సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే కొత్తగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి. శుక్ర వారం సీఎం కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
రాష్ట్ర సొంత నిధులతో ఇలా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలను ప్రారంభించడం దేశంలో ఇదే ప్రథమమని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా.. సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లలోనే కొత్త 21 కాలేజీలను ఏర్పాటు చేశారని అంటున్నాయి. వచ్చే ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారని.. వాటితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యం పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment