![Food Poisoning : Hostel Students Hospitalised in Nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/24/food-poision.jpg.webp?itok=h3T4uZMU)
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్‌లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. అయితే, ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment