కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందా బోస్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికాను వివరణ ఇవ్వాలన్నారు.
ఉత్తర 24 పరగణాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేయడినికి వెళ్లగా.. ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపైకి దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో షాజహాన్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలనుకున్నారు. ఈడీ సోదాలు.. షాజహాన్ మద్దతుదారులతో దాడులతో ఆందోళనకంగా మారాయి.
ఈడీ అధికారులపై జరిగిన దాడిపై రాష్ట్రం గవర్నర్ ఆనందా బోస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ హింస బాధ్యత మొత్తం ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘోరమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని అనాగరిక విధ్వంసం నుంచి కాపాడాలని అన్నారు. ఇటువంటి విధ్వంసాలనను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలైమైతే.. రాజ్యాంగబద్దంగా తనకు ఉండే అధికారలతో తాను చర్యలు తీసుకుంటానని అన్నారు.
West Bengal Governor CV Ananda Bose says, "It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… pic.twitter.com/CH7Q12Qx7R
— ANI (@ANI) January 5, 2024
అయితే ఈడీ అధికారులపై జరిగిన దాడులను ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడు చేయటం అనేది సిగ్గుపడవల్సిన ఘటన అని దుయ్యబట్టారు. నెలరోజుల నుంచి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లో పంపిణీ చేయాల్సిన సరుకులను సుమారు 30 శాతం దాకా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ పంపిణీని పక్కదారి పట్టించడంలో మిల్లర్లు, పజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులు కుమ్మకైనట్లు ఈడీ ఆరోపిస్తుంది.
చదవండి: రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment