Bengal governor
-
‘అంతం ఆరంభమైంది’: బెంగాల్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: మహిళా డాక్టర్ హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్ అరెస్టుపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. ‘ఇది అంతానికి ఆరంభం’అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఘోష్ అరెస్టుపై బోస్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.తృణమూల్ కాంగ్రెస్‌ను ఉద్దేశించే బోస్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న ప్రచారం జరుగుతోంది. బోస్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాతే ఘోష్ అరెస్టు జరగడం గమనార్హం. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అక్రమాలపై ప్రిన్సిపల్ ఘోష్‌పై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే ఘోష్‌ను సోమవారం(సెప్టెంబర్2) సీబీఐ అరెస్టు చేసింది. -
రాజ్‌భవన్ ఆవరణను తక్షణమే ఖాళీ చేయండి
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
ఈడీ అధికారులపై దాడి.. బెంగాల్ గవర్నర్ ఫైర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందా బోస్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికాను వివరణ ఇవ్వాలన్నారు. ఉత్తర 24 పరగణాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేయడినికి వెళ్లగా.. ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపైకి దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో షాజహాన్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలనుకున్నారు. ఈడీ సోదాలు.. షాజహాన్ మద్దతుదారులతో దాడులతో ఆందోళనకంగా మారాయి. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై రాష్ట్రం గవర్నర్ ఆనందా బోస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ హింస బాధ్యత మొత్తం ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘోరమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని అనాగరిక విధ్వంసం నుంచి కాపాడాలని అన్నారు. ఇటువంటి విధ్వంసాలనను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలైమైతే.. రాజ్యాంగబద్దంగా తనకు ఉండే అధికారలతో తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. West Bengal Governor CV Ananda Bose says, "It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… pic.twitter.com/CH7Q12Qx7R — ANI (@ANI) January 5, 2024 అయితే ఈడీ అధికారులపై జరిగిన దాడులను ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడు చేయటం అనేది సిగ్గుపడవల్సిన ఘటన అని దుయ్యబట్టారు. నెలరోజుల నుంచి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లో పంపిణీ చేయాల్సిన సరుకులను సుమారు 30 శాతం దాకా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ పంపిణీని పక్కదారి పట్టించడంలో మిల్లర్లు, పజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులు కుమ్మకైనట్లు ఈడీ ఆరోపిస్తుంది. చదవండి: రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం -
West Bengal: ‘ఓటు వేసేందుకు ప్రజలు ప్రాణాలనే ఒడ్డారు’
కోల్‌కతా: ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రంలో ప్రజలు తమ ప్రాణాలనే పణంగా పెట్టారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ వ్యాఖ్యానించారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో త్వరలో స్వయంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ‘రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస ఆందోళనకరం. హింస ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్న విజ్ఞప్తిపై రాష్ట్ర యంత్రాంగం నుంచి సమాధానం రాలేదు’ అని వెల్లడించారు. మీ మరణానికి, మీ ఆస్తుల విధ్వంసానికి, మీపై దాడులకు మీరు ఓటు వేయడమే కారణమైతే, అక్కడ ప్రజాస్వామ్యం నశించిందనడానికి అదే సంకేతం’ అని వ్యాఖ్యానించారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో 16 మంది వరకు చనిపోయినట్లు సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. (చదవండి: బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం) -
‘నాజీవితంలో ఇంత అవమానం పడలేదు’
కోల్‌కతా: ‘ఇలాంటి మాటలు నా జీవితంలో ఇప్పటి వరకు వినలేదు. అలాంటి భాష నేనెప్పుడు చూడలేదు. క్షమించండి ఇలాంటి భాష మున్ముందు వినాలనుకోవడం లేదు’అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ గవర్నర్ త్రిపాటిని ఉద్దేశించి అన్నారు. గవర్నర్ తనతో మాట్లాడిన ప్రతిసారి అవమానిస్తున్నారని, అవహేళన చేస్తున్నారని మండిపడిన ఆమె ఆయన ఉపయోగిస్తున్న భాష తన జీవితంలో ఇప్పటి వరకు వినలేదని చెప్పారు. ‘ఆయన మాట్లాడే తీరు నాకు అవమానంగా అనిపిస్తోంది. గవర్నర్ బీజేపీ బ్లాక్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి.. అలాంటి భాష ఇక నేను వినాలనుకోవడం లేదు. నా జీవితంలో ఇలాంటి భాష వినలేదు. ఆయన నన్ను బెదిరిస్తున్నారు. ఆయనతో మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడే రాజీనామా చేసి నా కుర్చీలో నుంచి దిగిపోవాలనిపిస్తోంది. నేనేం ఆయన ఆశీస్సులతో అధికారంలోకి రాలేదు. ప్రజల దీవెనలతో వచ్చాను. ఆయన నిజంగా రాజ్యాంగ బద్ధ పదవిని అనుభవిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఒక వర్గం వైపే మాట్లాడితే ఎలా? రెండు వైపుల ఉన్న వాదాలు వినాలి. నా మనసు తీవ్రంగా గాయపడింది. మతం పేరిట విభజన చేయడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను. నేను ప్రజల ద్వారానే అధికారంలోకి వచ్చాననే విషయం మర్చిపోవద్దని గవర్నర్ గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బదురియా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మాట్లాడేందుకు గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. -
గవర్నర్, సీఎం మమత మధ్య వార్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు విషయంలో సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర గవర్నర్ కేశ్రీనాథ్ త్రిపాఠి పరోక్షంగా తోసిపుచ్చారు. బాధ్యతాయుతమైన ఆర్మీ వంటి వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్త వహించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అయితే, గవర్నర్ వ్యాఖ్యలను సీఎం మమత తప్పుబట్టారు. కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా ఆయన నగరంలో లేరు. ప్రటకనలు చేసేముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం’ అని మమత మీడియాతో అన్నారు. టోల్‌ప్లాజాల వద్ద అనూహ్యంగా సైన్యాన్ని మోహరించడంతో దీనిపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్యం మోహరింపును వ్యతిరేకిస్తూ.. వెంటనే బలగాలను వెనుకకు పంపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజ్‌భవన్ ముందు తృణమూల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. శనివారం గవర్నర్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇంతలో గవర్నర్ త్రిపాఠి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బెంగాల్ గవర్నర్‌కు బీహార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ప్రకటించింది. బీహార్ ప్రస్తుత గవర్నర్ డీవై పాటిల్ పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్‌ను నియమించేంత వరకు బీహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కైలాస్‌నాథ్‌ను ఆదేశించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది.