పట్నా: 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి స్కూల్ టీచర్ అభిషేక్ కుమార్ కూడా సహకరించాడు.
కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి నేడు పాట్నా కోర్టు ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.
చదవండి: యువకుడి మోసం.. మైనర్ బాలిక ప్రసవం
Comments
Please login to add a commentAdd a comment