చిన్న పిల్లలు బడికి పొమ్మంటేనే తెగ మారాం చేస్తారు. కానీ ఈ ఫొటోలోని 12 ఏళ్ల అబ్బాయికి మాత్రం చదువు అంటే మహా ప్రాణం. తాను చదువుకోవడమే కాదు.. చదువుకు దూరం అవుతున్న పిల్లలు కూడా చదువుకోవాలని ఎప్పుడూ అనుకుంటుండేవాడు. దీనికోసం ఏకంగా ఓ స్కూల్‌నే స్థాపించాడు.. ఈ అబ్బాయి పేరు లియోనార్డో నికనార్. అర్జెంటీనా దేశంలోని పీడ్రిటాస్ అనే చిన్న నగరానికి చెందినవాడు. చదువును పట్టించుకోకుండా ఎక్కువ సమయం ఆటలాడుతూ కాలక్షేపం చేసేవారి కోసం బడిని ప్రారంభించాడు. గతేడాది ఈ విషయాన్ని తన బామ్మకు చెప్పగా ఆమె.. స్కూల్‌ప్రారంభించేందుకు సాయం చేసింది. ఇప్పటివరకు ఈ స్కూల్‌లో దాదాపు 40 మంది పిల్లలు చేరారు.
లియోనార్డో ఈ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు.. ప్రిన్సిపాల్‌గా కూడా బాధ్యతలు చూసుకుంటున్నాడు. పాఠాలు నేర్చుకునేందుకు చిన్న పిల్లలతో పాటు చదువు రాని పెద్దలు కూడా హాజరవుతున్నారు. వారందరికీ ఎంతో ఓపికగా పాఠాలు చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఉదయం మొత్తం తాను స్కూల్‌లో చదువుకుని సాయంత్రం పూట సైకిల్‌పై వచ్చి మరీ పిల్లలకు పాఠాలు చెబుతాడట. ఎంత వాన పడ్డా.. మంచు కురిసినా లెక్క చేయకుండా కచ్చితంగా తన సొంత స్కూల్‌కు వెళతాడట. సాధారణ వేళల్లో పిల్లలు స్కూల్‌కు హాజరు కాకపోతే రాత్రి వేళల్లో ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటాడట. గ్రామర్, గణితం సబ్జెక్టులను పిల్లలకు బోధిస్తాడట మనోడు.
Comments
Please login to add a commentAdd a comment