ఉల్లిపాయలకు బదులు క్యాబేజీ
మెను సక్రమంగా అమలు చేస్తారంటే.. అదీ లేదు. సరైన కూరలు పెట్టరు. సాంబారు నీళ్లలా ఉంటోంది. ఉల్లిపాయలకు బుదులు క్యాబేజీలను వంటల్లో వినియోగిస్తున్నారు. సరైన సౌకర్యాలూ కల్పించడం లేదు.. ఇదీ బొడ్డుగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థునుల ఆవేదన. వారి సమస్యలు ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో, కడుపుమంది రోడ్డెక్కారు. మంగళవారం జాతీయ రహదారిపై ఆశ్రమ పాఠశాల ఎదురుగానే రాస్తారోకో చేపట్టారు. ఆయా సమస్యలతో పాటు అధికారులపై పలు ఆరోపణలు చేశారు. జీరో అకౌంట్ కోసం తమ వద్ద రూ.200 చొప్పున వసూలు చేశారని, స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా కూడా సరిగ్గా ఆవిష్కరించలేదని ఆరోపించారు. మెను సక్రమంగా అమలుకాక అస్వస్థతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం అర్జున్ వీరికి మద్దతు పలికారు.
– బొడ్డుగూడెం(చింతూరు)