 PM | Last Updated on Sat, Jun 1 2024 5:11 PM

Gam Gam Ganesh Movie First Day Box Office Collection

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’.  ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు.  ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. 

(చదవండి: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ)

ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్‌డే ఈ మూవీ  1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement