విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఓ విద్యార్థినిని వేధించాడో ప్రిన్సిపల్.
సారంగపూర్(ఆదిలాబాద్): విద్యాబుద్ధులు నేర్పాంచాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉండి ఓ విద్యార్థినిని వేధించాడో ప్రిన్సిపల్. ఈ ఘటన మంగళవారం సారంగపూర్ మండలం జామ్ రెసిడెన్సియల్‌లో జరిగింది. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ప్రిన్సిపల్‌పై ఆరోపణలు వెలువెత్తాయి.
ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.