‘నాజీవితంలో ఇంత అవమానం పడలేదు’
‘ఆయన మాట్లాడే తీరు నాకు అవమానంగా అనిపిస్తోంది. గవర్నర్ బీజేపీ బ్లాక్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇలా చెప్తున్నందుకు క్షమించండి.. అలాంటి భాష ఇక నేను వినాలనుకోవడం లేదు. నా జీవితంలో ఇలాంటి భాష వినలేదు. ఆయన నన్ను బెదిరిస్తున్నారు. ఆయనతో మాట్లాడిన తీరు చూస్తుంటే ఇప్పుడే రాజీనామా చేసి నా కుర్చీలో నుంచి దిగిపోవాలనిపిస్తోంది. నేనేం ఆయన ఆశీస్సులతో అధికారంలోకి రాలేదు. ప్రజల దీవెనలతో వచ్చాను.
ఆయన నిజంగా రాజ్యాంగ బద్ధ పదవిని అనుభవిస్తున్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఒక వర్గం వైపే మాట్లాడితే ఎలా? రెండు వైపుల ఉన్న వాదాలు వినాలి. నా మనసు తీవ్రంగా గాయపడింది. మతం పేరిట విభజన చేయడాన్ని నేను ఏమాత్రం అంగీకరించను. నేను ప్రజల ద్వారానే అధికారంలోకి వచ్చాననే విషయం మర్చిపోవద్దని గవర్నర్ గుర్తుంచుకోవాలి’ అని మండిపడ్డారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని బదురియా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మాట్లాడేందుకు గవర్నర్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.