ప్రతీకాత్మకచిత్రం
పూణే : పాఠశాల విద్యార్థికి అశ్లీల వీడియోను చూపిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసినట్టు పూణే పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండాలని బాధితుడికి సూచించిన స్కూల్ మహిళా కౌన్సెలర్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 14 సంవత్సరాల పాఠశాల విద్యార్థికి ప్రిన్సిపల్ అశ్లీల వీడియోను చూపుతూ లైంగికంగా వేధించాడని, దీనిపై స్కూల్‌కు చెందిన మహిళా కౌన్సెలర్‌కు బాలుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు.
అయితే ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె బాధిత బాలుడిని ఈ ఘటనపై ఎక్కడా నోరువిప్పరాదని కోరారని తెలిసిందన్నారు. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు సైతం తమ కుమారుడి చదువు దెబ్బతింటుందనే భయంతో మౌనంగా ఉన్నారని, ఘటనపై తమకు సమచారం అందడంతో తాము కలుగచేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.స్కూల్ ప్రిన్సిపాల్, కౌన్సెలర్‌లపై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment