స్కూలు ప్రిన్సిపల్ మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు.
స్కూలు ప్రిన్సిపల్ మందలించాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పరిధిలో చోటుచేసుకుంది. క్రాంతి పబ్లిక్ స్కూల్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థి అమరేష్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాడని స్కూల్ ప్రిన్సిపల్ తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనపడకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.