బాక్సాఫీస్ దగ్గర 'గం గం గణేశా'.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే? | Gam Gam Ganesha Movie Day 2 Worldwide Collection | Sakshi
Sakshi News home page

Gam Gam Ganesha: 'గణేశుడు'.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాడంటే?

Jun 2 2024 9:57 PM | Updated on Jun 3 2024 10:00 AM

Gam Gam Ganesha Movie Day 2 Worldwide Collection

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. చాన్నాళ్ల పాటు సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. అలాంటి టైంలో అంటే రీసెంట్‌ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటే ఇది. రోజు రోజుకి మెరుగైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు దక్కించుకుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?

(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం)

'బేబి' మూవీతో గతేడాది హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు జానర్ మార్చి మరో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. క్రైమ్ కామెడీతో తీసిన 'గం గం గణేశా' తొలిరోజు రూ.1.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు థియేటర్లకి జనాలు బాగానే వచ్చారు. తద్వారా రెండో రోజు రూ.1.50 కోట్లకి పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన ఓవరాల్‌గా చూసుకుంటే 'గం గం గణేశా' సినిమాకు రెండు రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కినట్లు సమాచారం. మరి ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. మరి సేఫ్ జోన్‌లోకి వెళ్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement