
మాట్లాడుతున్న బుల్లితెర నటీమణులు
అమరావతి, అల్లూరు(వీరులపాడు): మండలంలోని అల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలలో బుల్లితెర నటీమణులు ప్రీతినిగం, జ్యోతి పూర్ణిమ, సౌజన్య, సుమనశ్రీ, శ్రీనిధిలు సందడి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రత్యేకాకర్షణగా నిలవటంతో పాటు ప్రజలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు గ్రామీణ ప్రాంతమైన అల్లూరుకు రావటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం నటీమణులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణకుమార్, సర్పంచ్ కోటేరు సూర్యనారాయణ రెడ్డిలు నూతన వస్త్రాలు బహూకరించి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment