నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న టీవీ ఆర్టిస్టులను అడ్డుకున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ ప్రారంభమైంది. మాట మాట పెరగడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లలో కేసు నమోదయింది.
టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపూర్ స్థానం కమలం పార్టీకి దక్కింది. బీజేపీ అభ్యర్థిగా సి.బల్వీంద్రనాథ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వి.సునీత లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నుంచి సీహెచ్ మదన్‌రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నుంచి డి.బస్వానందం బరిలో ఉన్నారు.
టీవీ ఆర్టిస్టులను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
Published Mon, Apr 14 2014 12:31 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM
Advertisement
Advertisement