కోటా: రాజస్థాన్‌లోని కోటాలో గల ఒక పాఠశాలలో వాట్సాప్ గ్రూప్‌లోని వినాయక చవితి సందేశాలను తొలగించిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు చుక్కలు చూపించారు. మత సామరస్యానికి ప్రిన్సిపాల్ విఘాతం కలిగిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే కోటా జిల్లాలోని లాటూరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాట్సాప్‌లో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూప్‌లో వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలను పంపుతున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ మెసేజ్‌లను డిలీట్ చేస్తూ వచ్చాడు. దీనికి ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను ఎందుకిలా చేస్తున్నారంటూ నిలదీశారు.
విషయం పోలీసుల వరకూ చేరడంతో వారు వివాదం జరుగుతున్న పాఠశాలకు వచ్చారు. ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. తరువాత ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు బాపవార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఉత్తమ్‌సింగ్ తెలిపారు. భరత్ అనే వ్యక్తి ఈ వాట్సాప్ గ్రూప్‌లో గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపాడు. పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపాల్ దానిని తొలగించారు. ఇలాంటి సందేశాలను అతను తొలగిస్తూ వచ్చాడు. కాగా పోలీసులు ప్రిన్సిపాల్‌పై బీఎన్‌ఎస్‌సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment