TV artists
-
మూడుభాషల హీరో
తెలుగు, మలయాలం, తమిళం మూడు భాషల్లోనూ బుల్లితెర నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జై ధనుష్. ‘తూర్పు–పడమర’, ‘కొంచెం ఇష్టం కొంచె కష్టం’, ‘తరంగాలు’, ‘ఆడదే ఆధారం’, ‘నెం.1 కోడలు’.. ఇలా వరుసగా సీరియల్స్చేస్తున్నాడు జైధనుష్. ‘అన్ని వయసులవారి అభిమానాన్ని సంపాదించాలన్నదే నా లక్ష్యం’ అంటూ చెబుతున్న ముచ్చట్లివి.. ‘ఇతర రాష్ట్రాల టీవీ ఆర్టిస్టులు ఇక్కడ సీరియల్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. తెలుగు నటుడిగా కొనసాగుతూనే తమిళం, మలయా ళం సీరియల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో కూడా నన్ను వాళ్లలో మనిషిలో చూస్తున్నారు. మలయాళంలో ‘అలియంబల్’, తమిళంలో ‘చంద్రలేఖ’, ఇక్కడ జీ తెలుగులో ‘నెం.1 కోడలు’లో లీడ్ రోల్ చేస్తున్నాను. ప్రభాస్‌తో కలిసి.. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేది. విశాఖపట్టణంలో మా నాన్నగారికి బిజినెస్ ఉండటంతో కాలేజీ టైమ్‌లో అక్కడ ఉన్నాను. మా ఇంటికి దగ్గరలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సెలవు రోజుల్లో అక్కడకెళ్లి చూసేవాడిని. ఆ ఇన్స్టిట్యూట్ సర్ మా నాన్నగారికి ‘మీ అబ్బాయి యాక్టింగ్‌కి బాగా పనికివస్తాడు. హాలీడేస్ టైమ్‌లో పంపించమ’ని అడిగారు. అలా యాక్టింగ్ నేర్చుకున్నాను. సినీ హీరో ప్రభాస్ నేనూ ఒకే బ్యాచ్. సినీ పరిశ్రమలో మా బ్యాచ్ అందరికీ మంచి అవకాశాలు వచ్చాయి. యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 1–2 ట్రయల్స్‌లోనే ‘పోతేపోనీ’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత మనోరమ, అభిలాషి సినిమాల్లో చేశాను. ఈ సినిమాలకు నంది అవార్డ్సు వచ్చాయి. కానీ, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో నా దారి సీరియల్స్ వైపుగా మళ్లించుకున్నాను. నటి– నటుడు– ఓ ఫ్యామిలీ సీరియల్ నటి కీర్తి నా భార్య. తనది బెంగళూరు. సీరియల్ నటి పరిటాల మంజుల చెల్లెలు. ‘తూర్పు–పడమర’ సీరియల్లో చేసే సమయంలో ప్రేమించుకున్నాం. ఆరేళ్ల పాటు ఇద్దరం మా కెరియర్స్ చూసుకుంటూనే మా జర్నీ కొనసాగించాం. ఒకరి మీద ఒకరికున్న నమ్మకం, ప్రేమ చూసి ఇరుకుటుంబాలు మా పెళ్లికి అంగీకరించారు. ఇప్పుడు మాకో పాప. తన పేరు తనీహా. వీడియో కాల్‌తో కనెక్ట్ ఇద్దరమూ ఆర్టిస్టులమే అవడంతో ప్లానింగ్ తప్పదు. ఇద్దరమూ తెలుగు, తమిళం సీరియల్స్ చేస్తున్నాం. దీంతో షూట్లో భాగంగా నేను చెన్నై వెళ్లినప్పుడు తను హైదరాబాద్ వస్తుంది. నేను హైదరాబాద్ వస్తే, తను చెన్నై వెళ్లాల్సి వస్తుంది. టూర్‌కి కరెక్ట్‌గా ప్లాన్ చేసినా చాలా సార్లు టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఇన్స్టంట్ ప్లాన్‌కి ఫిక్స్ అయిపోయాం (నవ్వుతూ). నెలలో ఎప్పుడొస్తాయో తెలియని ఐదు రోజుల ఖాళీ సమయం దొరుకుతుంది. మా ఇద్దరి షూటింగ్స్ వల్ల పాప మా పేరెంట్స్‌తో ఎక్కువ ఉంటుంది. షూట్లో ఉన్నా రోజూ పడుకునేముందు అరగంట సమయం వీడియో కాల్లో కలుస్తాం. మా కుటుంబంలోనే నలుగురం టీవీ ఆర్టిస్టులం అవడంతో ఎప్పుడు కలిసినా మా మధ్య సీరియల్ టాపిక్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరి బిజీలో వారున్నా ఎవరినీ మిస్సవకుండా చూస్తాం. వాగ్దేవి కొడుకు ‘జీ తెలుగు’లో వచ్చే ‘నెంబర్.1’ కోడలు సీరియల్స్ జాబితాలోనే పెద్ద బడ్జెట్ సీరియల్. నా మీద నమ్మకం పెట్టుకొని లీడ్‌రోల్ ఇచ్చారు. విద్యాసంస్థలు నడిపే వాగ్దేవికి కొడుకుగా చేస్తున్నాను. ఒక మహిళ ఏమనుకున్నా సాధించగలదు అనే క్యారెక్టర్ వాగ్దేవిది. ఏది చేసినా నెం.1 గా ఉండాలనేది తన లక్ష్యం. తన ఇద్దరు పిల్లలు నెం.1 గా ఉండాలి అనుకుంటుంది. నేను కూడా ఆవిడకన్నా ఎక్కువ పంతంతో ఉంటాను. ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలనుకుంటా. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న నాకు పూర్తి వ్యతిరేక మనస్తత్వం ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ, ఆ అమ్మాయి అస్సలు చదువుకోలేదు. ఆమె మా కుటుంబంలోకి ఎలా వస్తుంది, అక్కడ ఎలా ఉంటుంది? అనేది కథ. భిన్నమైన పాత్రలు మూడు భాషల్లో నటించడం వల్ల ఎప్పుడైనా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మూడు భాషల వాళ్లు కలిసి ‘మీ సీరియల్స్ చూస్తాం, చాలా బాగుంటాయి’ అని వారి కుటుంబంలో వ్యక్తిలా కలుపుకుపోయి మాట్లాడుతుంటారు. సీరియల్లో ఒక పాత్ర ద్వారా చాలా భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం లభిస్తుంది. మంచివాడుగా, చెడ్డవాడుగా, ప్రేమికుడిగా.. నిరూపించుకోవచ్చు. మునుపటిలా కాదు ప్రేక్షకుల అభిమానం క్షణాల్లో తెలిసిపోతుంది. సీరియల్ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో చూసిన అభిమానులు వెంటనే కామెంట్స్ పెట్టేస్తున్నారు. నే చేస్తున్న ప్రతీ పాత్రకు ఆ కామెంట్స్ చాలా పాజిటివ్‌గా ఉంటున్నాయి. నటుడిగా ప్రేక్షకులు అభిమానం ఎప్పడూ ఇలా పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. అన్ని పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటాను. అలాగే బడికెళ్లే వాళ్ల వయసు నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ వారి కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నాను. సహజంగానే ప్రయాణాలంటే ఇష్టపడే నాకు ఎక్కడకు వెళ్లినా తమలో ఒకరిగా చూసే అభిమానం తోడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. – నిర్మలారెడ్డి -
నకిలీ ఫేస్బుక్.. ప్రేమలోకి దింపి ఆరు లక్షలకు టోపీ..!
సాక్షి, హైదరాబాద్ : ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి ఔత్సాహిక కళాకారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ తెలిపిన మేరకు.. చిత్తూరు జిల్లా చింతపత్రిలోని వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరు గ్రామంలో ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను రోజువారీగా క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్‌లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్ డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అనే పేరు వచ్చేది. సులభ పద్ధతిన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు కావాలనుకునే వారిని ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి రోజువారీగా చాట్‌చేసి సాన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా మలచుకున్న నిందితురాలు శ్రీలత దఫాలవారీగా తన బ్యాంక్ ఖాతాల్లో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయం శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను ఇన్స్పెక్టర్లు పి.లక్ష్మీకాంతరెడ్డి, విజయ్‌కుమార్, ప్రకాశ్‌ల బృందం శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. -
సిటీలోని టీవీ స్టార్స్‌కు ముందస్తు సంక్రాంతి..
ఒకప్పుడు బుల్లి తెరపైకార్యక్రమాలు కేవలంస్టూడియోల్లో చిత్రీకరించి ప్రసారం చేసేవారు. ప్రస్తుతం అవి జనం మధ్యలోనే జరుగుతున్నాయి. చిన్నితెర వేల్పులను పల్లెలకు,వీక్షకుల ఇళ్లకు, ఊళ్లకు సైతం ప్రయాణం కట్టిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :పచ్చని పల్లెల్లో పండగ సంబరాలు మరీ ముఖ్యంగా సంక్రాంతి వేడుకలు సహజసిద్ధంగానే వచ్చేస్తాయి. కాంక్రీట్ జంగిల్స్లాంటి సిటీల్లో మాత్రం వాటిని మన నట్టింటికి తెచ్చేవి చిన్ని తెర చిద్విలాసాలే. నగరవాసులకు సంక్రాంతితో కనువిందు చేసేందుకు పండగ సందర్భంగా ఏర్పాటు చేసే టీవీ కార్యక్రమాలతో పల్లెల్లో ముందస్తు సంబరాలు వచ్చేస్తున్నాయి. పల్లెలకే ఎందుకు? మిగతా పండగల సంగతేమో గాని సంక్రాంతిని మాత్రం నగరంలో కళ్లకు కట్టడం అసాధ్యం. అందుకే చిన్నితెర వేల్పులు పల్లెల్ని ఎంచుకుంటున్నారు. సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేని సిటిజనులకు ఊరట ఇస్తూనే మరోవైపు తామేం కోల్పోతున్నామో కూడా స్పష్టంగా వివరిస్తున్నారు. తద్వారా వీక్షకుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా పల్లెలకు వెళ్లి సంక్రాంతి టీవీ బృందం మాటల్లో చెప్పాలంటే...ఈ ముందస్తు సంబరాలు తమకు డబుల్ థమాకా. వ్యయ ప్రయాసలు తప్పవు.. గతంలో స్టూడియోలకు పరిమితమయ్యే సంబరాలను ఇప్పుడు అవుట్‌డోర్‌కి విస్తరించడంతో పండగ వేడుకలను మన కళ్లకు కట్టడానికి చిన్నితెర కార్యక్రమాల నిర్వాహకులు స్టార్స్‌కు వ్యయప్రయాసలు తప్పడం లేదు. తమ స్టూడియోకి జూనియర్ ఆర్టిస్టులను తీసుకువచ్చి చేసే సందడికి వీడ్కోలు పలికి తామే స్వయంగా పల్లెలకు పయనమవుతున్నారు. పల్లె ప్రజలతో కలిసి మెలిసి ఆడిపాడేస్తున్నారు. ‘ఈ ఏడాది జీ తెలుగు సంక్రాంతి సంబరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కోరుమిళ్ల, రామచంద్రాపురం ఊళ్లకు వెళ్లాం. దాదాపు 70 మందితో కూడిన మా బృందం రెండు రోజుల పాటు అక్కడే ఉంది. సంప్రదాయ పండగ వేడుకలతో పాటు విభిన్న రకాల ఆటల పోటీలు కూడా నిర్వహించాం’ అని తెలిపారు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ప్రతినిధి. ఫెస్టివల్.. డబుల్ ప్రతీసారి ఊరెళ్తా. ఈసారి కూడా ఫ్రెండ్స్‌తో కలిసి భీమవరం వెళుతున్నా. జీ తెలుగు కార్యక్రమంలో భాగంగా ముందే వేడుకల్లో పాల్గొనడంతో నాకు రెండు సార్లు పండగొచ్చినట్లయింది. సంక్రాంతి పండగకు అన్నింటి కన్నా నచ్చేది పిండి వంటలే. ఎందుకంటే వాటిని ప్యాక్ చేసుకుని మన ఊరికి తెచ్చుకుంటాం. అలా మరిన్ని రోజులు ఆ సంబరం మనతో ఉంటుంది. ముగ్గుల మధ్యలో కొలువుదీరే గొబ్బెమ్మల్ని చూడడం చాలా ఇష్టం. వాటిని డిస్ట్రబ్ చేయడం, వాటిని పేర్చిన అమ్మాయిల్ని ఆటపట్టించడం సరదా అనిపిస్తుంది. పల్లెకు వెళ్లకుండా సంక్రాంతిని ఎంజాయ్ చేయడం ఇంపాజిబుల్. ఎందుకంటే ఈ పండగకు అనుబంధంగా జరిగే ఎద్దుల పందేలు, కోడి పందేలు, కబడ్డీ, సైకిల్ రేస్ ఇలాంటివి ఏవీ ఇక్కడకు తేలేం కదా. ఏ రూపంలో నైనా ఈ సంప్రదాయ వైభవం ప్రస్తుత జనరేషన్‌కి తెలియాల్సిందే. మనం మన పిల్లలకి వాళ్లు వాళ్ల పిల్లలకు చెప్పుకుంటూ వెళ్లాలి. అప్పుడే భవిష్యత్తులోనూ సంప్రదాయ వారసత్వం నిలబడుతుంది. – సన్నీ అరుణ్, టీవీ నటుడు అక్కడేఅసలైన పండగ.. ఎన్ని ఏర్పాట్లు చేసినా సిటీలో పండగ వాతావరణం ప్రతిఫలించలేం. అందుకే మా కార్యక్రమాల కోసం పల్లెలకు వెళ్లాం. మేం వైజాగ్‌లో ఉన్నప్పుడు ఈ ఫెస్టివల్‌ని బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఏ ఇంటి ముందు చూసినా పండగ వాతావరణమే. భోగి ముందు రోజు బాగా కలర్స్ అవీ కలుపుకొని ఆ రోజు రాత్రిపూట వీధుల్లోనే ఒంటి గంట వరకూ ఉండడం, తెల్లవారుజామున నలుగు పెట్టుకుని స్నానాలు చేసి భోగి మంటలు వేసి దాని ముందు ఎంజాయ్ చేయడం, ఇల్లిల్లూ తిరిగి ఎవరి ముగ్గు బావుందంటూ చర్చించుకోవడం.. ఎంత బావుంటాయో.. అవన్నీ అందరికీ గుర్తు చేయాలనేదే మా ఆలోచన. సంప్రదాయాలంటే ఎన్నో తరాల నుంచి మనలో జీర్ణించుకుపోయిన, మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంపద దీంతో సరిపోల్చేది ఏదీ లేదు. ప్రపంచం ఎంత మారిపోతున్నా పిల్లలు మన సంప్రదాయాల్ని మర్చిపోయేలా చేయకూడదు. – సునంద, నటి -
అల్లూరులో బుల్లితెర నటుల సందడి
అమరావతి, అల్లూరు(వీరులపాడు): మండలంలోని అల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలలో బుల్లితెర నటీమణులు ప్రీతినిగం, జ్యోతి పూర్ణిమ, సౌజన్య, సుమనశ్రీ, శ్రీనిధిలు సందడి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రత్యేకాకర్షణగా నిలవటంతో పాటు ప్రజలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతమైన అల్లూరుకు రావటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం నటీమణులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణకుమార్, సర్పంచ్ కోటేరు సూర్యనారాయణ రెడ్డిలు నూతన వస్త్రాలు బహూకరించి సత్కరించారు. -
టీవీ ఆర్టిస్టులను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న టీవీ ఆర్టిస్టులను అడ్డుకున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమైంది. మాట మాట పెరగడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లలో కేసు నమోదయింది. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపూర్ స్థానం కమలం పార్టీకి దక్కింది. బీజేపీ అభ్యర్థిగా సి.బల్వీంద్రనాథ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వి.సునీత లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సీహెచ్ మదన్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నుంచి డి.బస్వానందం బరిలో ఉన్నారు. -
మోసం చేయడం కాదు.. నేనే మోసపోయాను..
-
'చిట్టీల రాణి'... చిక్కిందిలా...
-
'చిట్టీల రాణీ'.. చిట్టచివరికిలా దొరికింది !
-
పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి
హైదరాబాద్: టీవీ నటీనటులకు దాదాపు 10 కోట్ల రూపాయలకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను, ఆమె అనుచరులు పది మందిని సీసీఎస్ పోలీసులు బెంగళూరులో పట్టుకున్నారు. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. -
చిట్టీల రాణి ఆచూకీ తెలిస్తే చెప్పండి
ప్రజలకు పోలీసుల వినతి 4 బ్యాంక్ అకౌంట్లు, కారు సీజ్ సాక్షి, సిటీబ్యూరో: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచి పారిపోయిన బత్తుల విజయరాణి ఆచూకీ తెలిస్తే నగర సీసీఎస్ పోలీసులకు తె లపాలని డీసీపీ జి.పాలరాజు, ఏసీపీ విజయ్‌కుమార్ ప్రజలను కోరారు. విజయరాణిపై ఈనెల 13న చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు. శ్రీనగర్‌కాలనీలోని ఆమె ఫ్లాట్‌ను శుక్రవారం సీజ్ చేసిన పోలీసులు... తాజాగా రూ.6 లక్షల విలువ చేసే ఆమె కారు (ఏపీ 09 సీఎస్ 4931)ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీనగర్‌కాలనీలోని ఎస్బీఐ, ఆంద్రాబ్యాంక్, ఎస్బీహెచ్, కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్న ఆమె నాలుగు అకౌంట్లను కూడా శనివారం సీజ్ చేయించారు. అందులో కేవలం రూ.300 కంటే ఎక్కువ లేవు. ఆ ఖాతాల్లోని డబ్బులను నిందితురాలు పథకం ప్రకారం ముందే డ్రా చేసుకొని పారిపోయింది. విజయరాణి ఆచూకీ తెలిసివారు 9490616703,9490616291 సెల్నెంబర్లకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. -
‘సినీ, టీవీ కళాకారులకు 20శాతం టికెట్లివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ కళాకారులకు 20% సీట్లు కేటాయించాలని దర్శకుడు పీసీ ఆదిత్య ఆది వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశా రు. ఓట్ల కోసం అన్ని పార్టీలు కళాకారుల గ్లామర్‌ను వాడుకుంటున్నా యని, సీట్లపై మాత్రం స్పందిం చడం లేదని విమర్శించారు. -
టీవీక్షణం: వెండితెర వయా బుల్లితెర!
టీవీ ఆర్టిస్టులు సినిమాల్లో సక్సెస్ కావడం కష్టం... చాలా తేలికగా అనేస్తారీ మాటని. కానీ అలా అనేముందు గుర్తు తెచ్చుకోవాల్సిన వాళ్లు కొందరున్నారు. వారు తమ కెరీర్‌కి పునాదిని బుల్లితెర మీదే వేసుకున్నారు. అక్కడ పని చేస్తూనే వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు స్టార్‌సగా వెలుగొందుతున్నారు. షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్షా అని పిలుచుకునే ఈ సూపర్‌స్టార్ తన తొలి అడుగు టెలివిజన్ రంగుంలోనే వేశాడు. ఫౌజీ, దిల్ దరియా వంటి సీరియల్స్‌లో నటించాడు. ‘సర్కస్’ సీరియల్ అతడిని అందరి దృష్టిలో పడేలా చేసింది. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కట్‌చేస్తే... బాలీవుడ్లో తిరుగులేని నటుడయ్యారు షారుఖ్. జాతీయ అవార్డునందుకున్న నటి విద్యాబాలన్ కూడా టీవీలోనే ఓనమాలు దిద్దుకుంది. ‘హమ్ పాంచ్’ సీరియల్లో నటించిన విద్య ప్రతిభ ఆమెను సినిమాల్లోకి లాక్కెళ్లింది. తొలి సినిమా ‘పరిణీత’ సూపర్ హిట్. ‘లగేరహో మున్నాభాయ్’ డూపర్ హిట్. ‘డర్టీ పిక్చర్’ బంపర్ హిట్. ‘కహానీ’ సెన్సేషనల్ హిట్. ఆమె కోసం ఇప్పుడు ప్రత్యేకంగా కథలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆమె రేంజ్ ఏమిటో! హిందీ సీరియల్స్ నుంచి సినిమాల దాకా ప్రయాణించిన మరో నటి హన్సిక. చిన్నతనంలో ‘షకలక బూమ్‌బూమ్’ అనే కార్యక్రమంలో తొలిసారి తెరమీద మెరిసిన హన్సిక, ఆ తర్వాత ‘దేశ్‌మే నిక్లా హోగా చాంద్’ సీరియల్లో నటించింది. మరి ఇప్పుడు ఆమె ఏ స్థాయి నటి అయ్యిందో చూస్తున్నాం కదా! ఇప్పుడిప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న ప్రాచీ దేశాయ్ కూడా టీవీ నటే. సినిమాలను వద్దనుకుని, క్రికెట్ కామెంటేటర్‌గా సెన్సేషన్ సృష్టించిన మందిరాబేడీ కూడా సీరియల్ నటే. ఇక మన ప్రకాశ్‌రాజ్. ఆయన తెలుగువారు కాదు. అయినా ఆ విషయాన్ని మనం నమ్మం. అంతగా టాలీవుడ్లో పాతుకుపోయారు. ఆయన కూడా మొదట్లో సీరియల్ నటుడే. ‘గుప్పెడు మనసు’ సీరియల్ గుర్తుంది కదా! బాలచందర్ దర్శకత్వం వహించి, గీత లీడ్ రోల్ చేసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలామంది అమ్మాయిలు అలాంటి భర్త కావాలని కోరుకున్నారు. అతడే ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో ప్రత్యక్షమవుతాడని, తిరుగులేని నటుడవుతారని ఎవరూ ఊహించలేదు. ఇక స్వాతి గురించి చెప్పాల్సిన పని లేదు. ‘కలర్స్’ ప్రోగాములో ఆమె యాంకరింగుకు అందరూ ఫిదా అయిపోయారు. యువకులు అయితే ఆమె కోసమే ఆ కార్యక్రమాన్ని చూశారు. ఇప్పుడామె సినిమాల్లో బిజీ అయిపోయింది. వీళ్లే కాదు. టెలివిజన్ తెర మీద మెరిసి, ఆ తర్వాత వెండితెరపై వెలిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మహా సముద్రం లాంటి సినీ పరిశ్రమ వైపు నడిపించే నావ టెలివిజన్. అందుకే నటనను లక్ష్యంగా ఎంచుకున్నవారి ప్రయాణం ఆ నావలోనే మొదలవు తోంది. కచ్చితంగా ఏదో ఒక తీరానికి చేరుస్తుందని, మధ్యలో మాత్రం ముంచేయదని దాని మీద అందరికీ అంత నమ్మకం మరి!