రోడ్డున పడ్డ బీసీ హాస్టల్ విద్యార్థులు
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతిగృహం విద్యార్థులు రోడ్డును పడ్డారు. విషయంలోకి వెళ్తే జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ ఓప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల అగ్రిమెంట్ సమయం ముగియడంతో ఖాళీచేయమని భవనం యజమాని పలు సార్లు విజ్ఙప్తి చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు.
దీంతో భవనం యజమాని మంగళవారం ఉదయం భవనంలోని విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు ఇతర వస్తువులను బయట పడేశారు. భవన యజమాని ఆదేశాలమేరకు హాస్టల్ వాచ్‌మన్, వంటమనిషి హాస్టల్‌లోని వస్తువులను బయట పడేయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. విద్యార్థులు విషయాన్ని సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు తెలియజేశారు. అయితే హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు.