కోల్‌కతా: మహిళా డాక్టర్ హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అరెస్టుపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ‘ఇది అంతానికి ఆరంభం’అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఘోష్ అరెస్టుపై బోస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించే బోస్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న ప్రచారం జరుగుతోంది. బోస్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాతే ఘోష్ అరెస్టు జరగడం గమనార్హం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అక్రమాలపై ప్రిన్సిపల్ ఘోష్‌పై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఘోష్‌ను సోమవారం(సెప్టెంబర్2) సీబీఐ అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment