సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు సంకటంలో పడ్డాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 776 పాఠశాల వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాలల్లో తీసుకుంటారు. ఈ క్రమంలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనంతోపాటు పాలు, చిరుతిళ్లకు సంబంధించిన బిల్లులను సదరు హాస్టల్ వార్డెన్‌కు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.
82కోట్లు బకాయిలు
బీసీ సంక్షేమ హాస్టళ్లలో బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా నిధులివ్వలేదు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని హాస్టళ్లకు నిధులిచ్చినప్ప టికీ వాటిని గతేడాది బకాయిల తాలూకు బిల్లులుగా చెల్లించినట్లు వసతిగృహ సంక్షేమాధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం బీసీ హాస్టళ్లకు సంబంధించి రూ.82 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా మెస్ చార్జీలకు సం బంధించినవే ఉన్నాయి. ఇవిగాకుండా వసతిగృహ నిర్వ హణ కేటగిరీలోనూ బకాయిలు భారీగానే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలతోపాటు హాస్టల్ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు సైతం ఆర్నెల్లుగా అందలేదు. మెస్ చార్జీలతో పాటు ఇతర బిల్లులేవీ రాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులకు ఇబ్బం దులు తీవ్రమయ్యాయి. వరుసగా 5నెలల బిల్లులు రాకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ భారమవుతోంది.
విద్యార్థులకు క్రమం తప్పకుండా స్నాక్స్, భోజనం ఇచ్చేందుకు కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొసు ్తన్నారు. 5 నెలలుగా సరుకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు కూరగాయల కొనుగోలుపైనా ఇదే ప్రభావం పడింది. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోందని రం గారెడ్డి జిల్లాకు చెందిన ఓ వసతి గృహ సంక్షేమాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గత పది నెలలుగా కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ల పేరుతో ప్రత్యేకంగా కాస్మెటిక్ కిట్లు ఇస్తామని అధి కారులు ప్రకటిం చినప్పటికీ, అవి కేవలం గురుకులాలకు మాత్రమే పరిమితమయ్యాయని, హాస్టల్ విద్యార్థులకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వసతిగృహ నిర్వహణ నిధులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులను కలిసి వినతులు సమర్పిం చినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment