పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం | Thin Rice for Hostel Students | Sakshi
Sakshi News home page

పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం

Published Mon, Jan 12 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

జూలూరు గౌరీశంకర్

జూలూరు గౌరీశంకర్

 సందర్భం

 సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో ఉండే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతోంది.
 
 ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నంకు నిర్వచనమైన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసే పనికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల ఆకలి తీర్చే సంక్షేమ హాస్టల్ కంచం లో సన్నబియ్యం బువ్వతో తెల్లగా మెరిసిపోతుంది. ఉద్య మకారుడు కేసీఆర్ పాలకుడైనందునే తెలంగాణ ప్రభుత్వం తల్లి కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అం దించే పనికి సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకం అమ్మ చేతి వంటగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది తొలి మెట్టుగా భావించాలి.
 కాలం కళ్ల ముందు కర్పూరంలా కరిగిపో తుంటే కళ్లలో వొత్తులేసుకుని మార్పుల కోసం తెలంగాణ ఎదు రుచూసింది. ఎదురుచూసిన చూపులకు విజయాలు కనిపిస్తే అంతకంటే కావాల్సిందే ముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మారాలని, ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు వసతులను పెంచాలని విద్యార్థి సంఘాల న్నీ ముక్తకంఠంతో నినదిస్తూనే వస్తున్నాయి. కొన్ని వందల వేల విజ్ఞప్తులు, ధర్నాలు, పికెటింగ్‌లు, ప్రదర్శన లు, బంద్‌లు అనివార్యంగా జరుగుతూనే ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగు పడాల ని సుదీర్ఘకాలం విడువని పోరాటంగా ఎందరెందరో కృష్ణయ్యలు పోరాడుతూనే ఉన్నారు. కొన్ని సమస్యలను సాధించుకోవటం కూడా జరిగింది. పాలకులు సంక్షేమ హాస్టల్స్ అంటే సవతి పిల్లలుగానే చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే భౌగోళిక హద్దులు ఏర్పడ తాయి తప్పితే, మార్పులు ఏం జరుగుతాయని ఉద్యమకాలంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందని, ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించిన వారికి సమాధానంగా అనేక మార్పులు జరుగుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. పురుగు లన్నం, చారు, వసతులు సరిగాలేని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుని ఎదిగివచ్చిన వ్యక్తి చేతికి ఆర్థిక శాఖ పగ్గాలనివ్వటమే గాకుండా, సన్నబియ్యంతో అన్నం వండిపెట్టే పనిని ఈటెల రాజేందర్‌కు ఇవ్వటం తో కేసీఆర్ నూతన చరిత్రకు ద్వారాలు తెరిచినట్ల యింది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో సమాజంలో విసిరేసినట్లుగా మిగిలిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతుంది. లేకుంటే అంత తొందరగా పేద హాస్టల్ పిల్లల కంచాల లోకి సన్నబియ్యం వచ్చేనా అని ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సి ఉంది. ముక్కిపోయిన బియ్యం, ముతక బియ్యం, రేషన్ బియ్యం హాస్టల్స్‌కు పంపి చేతులు దులుపేసుకునే దుస్థితికి చరమగీతం పాడటం జరిగింది. కేసీఆర్ ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ ఎన్నికల ప్రణాళికల నుంచి ఆచరణ ప్రణాళికలుగా మారటం తెలంగాణకు శుభపరిణామంగా మారుతు న్నాయి.

సాంఘిక  సంక్షేమ హాస్టళ్లు అమ్మ ఒడిగా మారినప్పుడే ప్రభుత్వాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ దేశానికి మానవ వనరులను అందించే భావి భారతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చా రు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నరక కూపాలుగా మార్చివేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో తొలిగా బాగు చేసుకోవాల్సింది ప్రభుత్వ బడిని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. పేద వర్గాల పిల్లలకు ప్రమాణాలు గల విద్యను అందించేం దుకు మా ప్రభుత్వం నడుం కట్టిందని చెప్పడానికి తొలిమెట్టుగా హాస్టళ్ల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే పేద పిల్లల కంచాలలోకి సన్న బియ్యం అందించే పని ఎంతో ఉన్నతమైనది. మధ్యా హ్న భోజన పథకం విజయవంతం కావాలంటే అమ్మ పెట్టే అన్నం ముద్దగా పిల్లలకు కడుపునిండా శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. ఈ పిల్లలకు పెట్టే ప్రతిపైసా ఖర్చు రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఈ దేశ భవిష్యత్‌కు వెలకట్టలేని పెట్టుబడిగా మారుతుంది.
 పీ.వీ.నర్సింహారావు విద్యాశాఖా మంత్రిగా ఉన్న ప్పుడు ఏర్పరచిన సర్వేల్ లాంటి గురుకుల పాఠశాలలే ఆ తర్వాత దేశం మొత్తానికి నవోదయ స్కూల్స్‌గా రూపుదాల్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన మండలానికి ఒక గురుకుల పాఠశాల అన్నది సఫలీకృతమైతే దేశానికి ఈ విధానం ఆదర్శవంతంగా నిలుస్తుంది.

 గురుకుల విద్యావ్యవస్థ విజయవంతంగా నిలబ డేందుకు తీసుకున్న తొలి నిర్ణయంగా హాస్టళ్లకు సన్న బియ్యం అమలు కార్యక్రమంగా చూడవచ్చును. సాంఘి క సంక్షేమ హాస్టళ్లను మరింత విస్తృతపర్చాల్సి ఉంది. పేద పిల్లలకు అన్ని వసతులు అందించే విధంగా మొత్తం పాలనా యంత్రాంగం పని చేయాలి. పేద పిల్లలకు నాసిరకమైన తిండిపెడితే, వారికి వచ్చే నిధుల ను మింగే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. పేద వర్గాల పిల్లలకు మంచి వసతులు, వారికి మేలైన విద్యనందిస్తే అది దేశానికి తిరుగులేని బలం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చలికి వణుకుతున్న విద్యార్థికి కప్పుకునే దుప్పటి కావాలి. కంచంలో మెరిసే తెల్లటి అన్నంగా ప్రభుత్వం కనిపించాలి. హాస్టళ్లల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తుడిచివేసే చేతులుగా ప్రభుత్వం మారాలి. నెత్తికి నూనెలేని చింపిరి జుట్లకు చల్లదనాన్నిచ్చే కొబ్బరినూనెగా మారాలి.

 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నుంచి వచ్చిన పిల్లలే నవలోకాలు వికసింపజేస్తారు. కొత్త శకానికి ఈ సంక్షేమ హాస్టళ్లే ప్రాణం పోయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను శక్తివంతం చే స్తే అక్కడి నుంచి వచ్చిన పిల్లలు దేశాన్ని అన్నిరంగాల్లో సర్వసమర్థంగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు సన్నబియ్యం అందించే ఈ పథకాన్ని విజయవంతం చేసే పనిలో మొత్తం పాలనా యంత్రాంగం సఫలీకృతం కావాలి. పేద పిల్లల నోటికాడ కూడును కూడా సొమ్ము చేసుకునే అవినీతిపరులను జైలుకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
     (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు
     మొబైల్ : 90599 67525)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement